హ్యాండ్ బాల్ టోర్నమెంట్లో సత్తాచాటిన సరస్వతి స్టూడెంట్
రామడుగు, నేటిధాత్రి:
ఎస్జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థి గంధం విక్కీ సత్తాచాటినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో జరిగిన పోటీల్లో కరీంనగర్ జట్టు తరపున ఆడి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, పీఈటీ సాయికృష్ణ విక్కీని అభినందించారు.
