సామూహిక గా వందే మాతరం గీతాలాపన
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
దేశభక్తిని మరింతగా పెంపొందించే కార్యక్రమంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి, భారత చరిత్రలో వందే మాతరం గీతానికి ఉన్న విశిష్ట స్థానాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు.
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ పట్ల ప్రజల్లో ఉత్సాహం గుండెల నిండుగా జాతీయ భావం నెలకొందని ఆయన వెల్లడించారు. జాతీయ భావన, ఐక్యత, సామూహిక భావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. వందేమాతర గీతం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని రగిలించిన గీతమని, స్వాతంత్ర్య సమరయోధులందరిలో ఉత్సాహానికి, శక్తికి ప్రతీకగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు.
