వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలుగా న్యాయవాది కిరణ్ విజయం….

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలుగా న్యాయవాది కిరణ్ విజయం

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికల పోటీలో కిరణ్ కుమార్ విజయం సాధించారని ప్రధాన కార్యదర్శి గా వెంకటరమణ గెలుపు పొందారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ఓట్లు 177 దాదాపు 85 శాతం పోలింగ్ జేరిందని చెప్పారు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏం రాహుల్ రాజు పర్యవేక్షకులుగా వ్యవహరించారని చెప్పారు వనపర్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించినందుకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈసందర్భంగా వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా విజయం సాధించి న o దు కు సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ సన్మానం చేసి అభినందించారు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తాండూరు మండలంలోని ఫోటో & వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కి శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్,లయన్స్ క్లబ్ సభ్యులు,ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్,గౌరవ అధ్యక్షులు సబ్బని సమ్మన్న, ప్రధాన కార్యదర్శి ఉప్పల శోభన్,కోశాధికారి రమేష్, మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, ఎస్.కె మహిన్,పుప్పాల సురేష్,రంజిత్,దుర్గాప్రసాద్, షారుక్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version