ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా పిన్నం వసంత నియామకం..

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా పిన్నం వసంత నియామకం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T130535.515-1.wav?_=1

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణ ఆర్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా పిన్నo వసంత నియామకం అయ్యారు ఈ మేరకు నియామక పత్రాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం నాడు ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి పట్టణ అధ్యక్షులు బచ్చురాం ఆర్యవైశ్య నేతలతో కలిసి నియామక పత్రం అందజేశారు గతంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలిగా జిల్లా మహిళా సంఘం నాయకురాలిగా వసంత సేవలు అందించార ని యాదగిరి బచ్చురాం ఒక ప్రకటన లో తెలిపారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌ రవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి పట్టణ అధ్యక్షుడు బచ్చురాం మాట్లాడుతూ నూతనంగా నియామకం అయిన శ్రీమతి వసంత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పూజల పై దృష్టి పెట్టాలని ఆర్యవైశ్య మహిళలను గౌరవించి తేడా లేకుండా అందరినీ కలుపుకపోవాలని సూచించారు ఈ మేరకు నరేందర్ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్యవైశ్య నేతలు న్యాయవాది అయిత కృష్ణ మోహన్ పూరి బాల్ రాజు శెట్టి మారం బాలీషి దొంత అశోక్ కందికొండ సాయిరాం వేణుగోపాల్ సి పం డ రయ్య మారం బాలీశ్వరయ్యా ఉల్లిగడ్డ రమేష్ ఆర్యవైశ్య మహిళలు భక్త్తులు పాల్గొన్నారు

విద్యాశాఖ మంత్రిని నియమించాలి…

విద్యాశాఖ మంత్రిని నియమించాలి…

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి…

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలి…

అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల,వసతి గృహాల భవనాలకు సొంత భవనాల నిర్మించాలి…

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి…

విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలి…

వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-75.wav?_=2

నేటి ధాత్రి -గార్ల :-

రాష్ట్రంలో పాలకులు లిక్కర్ పై చూపెడుతున్న శ్రద్ధను విద్యారంగం వైపు చూపెట్టని పరిస్థితి దాపురించిందని ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్, పీడీఎస్ యు జిల్లా కోశాధికారి మునగాల మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ లో భాగంగా బుధవారం గార్ల మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈవో, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్, బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్, కిరణ్, ఉదయ్, పృధ్విరాజ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్.

సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్ కేటాయించడంపై హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-35.wav?_=3

జహీరాబాద్. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేవారిని గుర్తించి పార్టీ అధిష్టానం అందలం ఎక్కిస్తుందని దానికి ఉదాహరణ కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రామలింగ రెడ్డి కి ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం అని, పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి అవకాశాలు ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేసిన పట్లోళ్ల రామలింగ రెడ్డి కి జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వడంపై కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ షౌకత్ అలీ హర్షం వ్యక్తం చేస్తు పార్టీ అధిష్టనానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షౌకత్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఐక్యంగా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో, నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పార్టీ అమలు చెస్తూన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి.

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ .

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో వెంటనే డాక్టర్లను నియమించాలి…. గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఆరుగురు డాక్టర్లతో తూతూ మంత్రంగా వైద్య సేవలని అందిస్తున్నారని దుయ్యబట్టారు …. గైనిక్,, అనస్తీసియా,, పీడియాట్రిక్ డిపార్ట్మెంటులో ఇద్దరేసి డాక్టర్ల చొప్పున ఉంటూ వైద్యాన్ని అందించాల్సి ఉండగా వైద్యుల కొరత వల్ల అనేక ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భూపాలపల్లి పరకాల హనుమకొండ వంటి పట్టణాలకు వెళ్లే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… కొన్నిసార్లు సమయానికి వైద్యం అందక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు… పరిస్థితి పూర్తి అధ్వానంగా మారింది.. ఈ విషయాన్ని స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు* ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదని, పేద ప్రజల ఆరోగ్యం అంటే ఆయనకు లెక్కే లేకుండా పోతుందని మండి పడ్డారు…వెంటనే జిల్లా కలెక్టర్ గారు నిరుపేద రోగుల పరిస్థితుల దృష్ట్యా చిట్యాల హాస్పిటల్ కు పూర్తి స్థాయిలో గైనిక్,, అనస్తీషియా,, పీడియాట్రిక్ డాక్టర్లను నియమించాలని ఆయన కోరడం జరిగింది. లేనట్లయితే చిట్యాల హాస్పిటల్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్థామని ఆయన హెచ్చరించారు..

కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్

ములుగు జిల్లా, నేటిధాత్రి

ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామస్తుడైన పోలేపాక జనార్దన్ చిన్నప్పటినుండి గురుకులంలో చదువుకుంటూ కబడ్డీలో రాణిస్తూ చాలా రోజులుగా ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ లో సెక్రెటరీ గ ఉంటూ అదనంగా జనార్ధన్ కు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గ ఎన్నిక కావడం జరిగింది. పోలెపాక జనార్దన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించినందుకు అదేవిధంగా దీనికి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేశం అదేవిధంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇండియన్ కబడ్డీ ప్లేయర్ కబడ్డీ రథసారథి మహేందర్ కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా .!

టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా పోషిని రవీందర్ నియామకం:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా పోషిని రవీందర్ ను నియమిస్తూ టిపిసిసి రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారు ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గా నియమించిన పొన్నం అశోక్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ పదవి రావడానికి సహకరించిన కాంగ్రెస్ లీగల్ సెల్ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ లీగల్ సెల్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.రవీందర్ నియామకం పై పలువురు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలి .

రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలి

తపస్ జిల్లా అధ్యక్షులు

వనపర్తి నేటిదాత్రి :

 

 

 

 

ఉపాధ్యాయుల సంఘం సభ్యత్వ నమోదులో పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి మునిగిళ్ళ పెద్దమందడి వెల్టూరు మద్దిగట్ల మోజర్ల విరాయపల్లి పామిరెడ్డిపల్లి బలిజపల్లి చిన్న మందడి అల్వాల దొడగుంటపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో తపస్ సభ్యత్వాన్ని చేయించుకున్నారని. తపస్ జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి తెలిపారు ఏకీకృత సర్వీస్ నిబంధనలు ను క్లియర్ చేసి ఉప విద్యాధికారి డైట్ లెక్చరర్స్ ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చి ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దమందడి మండల ఇంచార్జ్ నర్మదా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ శశివర్ధన్ మండల గౌరవ అధ్యక్షులు మధుసూదన్ తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగపూర్ ఈశ్వర్ రవికుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క రమేష్ మండల కార్యదర్శి తిరుపతి సురేష్ రవి తదితర తపస్ బృందం తపస్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు

సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం.

సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం

సిరిసిల్ల టౌన్(నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిని గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ శాఖ నూతన బిజెపి కార్యవర్గం నియమించడం జరిగినది. ఇందులో భాగంగా ఉపాధ్యక్షులుగా మోర శ్రీహరి మరియు అంకారపు రాజు, కాంభోజ శ్రీధర్, పల్లికొండ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండ సురేష్, మేర్గు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శులుగా కోడంతవి సురం వినయ్ పంపరి అర్జున్, కోడం శ్రీనివాస్, కోశాధికారిగా ఇoజపురి మురళి బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖగా నియమితులయ్యారని జిల్లా బిజెపి అధ్యక్షుడు తెలిపారు.

ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం.

ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

 

ఎమ్మార్పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఇన్చార్జిగా బోలి బాబు మాదిగను నియమించడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ లు పోగు వెంకటేశ్వరరావు మాదిగ, రుద్రారపు రామచంద్ర మాదిగ, సుంచు రాజు మాదిగలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బోలి బాబు మాదిగ సొంత గ్రామము జయశంకర్ జిల్లా ఘన్పూర్ మండల్ వాస్తవాడైన ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్ర మొగిలి మాదిగ, జిల్లా సీనియర్ మాదిగ, నోముల శ్రీనివాస్ మాదిగ, దోర్నాల రాజేందర్ మాదిగలకు ఎమ్మార్పీఎస్ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ..

 

Shine Junior Colleges

 

 

 

గౌరవ శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలను నేను పాటిస్తున్న రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాలను వమ్ము చేయకుండా చిట్యాల మండలంలో మండలంలో అన్ని గ్రామాలు సందర్శించి..

 

 

గ్రామ కమిటీల పునర్మానం చేపట్టి..

 

గ్రామ గ్రామాన జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ జెండా పండుగను విజయవంతం జరిగేలా కృషి చేస్తానన్నారు.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా నాగేంద్ర

పరకాల నేటిధాత్రి

 

 

 

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా గూడెల్లి నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన జిల్లా మహాసభల్లో నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు నాగేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా పలువురు నాగేంద్రకు అభినందనలు తెలియజేశారు.

నూతన బీజేపీ జహీరాబాద్ పట్టణ కమిటీ నియామకం.

నూతన బీజేపీ జహీరాబాద్ పట్టణ కమిటీ నియామకం

◆ బీజేపీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి
ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ నౌబత్ జగనాథ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సుధీర్ భండారి బక్కాయ గుప్తా సమక్షంలో జహీరాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ గారు తెలిపారు ఈ సందర్భంగా పూల సంతోష్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని నియమనిబంధన పాటించాలని రాబోయే స్థానిక జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగిరి విధంగా ప్రతి పదాధికారి కార్యకర్త పని చేయాలని క్రమశిక్షణతో పార్టీకి చేయాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పూరెల్ల నితీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వర్, గౌరవ అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు నియామకం పట్ల యూత్ కాంగ్రెస్ సంబరాలు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముత్తారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీను బాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు.ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినీత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఇది నిదర్శనం అన్నారు.పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు కష్టపడి పని చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా పార్టీ వదిలిపెట్టదని వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక ఉంటుందని ఇలాగే క్రియాశీలంకంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ దుదిల్ల శ్రీను బాబు మరి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు లక్కం రాజు, అనుము ప్రశాంత్, ఇనుముల ప్రదీప్, నాగరాజు,స్వామి,బర్ల రాజు, నాగరాజు,నేతెట్ల కిరణ్, ఎడుమెకల కిరణ్, ప్రదీప్, ఐత రాజు, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శిలుగా పాలకుర్తి తిరుపతి,సంగ పురుషోత్తంలను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను మాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి

