ఏకాత్మ మానవవాద సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం: మోడీ రవీందర్…

ఏకాత్మ మానవవాద సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం: మోడీ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పార్టీ నలభై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏకాత్మ మానవవాద సైద్ధాంతిక పునాదుల మీద ఏర్పడి దేశ నిర్మాణం లో సమస్యల పరిష్కారనికి భారతీయ జనతా పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెళ్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవేల్లి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేం కనుకరాజు, నాయకులు వడ్లూరి రాజేందర్, వేముల రమేష్, ఐతరవేణి శ్రీనివాస్, బొజ్జ తిరుపతి, పురేళ్ల శేఖర్, రామకృష్ణ, గంగారెడ్డి, మల్లేశం, హరీష్,
పర్శరం, సంజీవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version