నీల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ సస్పెన్షన్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.సురేష్ పై సస్పెన్షన్ వేటు పడింది.భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకున్న ఆయన,బాధితుడిని లంచం కోరినట్లు ఆరోపణలు వచ్చాయి.లంచం ఇవ్వలేదనే కారణంతో బాధితుడిని చితక బాధడంతో బాధితుడు అల్గం కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు దర్యాప్తు జరిపి,ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో ఎస్సై సురేష్ ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.నెల రోజుల క్రితమే నీల్వాయి పోలీస్ స్టేషన్ కి బదిలీ అయిన సురేష్,వివిధ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు పలువురిని చితకబాదినట్లు బాధితులు తెలపడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.