వివరాలు ఆన్లైన్లో నమోదు…….

‘వివరాలు ఆన్లైన్లో నమోదు’

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-01T110159.340.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్, టెస్ట్ బుక్స్ వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఈ వివరాలను నమోదు చేయలేదని పేర్కొన్నారు. మండల విద్యాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వీటిని నమోదు చేయించాలని ఆయన కోరారు.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ..

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-51.wav?_=2

మండలంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు, వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారి సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఎరుకుల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, మాజీ ఎంపిటిసి ఏడాకుల రవిందర్, మామిండ్లవీరయ్యపల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి అతిధులుగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని తమ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపించిన వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు కూనమల్ల రాజన్ బాబు ,విద్యార్థులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం

మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం పందిపంపుల గ్రామంలో అవులు కాపరి నద్దునూరు రవి మృతి చెందాడువిషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దామెర రమేష్ ఆ కుటుంబానికి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు అనంతరం 25 కేజీల బియ్యాన్ని ఇచ్చారు అనంతరం ధామెర రమేష్ మాట్లాడుతూ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ వాటన్నిటికీ తట్టుకోని ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరు మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోకూడదని వారు సూచించారు మృతుడి కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఆర్థిక సహాయ చెయ్యాలి ఇందిరమ్మ ఇల్లు అలాగే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో. పార్టీ సభ్యులు ముక్లోత్ ప్రకాష్ . ఎల్లబోయిన సాగర్ చీపురు శీను, కారం రాకేష్, నరేష్, ముప్పిడి గణేష్, గట్టయ్య, కుంజం రాజు, తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్భాందవునిలా ఆదుకుంటుందని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ తాసిల్దార్ ఇమామ్ బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ చిలకల రాయ కొమురు జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, టేకుమట్ల చిట్యాల పలువురు మండల కాంగ్రెస్ నేతలు, లబ్ధిదారులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు

విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు
పంపిణీ చేసిన

కేంద్ర సహాయ
శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే..

పుంగనూరు(నేటి ధాత్రి):

 

 

 

 

భారత సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ఆధ్వర్యం లో భారత ప్రభుత్వ సంస్థ అలింకో,
చే చిత్తూరు
పివి కె,ఎన్,
గ్రౌండ్ నందు
గురువారం
విభిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కేంద్ర సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు హాజరయ్యారు
అనంతరం
విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాల
వారి చేతుల మీదుగాపంపిణీ చేయడం జరిగిందని వారు అన్నారు,
ఈ కార్యక్రమము లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ చల్లా రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో పెన్నులు బుక్కులు పంపిణీ

బిజెపి ఆధ్వర్యంలో పెన్నులు బుక్కులు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

అందుగులపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు బ్యాగులు పంపిణీ చేసిన బిజెపి నాయకులు…… మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగుల పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు బిజెపి రాష్ట్ర యువ నాయకులు దారా రవి సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు బ్యాగులు నోటుబుక్కులు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేష్ .

 

 

 

 

 

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే కాకుండా విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కృషి చేయడం జరుగుతుందని అందులో భాగంగానే బిజెపి నాయకులు రవి సాగర్ రావు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి బ్యాగులు, పెన్నులు నోటుబుక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు మునుముందు ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ మండలాధ్యక్షుడు జనార్ధన్ ఇన్చార్జ్ సంజీవరావు కన్వీనర్ అక్కల రమేష్ పట్టణ అధ్యక్షుడు నరేష్ సంతు రామ్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు

విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం :

ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకరపల్లి, నేటిధాత్రి :

 

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాలు (మినీ కిట్స్ – చిరు సంచులు)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి, స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి
మెట్ పల్లి జూలై 01 నేటి దాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి ఆర్ కే సాగర్ సూచనల మేరకు సీనియర్ నాయకులు కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి గంగం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల కిట్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం రోజున మెట్ పల్లి మండలం మారుతి నగర్ లో ఘనంగా జరిగింది . రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాజకీయాల్లో క్రియా శీలకంగా పాల్గొంటుందని వారు అన్నారు .ఇట్టి కార్యక్రమంలో బోగ చక్రదర్, రాజోగి కార్తీక్, ప్రణయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు .

మృతురాలు కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ.

