క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గల గడికోట మైదానంలో జరుగుతున్న రామడుగు మండలం విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా రామడుగు గ్రామానికి చెందిన రామడుగు రాయల్స్ టీమ్ జట్టుకు యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ టిషర్ట్స్ అందజేయడం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడి దిలీప్ కుమార్, బసరవేణి అజయ్, పూరెల్ల రాహుల్ , ఎడవెల్లి సాగర్, రామడుగు గ్రామస్తులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
