జహీరాబాద్ బాలుడు మిస్సింగ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో 15 ఏళ్ల బాలుడు అదృశ్యమైనట్లు బంధువు కిన్నెర గురునాథ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా తారురుకు చెందిన జమ్మికుంట ఆశోక్ (15) ఈనెల 22న జహీరాబాద్లో బంధువుల ఇంటికి వచ్చాడు. శనివారం నుంచి అబ్బాయి కనిపించలేదని గురునాథ్ పోలీసులను ఆశ్రయించారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 9392324883 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
