సంక్రాంతి ముగ్గుల పోటీలు ప్రారంభించిన మల్లారెడ్డి

సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాలి : మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

* మూడు చింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
* పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

 

సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పండగలు నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని మహిళలను చైతన్య పరిచేందుకు యాడారంలో బిఆర్ఎస్ పార్టీ అశోక్, హనుమాన్ దాస్, మూడు చింతలపల్లి లో మాజీ సర్పంచ్ జాము రవి, లక్ష్మాపూర్ లో మాజీ సర్పంచ్ సింగమాంజనేయులు మాజీ ఎంపీటీసీ నాగరాజు, గౌటే గోపాల్, అలియాబాద్, లాల్ గాడి మలక్పేట్, తుర్కపల్లి నాగిశెట్టిపల్లి తదితర గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లారెడ్డి ముగ్గుల పోటీలను సందర్శించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ పండగలను సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం కోసమే బిఆర్ఎస్ పార్టీ ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా యువతను ప్రోత్సహించడం కోసం ఈనెల 16 నుంచి 19 వరకు క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జహంగీర్, డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ వైసీపీ ఎల్లుభాయి, మాజీ జెడ్పిటిసి అనిత, బిఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు సరస మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సదాశివరెడ్డి, ఆనంద్ గౌడ్, లింగం, కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు…

గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించే కార్యక్రమం స్థానిక పాఠశాలలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, ఉపసర్పంచ్ శ్రీమతి బోట్ల శ్యామల తో పాటు వార్డు సభ్యులు కుమారస్వామి, శ్రీనివాస్,అరవింద్,లావణ్య, వెంకటేశ్వర్లు,మంజుల,రమ లను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ
గ్రామ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి,పాఠశాల అభివృద్ధిలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణం,మౌలిక వసతుల మెరుగుదల వంటి కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ
కార్యక్రమంలో ఉపాధ్యాయులు పావని, సత్యపాల్,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్థులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్ మాట్లాడుతూ
గ్రామ అభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని,విద్యార్థుల సంఖ్య పెంపు,ప్రహరీ గోడ నిర్మాణం,పరిశుభ్రత,మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, ముస్త్యాలపల్లి పాఠశాలను ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలు,పాఠశాల విద్యార్థి నుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version