బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింస
జహీరాబాద్ నేటి ధాత్రి:
మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా టిప్పర్తి మండలం లో బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింసించి మూత్రం తాగించిన చర్యను నిరసిస్తూ టిఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో టిఆర్పి పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు నరసింహ, ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ హనుమంతు,
సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వరప్రసాద్, సచిన్, మొగుడంపల్లి మండల్ శీను, మొడంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి లతీఫ్ మరియు రాము మరియు తదితరులు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు వారి అనుచరుల పైన ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ నాయకుల తీరుపై వారి వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు ఖండిస్తూ రావడం జరిగిందని, కాంగ్రెస్ నాయకులు నాయకుల్లాగా కాకుండా దౌర్జన్యంతో రౌడీయిజం చేస్తున్నారని, అదే వైఖరితో మహిళల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ మండిపడ్డారు.లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మహిళల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు గర్వంగా చెప్పుకున్నారు, మరి మినిస్టర్ ఓదా లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బీసీ మహిళ నామినేషన్ వేస్తే వారి అనుచరులు ఆమె భర్తని హింసించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అన్న విషయం ప్రజలు గమనించాలి.రాష్ట్రంలో బీసీల పైన ఎక్కడికక్కడ బెదిరింపులు కిడ్నాప్లు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ ప్రాక్టీస్ మానిటరింగ్ చేయకుండా ఏం చేస్తుందని. అలాగే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వైఖరితో ప్రవర్తిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది.
ఇతర పార్టీలైన బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్లో ఉన్న బీసీలకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన తీన్మార్ మల్లన్న గారిని ఆశ్రయిస్తున్నారు. వేరే పార్టీలో ఉన్న బీసీలకు మద్దతు మరియు న్యాయం జరగాలన్న కేవలం టిఆర్పి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరియు టిఆర్పి పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
