మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం…

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సరిత

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సరిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులు ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు
అనంతరం సర్పంచ్ సరిత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సొంత ఖర్చులతో బహుమతులు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మరికొంత మంది నాయకులతో కలిసి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యానికి రాజ్యాంగ నిర్మాణానికి తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, రాష్ట్రం దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చల్లూరు మధు అప్పన్ కిషన్ గాజర్ల అశోక్ తిరుపతి విజయ్ తదితరులు పాల్గొన్నారు

ఎస్టిపిపి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక

ఎస్టిపిపి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక

జైపూర్,నేటి ధాత్రి:

సింగరేణి సంస్థలో విశేష సేవలందించిన ఉత్తమ ఉద్యోగులను 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున యాజమాన్యం వారికి ఘనంగా సన్మానాలు చేపడుతున్నట్లుగా జైపూర్ ఎస్టిపిపి అధికారులు తెలిపారు.వివిధ ఏరియాల నుంచి ప్రతిభావంతులైన కార్మికులు,అధికారులను గుర్తించి ఉత్తమ సింగరేణీయులుగా ఎంపికలో భాగంగా ప్లాంట్ నుండి నలుగురు ఎంపికయ్యారని ప్లాంట్ ఈడి సిహెచ్ చిరంజీవిలు వెల్లడించారు.ఉత్తమ అధికారిగా జి.ఎం మదన్మోహన్,ఉత్తమ సింగరేణియన్ గా సీనియర్ అసిస్టెంట్ శశిధర్ ఎంపిక కాగా,వీరిని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో సి అండ్ ఎండి కృష్ణ భాస్కర్ సింగరేణి డైరెక్టర్ల తో కలిసి సన్మానిస్తారని తెలిపారు. స్థానిక ప్లాంట్ లో జరగబోయే గణతంత్ర వేడుకల్లో సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, వార్డ్ అసిస్టెంట్ తిరుపతి ఉత్తమ ఉద్యోగులుగా సన్మానించబడతారని తెలిపారు.

మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రమదానం

మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది “శ్రమదానం
మెట్ పల్లి జనవరి 24 నేటి ధాత్రి

సోమవారం జరుగనున్న “రిపబ్లిక్ డే” ఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య నేతృత్వంలో వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న అధ్వర్యంలో శనివారం రోజున కళాశాల సిబ్బంది శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై అమర్చిన కళాశాల బోర్డు నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోనికి వెళ్ళే రోడ్డుపై పెరిగిన గడ్డి, ముళ్ళ చెట్లు తదితర పిచ్చి మొక్కలతో పాటు చెత్త, చెదరాన్ని పారలు,గడ్డ పారలు,గొడ్డలి,ప్లాస్టిక్ బుట్టలు వంటి పరికరాల సహాయంతో శుభ్రం చేశారు.దాంతో ఈ ప్రాంతమంతా ఆకర్షణీయంగా తయారయ్యింది. అనంతరం చెత్త, చెదారానికి సిబ్బంది నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెచ్.ఓ. డి.మనోజ్ కుమార్ బోధనా సిబ్బంది అంజయ్య, శ్రీకాంత్, దశరథం లతో పాటు బోధనేతర సిబ్బంది లక్మినారాయణ, బాబు, శ్రీనివాస్, లక్ష్మి, లింగం తదితరులు పాల్గొన్నారు.

అమరావతిలోనే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..

అమరావతిలోనే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..

 

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రతి ఏటా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాత్రం రాజధాని అమరావతిలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాయపూడి సీఆర్డీఏ ఆఫీసు సమీపంలో 20 ఎకరాల్లో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version