ఘనంగా చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి కార్యక్రమం.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి కేక్ కట్ చేసుకుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది, ఇట్టి కార్యక్రమం చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు సుద్దాల నరసయ్య, వనపర్తి సతీష్ (ప్రధాన కార్యదర్శి), కొడగంటి గంగాధర్ (కోశాధికారి) ఆధ్వర్యంలో చందుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి మల్లయ్య మరియు చందుర్తి రజక సంఘం సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రజక సంఘం సభ్యులు అలాగే చందుర్తి మండల నాయకులు పాక్స చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు పులి సత్యం, గొట్టె ప్రభాకర్, బైరబోని రమేష్, బత్తుల కమలాకర్, చిలుక పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తొలి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలని. పెత్తందారులతో, రజాకార్లతో, దొరలతో, భూస్వాములతో కొట్లాడి ఎన్నోవేల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ధీర వనిత అని కొనియాడారు. ఇప్పటి యువత ఆమె స్ఫూర్తితో ఆమె ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.