లైంగిక వేధింపుల ఆరోపణలు..

లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు.

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రితం రోజా అనే యువతి కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ (Sexual Abuse Allegations) బాగా ఉందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్‌ సేతుపతి స్పందించారు. ఈ విషయంలో తనకంటే కుటుంబం ఎంతో బాధ పడిందన్నారు. ఆమెపై తన సిబ్బంది సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘నేనేంటో తెలిసివాళ్లు ఈ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. వాళ్లకే కాదు నేనేంటో నాకూ తెలుసు. ఇవన్నీ నన్ను ఏ మాత్రం బాధించలేవు. కానీ ఇలాంటి వాటి వల్ల నా కుటుంబం, సన్నిహితులు ఎంతో బాధ పడ్డారు. ‘వీటిని పట్టించుకోకండి’. ఆమె ఫేమస్‌ కావడం కోసం, కాసేపు మీడియాలో పాపులర్‌ కావడం కోసం చేసే పనులివి. అలా ఆమెను కాసేపు ఎంజాయ్‌ చేయనీయండి’ అని నా సన్నిహితులతో చెప్పాను. మేము ఆమెపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. గత ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు దేనికీ భయపడలేదు. ఇలాంటివి నన్ను ఏమీ చేయలేవు’ అని విజయ్‌ సేతుపతి అన్నారు.గతంలో విజయ్‌పై రమ్య అనే మహిళ ఎక్స్‌లో చేసిన వాఖ్యలివి. ‘తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉంది. దీని నా స్నేహితురాలు ఎంతో ఇబ్బంది పడింది. విజయ్‌సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారు. ఆమె మానసికంగా కుంగుబాటుకు గురైంది’ అని రమ్య ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. కాసేపటితో ఆమె ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై సేతుపతి అభిమానులు విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్‌ ఎందుకు డిలీట్‌ చేశారని నిలదీశారు. ఆ తర్వాత ఆ మహిళ మరో పోస్‌ట్తఓ క్లారిటీ ఇచ్చింది. అది కోపంలో చేసిన పనని, అంతగా వైరల్‌ అవుతుందనుకోలేదని తెలిపింది. 

కీరవాణి సలహాతోనే అలా.. స్పెషల్‌ సాంగ్‌పై క్లారిటీ….

కీరవాణి సలహాతోనే అలా.. స్పెషల్‌ సాంగ్‌పై క్లారిటీ

‘విశ్వంభర’లో ఓ స్పెషల్‌ సాంగ్‌కు మాత్రం భీమ్స్‌ స్వరాలు అందించారు. దీనిపై చర్చ నడుస్తోంది.  కీరవాణి ఇచ్చిన ట్యూన్‌ నచ్చకపోవడంతోనే భీమ్స్‌తో చేయించారిన టాక్‌ నడిచింది.  దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు 

చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassista) మల్లిడి తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). త్రిష కథానాయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) సంగీత దర్శకుడు. అయితే ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌కు మాత్రం భీమ్స్‌ స్వరాలు అందించారు. దీనిపై చర్చ నడుస్తోంది. కీరవాణి ఇచ్చిన ట్యూన్‌ నచ్చకపోవడంతోనే భీమ్స్‌తో చేయించారిన టాక్‌ నడిచింది. అది పూర్తిగా అవాస్తవమని దర్శకుడు వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘పలు యూట్యూబ్‌ ఛానళ్లు ఆస్కార్‌’ వచ్చిన కీరవాణిని అవమానించారు’ అంటూ థంబ్‌నైల్స్‌ పెట్టి, ఎలాపడితే అలా రాతలు రాశాయి. ‘విశ్వంభర’లోని ప్రత్యేక గీతం చేయాల్సిన సమయానికి కీరవాణి.. ‘హరిహర వీరమల్లు’ ఆర్‌ఆర్‌తో బిజీగా ఉన్నారు. అందుకే ఆయనే ‘ఈ సాంగ్‌ని మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో చేయిద్దాం’ అని సజెస్ట్‌ చేశారు. అదేంటి సర్‌ అని నేనంటే.. ‘ఇందులో తప్పేముంది? ఒక పాట ఒకరు రాేస్త.. మరో పాట వేరొకరు రాస్తారు. ఇదీ అంతే అని సింపుల్‌గా అన్నారు. నా తొలి సినిమా ‘బింబిసార’కి చిరంతన్‌ భట్‌తో కలిసి ఆయన వర్క్‌ చేశారు. ఈ విషయాన్నీ గుర్తు చేశారు. వర్క్‌ ఆగకూడదన్నది ఆయన ఉద్దేశం. ఈ విషయాన్ని చిరంజీవికీ ఆయనే చెప్పారు. అలా భీమ్స్‌ని ఎంపిక చేశాం. ఈ స్పెషల్‌ సాంగ్‌ చిరంజీవిగారు నటించిన చిత్రాలు ‘రిక్షావోడు’, ‘ముఠామేస్ర్తి’ చిత్రాల థీమ్‌ మ్యూజిక్‌ వినిపిస్తుందని కొందరు అంటున్నారు. అన్నయ్యలో ‘ఆట కావాలా పాట కావాలా’, ఖైదీ ‘రగులుతుంది మొగలిపొద వంటి సాంగ్‌ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అలాంటిదేమీ లేదు. ఇదొక ప్రెష్‌ సాంగ్‌’ అని అన్నారు.

