మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్..

  న్యూయామందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్..ర్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోపంతో రగిలిపోతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి, భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ విజయం సాధించడంపై ట్రంప్ తీవ్ర అసహనం

Trump-New Yorkers: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోపంతో రగిలిపోతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి, భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ విజయం సాధించడంపై ట్రంప్ తీవ్ర అసహనం వెళ్లగక్కుతున్నారు. మందానీ పాలనలో న్యూయార్క్ నగరం కమ్యూనిస్ట్ క్యూబా లేదా సోషలిస్ట్ వెనిజులాగా మారుతుందని ట్రంప్ అంటున్నారు.

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ…

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

 

హర్భజన్ సింగ్, శ్రీశాంత్ వివాదానికి సంబంధించి కాంట్రవర్షియల్ వీడియో విడుదల చేయడాన్ని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజం చెప్పిన తనపై అంత కోపం ఎందుకని శ్రీశాంత్ భార్యను ప్రశ్నించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌2008 సీజన్‌లో కలకలం రేపిన శ్రీశాంత్-హర్భజన్ సింగ్ వివాదానికి సంబంధించి ఎవ్వరూ ఇప్పటివరకూ చూడని వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఇటీవల విడుదల చేయడం కలకలానికి దారి తీసింది. అయితే, లలిత్ మోదీ తన చర్యను సమర్థించుకున్నారు. శ్రీశాంత్ భార్య భువనేశ్వరి తనపై చేసిన విమర్శలు సబబు కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. తాను నిజం మాత్రమే చెప్పానని అన్నారు. హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌పై చేయి చేసుకున్న ఈ వీడియోను ఇటీవల మైఖేల్ క్లార్క్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ బయటపెట్టారు. దీనిపై మండిపడ్డ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి.. పాత గాయాలను ఎందుకు రేపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఆమెకు ఎందుకంత కోపమో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ పాడ్‌కాస్ట్‌లో ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా నిజమే చెప్పాను. గతంలో ఇలాంటి ప్రశ్న నన్నెవరూ అడగలేదు. క్లార్క్ ఈ విషయమై ప్రశ్న అడగగానే నేను సమాధానం ఇచ్చాను’ అని లలిత్ మోదీ జాతీయ మీడియాకు తెలిపారు. ఆ వీడియో తన వ్యక్తిగత సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ అని లలిత్ మోదీ క్లార్క్‌తో అన్నారు. ఆ సమయంలో బ్రాడ్ కాస్ట్ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయని చెప్పారు. 18 ఏళ్లుగా ఈ ఫుటేజీ తన వద్దే ఉందని అన్నారు. ఈ ఘటన తరువాత హర్భజన్ సింగ్‌పై మిగిలిన మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించినట్టు తెలిపారు.

ఇక లలిత్ మోదీపై మండిపడ్డ భువనేశ్వరి.. మైఖేల్ క్లార్క్‌పై కూడా ఫైరైపోయారు. ఇలాంటి పని చేసినందుకు ఆ ఇద్దరు సిగ్గుపడాలని అన్నారు. 17 ఏళ్ల నాటి గాయాన్ని మళ్లీ ఎందుకు రేపుతున్నారని ప్రశ్నించారు. శ్రీశాంత్, హర్భజన్ సింగ్‌కు స్కూలుకెళ్లే వయసులోని పిల్లలు ఉన్నారని, ఈ వీడియో ఇరు కుటుంబాలకు వేదన మిగిల్చిందని చెప్పారు. ఇలాంటి వాళ్ల మీద కేసు పెట్టాలంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాగా, ఆ వీడియోను చాలా కొద్ది మంది మాత్రమే చూశారని క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే అన్నారు. అది ఐపీఎల్ తొలి సీజన్ కావడంతో వీడియోను బహిర్గతం చేయొద్దని అప్పట్లో నిర్ణయించినట్టు తెలిపారు.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు.

◆ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గుంతలమైన అల్గొల్ బైపాస్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్ నుండి భరత్ నగర్ ,అల్గోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు శుక్రవారం స్థానిక నాయకులు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ & అండ్ బి ఈఈ , సీఈ తో ఫోన్లో సంభాషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు . గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు సమస్య పరిష్కారానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేశామని , కాంట్రాక్టర్ కేవలం బ్రిడ్జ్ మాత్రమే నిర్మించి అప్ప్రోచ్ రోడ్డు నిర్మించకుండా వదిలేసాడని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తొందరగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని లేనియెడల ధర్నాకు దిగుతామని హెచ్చరించారు, ఈ రోడ్డు ద్వారా వెళ్లే వాహనదారులు క్షేమంగా వెళ్లే విధంగా తక్షణమే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే స్థానిక అధికారులకు ఆదేశించారు ,కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, యువ నాయకులు మిథున్ రాజ్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్పా,నాయకులు పురుషోత్తం రెడ్డి,దీపక్ ,నరేష్ రెడ్డి,సందీప్,ఫయాజ్,అశోక్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, అనిల్ ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version