“తల్లి మృతదేహం చూసి కొడుకు ఆత్మహత్య”

తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో హృదయ విధాకరసంఘటన చోటు చేసుకుంది తెలిసిన సమాచార ప్రకారంఈ సందర్భంగా తెలిసిన సమాచారం ప్రకారం. నిన్నటి రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తంగళ్ళపల్లి మండల గ్రామానికి చెందిన మంచి కట్లలలిత. 56. సంవత్సరములు అదృశ్యమైనది.బంధువులు ఎంత వెతికినా కనబడకపోవడంతో ఈరోజు. మానేరు వాగులో శవమై లలిత మృతదేహం కనిపించడంతో తల్లి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక పోయిన కొడుకు అభిలాష్ అదే మానేరులోవాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో సదురు పోలీసు సిబ్బంది సంబంధిత జాలర్లు సిబ్బంది ఎంత వెతికినా అభిలాష్ ఆచూకీ దొరకకపోవడంతో గాలిస్తూ ఉండడంతో ఎట్టకేలకె అభిలాష్ మృతదేహం లభ్యం అయిందని సంబంధిత పోలీస్ సిబ్బంది తెలిపారు. అభిలాష్ సర్దాపూర్ .బెటాలియన్ లో ప్రస్తుతం కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు మృతునికి సంబంధించిన వారు వివరాలు తెలిపారు. అలాగే గతంలో ఆరు సంవత్సరాల క్రితం తండ్రి మోరిలో పడి మృతి చెందగా చెల్లెళ్లు మౌనిక మానస ఇద్దరికీ వివాహాలు జరిగాయని అభిలాష్ కి సైతం వివాహo కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిందిదీనిపై సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నదని సంబంధిత పోలీసుఅధికారులు తెలిపారు

యువతి అదృశ్యం.. కేసు నమోదు…

యువతి అదృశ్యం.. కేసు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ గ్రామీణ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. ఆనెగుంటకు చెందిన పి.సవిత (22) ఈనెల 23న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని వివరించారు. తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం

మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: బుచినెల్లి గ్రామానికి
చెందిన 18 యేళ్ల సత్వార్ నస్రీన్ గత కొన్ని సంవత్స రాలుగా మానసీక స్థితి సరిగా లేక అసాదారణంగా ప్రవర్తిస్తుంది. ఆమె 6 జూన్ 2025 ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని వేళ ఎక్కడికో వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి సత్వార్ షబానా తెలి పారు. ఈ సంఘటనపై చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నస్రీన్అండి సత్వార్ ఖదీర్ కుటుంబం పేర్కొన్న వివరాల ప్రకారం గత మూడు నెలల క్రితం కూడా ఆమె ఇలాగే ఇంటినుంచి వెళ్లిపోయినప్పుడు చిరాగ్పల్లి పోలీసులు మి స్సింగ్ కేసు నమోదు చేసి ఆమెను క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు. ఈసారి కూడా నస్రీన్ తల్లి షబానా ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చే యబడింది. సబ్ ఇన్స్పెక్టర్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం న స్రీన్ కోసం దర్యాప్తు . మేము అన్ని వైపుల నుంచి ఆమె అచూకీ కోసం విచారణ చేస్తున్నామని, గతంలో ఆమెను కనుగొన్న అనుభవం ఆధారంగా ఈసారి కూడా త్వరలోనే ఆమెను కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్సై తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version