బిఆర్ఎస్ నిజాంపేట్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుక
నిజాంపేట, నేటి ధాత్రి
మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుకను మెదక్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు. మావు రం రాజు మాట్లాడుతూ నాపై ప్రేమాభిమానాలు చూపి నాకు దీవెనలు అందించిన తిరుపతి రెడ్డి అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, బిఆర్ఎస్వి రాష్ట ఉపాధ్యక్షుడు పడాల సతీష్,ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్.కూర్తివాడ మాజీ సర్పంచ్ శ్రీను.బిఆర్ఎస్వి మెదక్ జిల్లా నాయకులు గంజి నవీన్.గోపీని సాయి. పంపరి నగేష్, సంగు స్వామి, మల్లేశం , వంశీ ,శివ, మహేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.