మార్కెట్ కమిటీ చైర్మన్ బాధిత కుటుంబానికి భరోసా

బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రానికి చెందిన ఉత్తెం అశోక్ ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటి సామాగ్రితో పూర్తిగా దగ్ధమైన విషయం తెలుసుకున్న గోపాల్‌రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి సందర్శించి పర్యవేక్షించారు. ఇంటి సామాగ్రిని పూర్తిగా పరిశీలించిన అనంతరం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అభయం ఇచ్చారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో ఫోన్‌లో విషయం తెలియజేసి ఆయనతో బాధితులను మాట్లాడించారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే త్వరలోనే స్వయంగా ఇంటిని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రామడుగు తహసిల్దార్ రాజేశ్వరిని ఫోన్‌లో సంప్రదించగా వారు వెంటనే స్పందించి రెవెన్యూ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు పంపించారు. అనంతరం మేడిపల్లి రూపాదేవి ఫౌండేషన్ ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తిరుపతి అశోక్ కుటుంబానికి తక్షణ సహాయం కింద ఐదువేల నగదు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారం అందేలా స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు సామంతుల సుజాత తిరుపతి, మామిడి కుమార్, కారుపాకల నరేష్, నాయకులు వడ్లూరి రాజేందర్, జిట్టవేణి రాజు, పంజాల శ్రీనివాస్ గౌడ్, పెసరు లచ్చయ్య, ఉత్తెం కుమార్, బాసవేని శ్రవణ్, గుర్రం శ్రీనివాస్, ఉత్తెం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version