ఎస్వీయూ పీఎస్‌ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు…

ఎస్వీయూ పీఎస్‌ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు

 

ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.

తిరుపతి, నవంబర్ 6: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పీఎస్‌ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కాగా.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో (SV University) ర్యాగింగ్ కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో విద్యార్థులను ప్రొఫెసర్‌ విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్‌కు ప్రోత్సహించారంటూ బాధిత విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్‌పై ఫిర్యాదు ఇవ్వడానికి యూనివర్సిటీ అధికారులను మూడు రోజులు ముందు విద్యార్థి సంఘాలు కలిశాయి. అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.
అయితే.. ఇప్పటి వరకు ర్యాగింగ్‌పై ఎలాంటి చర్యలు లేకపోగా.. తిరిగి తమపైనే కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు, బాధిత విద్యార్థినిలు చేరుకున్నారు. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version