సహకరించిన అందరికి ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి

 

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శి గా పాలకుర్తి తిరుపతి ని ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను నాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండెకారి రంగారావు.

ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండెకారి రంగారావు

నర్సంపేట,నేటిధాత్రి:*

 

 

ఆరె కుల సంక్షేమ సంఘం ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన గుండెకారి రంగారావును ఎంపికయ్యారు.ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా ఆరెకుల ముఖ్య నాయకుల సలహా సూచన మేరకు కృషి చేస్తానని అన్నారు. తన మీద ఎంతో నమ్మకంతో బాధ్యతను కట్టబెట్టి, కుల సంఘ నిర్మాణంలో, కార్యక్రమాలలో నా వంతు సహాయ, సహకారాలతో పాటు,తనకు గ్రామ,మండల,జిల్లా, రాష్ట్ర కమిటీ నాయకులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.తన నియామకానికి సహకరించిన ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు,
రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్,స్టీరింగ్ కమిటీ చైర్మన్ దిగంబర రావు,రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్ రావు,క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మారుజోడు రాంబాబు, రాష్ట్ర, జిల్లా కమిటీ ముఖ్య నాయకులకు రంగారావు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర నాయకత్వం లోకి కుంట్ల మహేందర్.

ఏ ఐ టి యు సి ఆర్టిజన్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం లోకి కుంట్ల మహేందర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం , చెల్పూర్ లో కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో జరిగిన ఏ ఐ టి యు సి కార్యవర్గ సమావేశం లో ఆర్టిజన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న,కుంట్ల మహేందర్ ను ఏ ఐ టి యు సి అనుబంధ తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ యూనియన్ రాష్ట్ర కమిటీ లోకి తీసుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం ఓదెలు ప్రకటించడం జరిగింది.ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ, ఆర్టిజన్ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న కుంట్ల మహేందర్ కు పదవీ రావడం పట్ల ఏ ఐ టి యు సి రాష్ట్ర రీజినల్ నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
ఇట్టి సమావేశం లో రీజినల్ ప్రెసిడెంట్ కోల శ్యామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగినేని ధర్మారావు, కార్యదర్శి గోపిరెడ్డి కిరణ్, ఉపాధ్యక్షులు మేకల రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి పవన్ కుమార్,పిప్పాల శ్రీపాల్ తదితరలు పాల్గొన్నారు

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు.టీఎన్జీవో ఉద్యోగులు మంచిర్యాల జిల్లా చైర్మన్ గా గడియారం శ్రీహరిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జైపూర్ తహసిల్దార్ వనజ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం,వారి అభివృద్ధికి ఎల్లప్పుడు తోడుగా ఉంటూ తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. శుక్రవారం తహసిల్దార్ వనజా రెడ్డిని కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య.

ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య

వైస్ చైర్మన్ గా గొలనకొండ వేణు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం స్థానిక నర్సంపేట పురపాలక సంఘంలో ఆర్టీసీ డిపోకు చెందిన వివిధ యూనియన్ల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నూతన డిపో జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు.

RTC

డిపో జేఏసీ చైర్మన్ గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్. డబ్ల్యూఎఫ్) డిపో అధ్యక్షులు కొలిశెట్టి రంగయ్య,తెలంగాణ జాతీయ మజ్దార్ యూనియన్ (టీజేఎంయూ) డిపో సెక్రెటరీ గొలనకొండ వేణును వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా ఎంకే.స్వామి (టీఎంయూ), పీసీ. పాలన్ (ఈయూ), బూర ప్రవీణ్ కుమార్, కందికొండ మోహన్, బొడిగె రాజు,ఎండి. జానీపాషా, మంద రాజు, నామాల అశోక్ కుమార్, డ్యాగల వెంకట్రాం నర్సయ్య, ఎన్.రాజాలు తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సంకా నారాయణ.

పి ఆర్ టి యు ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సంకా బద్రి నారాయణ నియామకం

మహబూబాబాద్/ నేటి ధాత్రి

 

 

పి ఆర్ టి యు టి ఎస్ ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పి ఆర్ టి యు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు భూక్యా రామోజీ నాయక్ మరియు మండల ప్రధాన కార్యదర్శి కాపర బోయిన సుజాత మరియు జిల్లా రాష్ట్ర బాధ్యులు. మరియు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కి రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version