మృతురాలు కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

దుర్గం అశోక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు 14వ వార్డులో నోముల సంపత్ తల్లి ఇటీవల మృతి చెందింది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుర్గం అశోక్ టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ దుర్గం రాజ సమ్మయ్య నేతకాని సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు గజ్జ రాజ్ కుమార్ కాంగ్రెస్ యూత్ నాయకులు వినయ్ బోడికల సంపత్ నరేష్ యాదవ్ అశోక్ చందు దుర్గం అనిల్ తదితరులు పాల్గొన్నారు

రామ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ.

రామ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ

అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యం వల్ల అకస్మాత్తుగా మరణించిన రామ సమ్మక్క జరిగింది 9వ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని ఇచ్చారు అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయసి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించిన చంద్రమౌళి మాదిగ రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులందరికీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి గాజుల బిక్షపతి మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామ్ చందర్ మాదిగ వికేసి విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు మారపల్లి చిన్న రాయకొమూరు గ్రామ సభ్యులు బండ బిక్షపతి రామ యాకుబ్ రామ్ సమ్మక్క కుటుంబ సభ్యులు రామ్ కృష్ణ కుమార్ రామ్ ధనుష్ రామ్ వర్ధన్ బొట్ల రవి రామ్ దేవేందర్ రామ్ ప్రశాంత్ బోట్ల కేశవులు బొట్ల అఖిల్ ఎలుకటి అన్వేష్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ .

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ

-ఏడూళ్ల బయ్యారం సీఐ
వెంకటేశ్వరరావు

-ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

-వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..

 

 

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడ్ వలస ఆదివాసీ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలోని సుమారు 50 కుటుంబాలకు దోమ తెరలను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ విధిగా దోమ తెరలను ఉపయోగించుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.అంతేకాకుండా సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమాజంలోని పేదలకు,అభాగ్యులకు అండగా నిలవడానికి అందరికి అవకాశం ఉందని కాబట్టి సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.అలాగే పేద గిరిజనుల ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రజల అవసరాలను సీజనల్ వారీగా గుర్తిస్తూ విశిష్ట సేవలందిస్తున్న ఫౌండేషన్ వారిని ప్రతేక్యంగా అభినందించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ..ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని దోమ తెరలతో ఆరోగ్యానికి భరోసా అని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో తమ ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి ఆవోప ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు !

వనపర్తి ఆవోప ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ

వనపర్తి నెటిదాత్రి:

 

వనపర్తి పట్టణ ఆ వో ప ఆధ్వర్యంలో గోపాల్పేట్ మండల కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా చాకల్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశామని వనపర్తి పట్టణ అవపా అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవోప ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా ప్రతి సంవత్సరం బ్యాగులు పంపిణీ చేస్తున్నామని ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ ఆవోప ప్రధాన కార్యదర్శి ఎల్ రవికుమార్ ఆర్థిక కార్యదర్శి సంబు వెంకటరమణ పట్టణ ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు గోనూరు వెంకటయ్య ప్రసాద్ రావు కటకం శ్రీధర్ భాస్కర్ శివ బాలేశ్వర్ పోలిశెట్టి మురళి కండే భాస్కర్ రత్న కుమార్ దోమ శివ సాయి నాగరాజ్ బి పరమేశ్వర్ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు .ఈ మేరకు వనపర్తి పట్టణ అవో ప వారికి ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రైతుల ప్రభుత్వమని పేదల కోసం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టిన ప్రభుత్వం అని అన్నారు అలాగే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం లోని చిట్యాల టేకుమట్ల మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు దాదాపు 25 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకల రాయకు ఉండు లక్ష్మణ్ గౌడ్, చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చిట్యాల నేటిధాత్రి :

 

జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు రాయితీపై మంజూరుైన డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన రైతులందరూ డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సమావేశంలో, ప్రతి అర్హ రైతుకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ పథకాలను అందించాలని ఆదేశించారని తెలిపారు.అలాగే, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతుల వినియోగం వలన తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధ్యపడతాయని, ఇది సమర్థవంతమైన నీటి వినియోగానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాజీ సర్పంచ్ ముకిరాల మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, సిగ్నెట్ కంపెనీ ఏరియా మేనేజర్ రాజు, జైన్ కంపెనీ ప్రతినిధి శ్యామ్ సుందర్ గారు, తదితరులు మరియు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని

