మట్టిపాట పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ దసరాకు నరేష్ రచించిన మట్టిపాట పోస్టర్ ను చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూట్ల తిరుపతి విచ్చేసి మాట్లాడుతూ అమ్మ తనం ఎంత విలువైనదొ మట్టి పరిమళం కూడా అంతే విలువైనదని చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మ నవమాసాలు కడుపులో మోస్తే మనిషిని జీవితాంతం కాపాడేది మట్టి తల్లి అని పేర్కొన్నారు నేటి సమాజంలో నేల తల్లికి లేని స్వార్థం మనుషులలో నేడు పేరిగిపోయిందని చుట్టూ ఉన్న సహజ వనరులను కాపాడుకోవాలని ప్రకృతి మన దైవమని పేర్కొన్నారు అదే విధంగా ఈ పాటను రచించిన దాసారపు నరేష్ ను పాట లో నటించిన జన్నే యుగేందర్, పాట పాడిన జూపాక శివను, సంగీతం కిట్టు కిస్ ను పాటలో పాల్గొన్న బృందాన్ని అభినందించారు
కార్యక్రమంలో దొడ్డి కిష్టయ్య, గడ్డం కొమురయ్య, పుల్ల మల్లయ్య, అల్లకొండ కుమార్, గుమ్మడి సత్యం, పుల్ల సతీష్, శనిగరపు మొగిలి కటుకూరి మొగిలి, గోల్కొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు