ఎల్ఐసి ఏజెంట్లహక్కులు,పాలసీదారుల సంరక్షణ ఏఓఐతోనే..

ఎల్ఐసి ఏజెంట్లహక్కులు,పాలసీదారుల సంరక్షణ ఏఓఐతోనే..

ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య

ఎల్ఐసి ఏఓఐ నర్సంపేట బ్రాంచ్ నూతన కమిటీ సమావేశం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)లో జరుగుతున్న వివిధ మార్పుల నేపథ్యంలో ఏజెంట్ల హక్కులు,పాలసీదారుల సంరక్షణ ఎల్ఐసి ఏఓఐ ఆర్గనైజేషన్ తోటే సాదించుకుంటున్నామని ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య తెలిపారు.నర్సంపేట ఎల్ఐసి బ్రాంచ్ ఎల్ఐసి ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) అధ్యక్షుడు పొనుగోటి సుధాకర్ రావు అధ్యక్షతన నర్సంపేట బ్రాంచ్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగింది.ముఖ్య అతిధులుగా
ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య,వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కమటం స్వామి,డివిజన్ కార్యదర్శి పడిదం కట్టస్వామి హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో పోర్టబుల్ విధానం (క్లా బ్యాక్) ను ముందుకు తెచ్చే యోచనలో ఐఆర్డిఏ ఉన్నది. దీనివలన ఏజెంట్ల ప్రయోజనాలకు తీవ్రమైన ముప్పురానున్నదని తెలియజేశారు.ఈ నేపథ్యంలో అవసరమైతే బ్రాంచీలలో
నిరవధిక నిరాహార దీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో 100 శాతం ఎఫ్డీఐ బిల్లును ఆమోదం చేస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.దీంతో ఎల్ఐసి సంస్థ పై ఇతర ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం జరగనున్నదని రాంనర్సయ్య పేర్కొన్నారు.ఎల్ఐసి ఏఓఐతోనే హక్కులు సాదించుకుంటున్న నేపథ్యంలో ఎల్ఐసి ఏఓఐ సభ్యత్వం పెంచుకొని ఎల్ఐసి కార్పొరేషన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా వివిధ రకాలుగా పోరాటాలు చేసిన ఫలితంగా ఎల్ఐసి ప్రీమియంలో జీఎస్టీని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 22 న అధికారకంగా సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సుభానుద్ధిన్,కోశాధికారి రవికుమార్,డివిజన్ మాజీ కోశాధికారి, రాష్ట్ర ఈసీ మెంబర్ మొద్దు రమేష్,నర్సంపేట మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పెండ్లి రవి, క్లియా అధ్యక్షుడు రాజబోయిన చంద్రమౌళి రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్,శంకరయ్య ,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు,ఎల్ఐసి ఏఓఐ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version