 

ఆ సాంగ్‌లో చిరంజీవితో కలిసి బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్‌ స్టెప్పులేశారు. ‘ముందు అనుష్క, బాలీవుడ్‌ హీరోయిన్లను అనుకుని తర్వాత త్రిషను సెలెక్ట్‌ చేసినట్టున్నారు?’ అని అడగ్గా.. దర్శకుడు అవునని సమాధానమిచ్చారు. సెప్టెంబర్‌ 25న విడుదల అన్నదానిపై ఆయన మాట్లాడుతూ ‘అదే డేట్‌లో ‘ఓజీ’, ‘అఖండ 2’ వస్తుంటే మా సినిమాని ఎందుకు రిలీజ్‌ చేయాలనుకుంటాం. మేం ఇంకా ఏ డేట్‌ అనుకోలేదు. పరిపూర్ణంగా సినిమా పూర్తయ్యాక, సీజీ వర్క్‌ అంతా సంతృప్తికరంగా అనిపించిన తర్వాతే సినిమా విడుదల చేసప్తాం. పండగకు చిరంజీవి సినిమా రావాలని నేను అనుకోను. ఆయన సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండగ అనుకుంటా’ అని అన్నారు.

చిత్రపురి కాలనీపై ఆరోపణలు.. అధ్యక్షుడు అనిల్‌ క్లారిటీ..

చిత్రపురి కాలనీపై ఆరోపణలు.. అధ్యక్షుడు అనిల్‌ క్లారిటీ

హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీపై వస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీపై (Chitrapuri colony issue) వస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ (Anil Kumar) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్‌ సూట్‌, రో హౌసెస్‌, డూప్లెక్స్‌ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్‌ కి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ‘చిత్రపురి కాలనీలో ఆరు నెలలకు ఓసారి సమావేశం జరుగుతుంది. అందరం కలిసి సమస్యల గురించి చర్చించుకుంటాం. ఈ మధ్యన కొందరు సమావేశంలో మాట్లాడకుండా చలో ఫిలిం ఛాంబర్‌, ఛలో గాంఽధీభవన్‌ అంటూ బయటికి వస్తున్నారు. అందులో చాలామంది చిత్రపురి కాలనీకి సంబంధం లేనివారు ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఈ కారణంగా కాలనీలో ఉండే ఎంతోమంది కొన్ని భయాందోళనకు గురవుతున్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఒక కుటుంబం లాగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాము. అవినీతి జరిగిందంటూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడేవారు. అవేంటో చెబితే బహిరంగంగా మాటాడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరూ ముందుకు రారు. చిత్రపురి కాలనీలో 4713 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నారు. 700 నుండి 850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీ పై సుమారు 3000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు. ఆరోపించేవారు ముందుకొస్తే సమాధానం చెప్పడానికి కమిటీ సిద్ధంగా ఉంది. కోర్టులో ఉన్న కొన్ని విషయాలపై నేను మాట్లాడలేను కానీ మిగతా వాటిపై నేను మాట్లాడతాను’  అన్నారు. 

* చిత్రపురి కాలనీలో జాయిన్ కావాలంటే కచ్చితంగా సినీ కార్మికులయ్యే ఉండాలి. ప్రస్తుతానికి సుమారు 60 శాతం మాత్రమే అలా ఉన్నారు. కొంతమంది అమ్ముకుని బయటకు వెళ్లిపోయారు.

* 2009లోనే పర్మిషన్లు తీసుకుని రో హౌసులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2017లో కూడా మరికొన్ని పర్మిషన్లతో G+2గా మరి కొన్ని రో హౌసులు నిర్మించడం జరిగింది. అవి అన్ని పెర్మిషన్ తోనే జరిగాయి కాని కొంతమంది కేసులు పెట్టిన కారణంగా ఆ కట్టడాలు ఆపడం జరిగింది.

* ఇప్పటికీ ఉన్న రేట్లు అన్ని సమావేశంలో చర్చించుకుని ఫిక్స్ చేసినవే. అలాగే కాలనీ పై ఉన్న అప్పును దృష్టిలో పెట్టుకొని ఆ రేట్లు నిర్ణయించడం జరిగింది. సఫైర్ సూట్ నిర్మించేందుకు అన్ని పర్మిషన్లతోనే ముందుకు వెళ్తున్నాము.