#పార్టీలకు అతీతంగా ఆరోగ్య పరంగా అండగా ఉంటానని భరోసా…

#63 మంది లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

 

 

 

ప్రజల ఆరోగ్యం కోసం పతాకంగా నిలిచిన సీఎం సహాయనిధి చెక్కులను పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం రోజున బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు రూ 28,48,600/- విలువైన చెక్కులు ,వరంగల్ మండలానికి చెందిన 5 మందికి రూ.5,00,580/-ల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎవరికి అయినా ఊహించకుండా వస్తాయి. అటువంటి సమయంలో ప్రభుత్వ మద్దతు అనేది ప్రజలకు వెన్నంటే నిలిచి అండగా ఉంటుంది అని అన్నారు.
ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు పార్టీలు, కులాలు, మతాలు అనే భేదాలు ఉండవు. ఒక్క మనిషిగా చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటం కోసం నేనెప్పుడూ అండగా ఉంటాను అని తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం
ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వేలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం  పాల్గొన్నారు.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం చేపట్టనైనది. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం మరియు ఎం.ఈ.ఓ అధ్యక్షత వహించగా దూస రఘుపతి ఎం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందించడం ఒక మంచి కార్యక్రమం అని తెలియజేశారు అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో విద్య ద్వారా అభివృద్ధి చెందాలని కోరడం జరిగినది. స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు కోమాకుల ఆంజనేయులు,కార్యదర్శి శ్రీపతి కాశీరాం సభ్యులు నవీన్ గోవర్ధన్, సతీష్, రమేష్ తదితరులు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించినారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ కార్యదర్శి మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో ఫౌండేషన్ స్థాపించామని 2011 నుండి వెంకంపేట పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నమని తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగించుటకు పాఠశాల అధ్యాపక బృందాన్ని కోరడమైనది. సంస్థ సభ్యులు ఇకముందు కూడా ఇదే విధిగా కొనసాగించడానికి అంగీకరించినారు ..కావున పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్ఫూర్తి ఫౌండేషన్ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇకముందు కొనసాగించాలని పాఠశాల అధ్యాపకులు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్.ఎం రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయినీలు పద్మ, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.

మృతిచెందిన కార్మికుని కుటుంబానికి 83 వేల వితరణ.

మృతిచెందిన కార్మికుని కుటుంబానికి 83 వేల వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన ఎస్ఎన్ పిసి సింగరేణి కార్మికుడు నేరుపటి మొగిలి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న తోటి కార్మికులు 83 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు నేరుపటి మొగిలి కుటుంబానికి అండగా ఉంటామని కార్మికులు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ రావు సీనియర్ ఇన్స్పెక్టర్ జగ్గ లక్ష్మి రాజ్యం కార్మికులు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి.

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మండల కేంద్రంలోని ఎంఈఓ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేశారు. ఎంఈఓ శ్రీనివాస్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ మండలంలోని 57 పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. విద్యా కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
మండలంలోని 2663 విద్యార్థుల నిమిత్తం మొదటి విడత పాఠ్య పుస్తకాల పంపిణీ ఝరాసంగం మండలంలోని అన్ని పాఠశాలలకు మొదటి విడత 12,517 పుస్తకాలు మండల వనరుల కేంద్రానికి రావడం జరిగింది ఈకార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది శివ సి.ర్.పి.రాజు షైక్ షఫీవుద్దీన్ లక్ష్మీ ఉపాధ్యాయులు మెదపల్లి ఎల్గోయి నగేష్ శివ చందర్ పాల్గొన్నారు.

37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని 37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సిరిసిల్ల టౌన్ మే 22 (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37 వ వార్డులో ని ఈ రోజున ఉదయం 10-30 సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సహాయ నిధి (CMRF)నుండి స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సహాయ సహకారంతో 37.వ పరిధిలో గల లబ్దిదారులైన బూర్ల ప్రతాప్ 24000/- రూపాయలు దాసరి కళావతి విఠల్ 6500/-
రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ లను వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు చేతుల మీదుగా అందజేయడం జరిగినది.ఈ సందర్బంగా స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు కి తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు మరియు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు..

ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు.

కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు

గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను
అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version