మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిబీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ గారు మాట్లాడుతూ సమాజంలో విద్య కోసం, మహిళల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అన్నారు. ఈ కార్యక్రమ విశిష్ట అతిథి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ మాట్లాడుతూ ఈ సమాజంలో బీసీల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకు ఫూడులే మార్గం లో బీసీల కోసం బీసీల హక్కుల కోసం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమా నిర్వాహక అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ సామాజిక రాజకీయ సాంస్కృతిక మార్పు తీసుకువచ్చినటువంటి ఆధునిక విప్లవకారుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ మహాత్మ జ్యోతిరావు ఫూలే 199 వ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలు శూద్రులు మహిళల అభ్యున్నతి కోసం సత్యశోధక్ సమాజ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అదేవిధంగా ఫూలే రాసినటువంటి గులాంగిరి గ్రంథాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు తప్పకుండా చదవాలని పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి ఏసి ఎస్టీ జిల్లా నాయకులు దొంగల రాజేందర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ భీమనాధుని సత్యనారాయణ,ముత్యాల రవికుమార్ నాయి, గోపరాజు రాజు రజక, పెంట సదన్న యాదవ్, సర్వేశం, చిత్తారి రాజేష్, వంగపండ్ల రాజయ్య యాదవ్,బీసీ జిల్లా యూత్ అధ్యక్షులు మద్దెల విజయ్ గౌడ్, రాజయ్య, పెంజల రమేష్, లక్ష్మయ్య, గీసా సంపత్, వెయ్యిగండ్ల తిరుపతి నాయి మంద రమేష్ పుల్ల అశోక్ నద్దునూరి రాజ్ కుమార్ పర్లపల్లి వంశీ చిలుముల కృష్ణ కొయ్యాడరమేష్ మందపెల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం…

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/aDumjuwXe-4?si=rooj0J56msbeCnMA

 

సత్య శోధక్ సమాజ్ 152 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నర్సంపేట సబ్ డివిజన్ కార్యదర్శి మొగలి ప్రతాపరెడ్డి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చాయి.ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంస్కరణ,అణగారిన వర్గాలకు, శూద్రులకు అలాగే మహిళలకు విద్య సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్. స్థాపించారని తెలిపారు.కాగా 24 నుండి 30 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆబర్ల రాజన్న, షేర్ మధు, పెద్దపోయిన అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version