* శ్రావణమాసంలో కొత్త నిర్మాణాలు మొదలుపెట్టనున్నాము. చుట్టుపక్కల ఉన్న ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలకు తగ్గట్లు అన్ని రకాల ఎమినిటీస్ తో సఫైర్ సూట్ నిర్మించబోతున్నాము. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తి కాకపోతే కాలనీ మనుగడకే సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా పర్మిషన్లు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. దానిని పూర్తి చేసి ఉన్న సమస్యలు అన్నిటిని సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. మొత్తం 51 అంతస్థుల భవనంలో సఫైర్ సూట్ ప్లాన్ చేస్తున్నాము.

* చిత్రపురి కాలనీలో నీటి సమస్య అనేదే లేదు. నిరంతరం మంజీరా నీటి సరఫరా ఉంటుంది.

* కాలనీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ సరైన మెంబర్షిప్ లు ఉంటే కచ్చితంగా వారికి ఫ్లాట్ వచ్చేందుకు మా కమిటీ పూర్తి సహకారం అందించి వారికి ఫ్లాట్ వచ్చేలా పనిచేస్తుంది. వారికి ఫ్లాట్లు ఇచ్చేందుకు కూడా రెడీ గానే ఉన్నాయి.

* వచ్చే సెప్టెంబర్ నెలలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఆరోపణలు చేసేవారు వివరణ ఇవ్వాలి. ఆ వివరణ ఆధారంగా చర్యలు ఉండబోతాయి.

* ఇప్పటికీ చిత్రపురి కాలనీ పై ఉన్న సుమారు 170 కోట్ల రూపాయల అప్పును తీర్చాలంటే సఫైర్ సూట్ కేవలం 48 నెలలలో పూర్తి చేస్తే ఆ అప్పును తీర్చే అవకాశం ఉంది. అంతేకానీ చత్రపతి కాలనీలో సభ్యులపై ఆ అప్పు పడదు.

* 2023 తర్వాత ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఒకవేళ అలా చేసిన 336లో సినీ కార్మికులు కాని వారు ఎవరైనా ఉంటే వారిని తీసేయడానికి అనిల్ కుమార్ కమిటీ సపోర్ట్ చేస్తుంది.

* సినీ జర్నలిస్టులకు కూడా చిత్రపురిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా సినీ జర్నలిస్టులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అలాగే 24 క్రాఫ్ట్స్ లో తమ అసోసియేషన్ ద్వారా వస్తే ఫ్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము.

* గతంలో లోన్స్ కట్టలేని పరిస్థితులలో ఆక్షన్ వేసే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో చదలవాడ శ్రీనివాస్ గారు చిత్రపురి కాలనీకి అండగా నిలబడ్డారు.

* ప్రభుత్వం వారు ఇప్పటికే వేసిన కమిటీ వారు ఎవరైనా సినీ కార్మికులకు న్యాయంగా ఫ్లాట్ వెళుతుంది అని చెప్తే కచ్చితంగా వారికి ఫ్లాట్ ఇస్తాము.

* సభ్యులను తీయాలంటే రెండు ప్రక్రియలు మాత్రమే ఉంటాయి. ఒకటి సరైన సమయంలో డబ్బులు కట్టకపోవడం వల్ల తీసేస్తాము. లేదా సినీ కార్మికులు కాని వారిని తీసేస్తాము. ఈ రెండు కారణాలు కాకుండా సభ్యులను తీసేసే అవకాశం ఎవరికీ లేదు. 

హరిహరి వీరమల్లు విడుదలపై మేకర్స్‌ క్లారిటీ

హరిహరి వీరమల్లు విడుదలపై మేకర్స్‌ క్లారిటీ

 

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేది ఎప్పుడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. దాంతో నెట్టింట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జులై తొలి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. జూన్‌ 26న రిలీజ్‌ కానుందని ఓవర్సీస్‌కు చెందిన ఓ డిస్ర్టిబ్యూషన్‌ సంస్థ పోస్టు పెట్టింది. సంబంధిత పోస్టర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై మేకర్స్‌ ఎక్స్‌ వేదికగా స్పందించి రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. ‘‘హరిహర వీరమలుల్ల’  రిలీజ్‌ డేట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌లను నమమకండి. మా సోషల్‌ మీడియా ఖాతా ద్వారా మరికొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. అప్పటి వరకూ మీ ప్రేమ, మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం’’ అని నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పేర్కొంది. నాలుగేళ్ల క్రితం క్రిష్‌ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యమైంది. ఆ తర్వాత సినిమా క్రిష్‌ చేతుల నుంచి జ్యోతికృష్ణ చేతికి వచ్చింది.  నిధి అగర్వాల్‌ ఈ చిత్రంలో కథానాయిక. . అనుపమ్‌ ఖేర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version