మానసిక క్షోభతో పంచాయతీ కార్యదర్శులు.
కలతప్పిన గ్రామాలు.. నిధుల్లేక లోపించిన పారిశుధ్యం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కలతప్పుతున్న బతుకమ్మ వేడుకలు..
గత కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మకు ప్రత్యేక శ్రద్ధ
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి గ్రామ పంచాయితీల కార్యదర్శులు,అధికారులు మానసిక క్షోభకు గురైతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.అసమర్థత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడం వలన నిధులు లేని గ్రామాలు కలతప్పాయన్నారు.పారిశుధ్యం లోపించిన పల్లెలు అధోగతి పాలవుతునాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.సద్దుల బతుకమ్మ,సదరా పండుగల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో వేడుకల నిర్వహణ సజావుగా జరిగేందుకు తమ వంతు సహాయంగా సహకరించాలని బిఆర్ఎస్ శ్రేణులకు,మాజీ ప్రజా ప్రతినిధులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సరిపడ నిధులు గ్రామపంచాయతీలకు కేటాయించలేదని ఆరోపించారు.గ్రామాలలో బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్లకు నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు,అధికారులు మానసిక క్షోభకు గురైతున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో పంచాయితీ అధికారులు గ్రామాల్లోని ప్రజలతో చందాలు తీసుకొని పండగా ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలన వలన గ్రామపంచాయతీల అధికారులు అప్పులు తెచ్చి గ్రామాలలో పారిశుధ్య పనులు చేస్తున్నారని మరికొన్ని గ్రామాల్లో డీజిల్ కు డబ్బులు లేక పారిశుధ్య ట్రాక్టర్లను నడపడంలేదు.బ్లీచింగ్ పౌడర్,ఫాగింగ్ వీధిలైట్ల మరమ్మత్తులు పట్ల పట్టించుకునే వారేలేరని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.గ్రామ పంచాయితీలలో నిధులు లేక పారిశుధ్యం లోపించి కళతప్పడం ఒకవైపు ఐతే మరోవైపు బతుకమ్మ దసరా ఉత్సవాలకు చిల్లిగవ్వ లేకపోవడం సందండిత అధికారులు ఆందోళనకు గురవుతున్నారని పెద్ది పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపి బతుకమ్మ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా నిర్వహించినారని మాజీ ఎమ్మెల్యే పెద్ది
తెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కళతప్పుతున్న పల్లెల్లో,గ్రామాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,మాజీ ప్రజా ప్రతినిధులు,జెడ్పిటిసిలు, సర్పంచ్లు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పార్టీ నాయకత్వం.. బతుకమ్మ ఉత్సవాలలో తమవంతు సహాయంగా చురుగ్గా పాల్గొని ఏర్పాట్లు చేసి ఆడపడుచుల ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.