విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే పత్రిక విలేకరులపై దాడి చేయడం అనైతికమైన చర్య అని మండల జర్నలిస్టులు, విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుమారస్వామి లు అన్నారు. తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం జరిగిన దాడులు నిరసిస్తూ మండల కేంద్రంలోనీ చౌరస్తాలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఒక భాగమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే పత్రిక విలేకరులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సరికాదన్నారు. సమాజ హితం కోసం విలేకరులు స్వేచ్ఛపూరిత వాతావరణంలో పని చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి, శ్రీనివాస్, రవి, రామకృష్ణ, కుమార్, కిషోర్, మురళి, వెంకట్, రమేష్, విష్ణు, బాబు, శంకర్, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.

పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల.!

పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు అనైతికం.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ప్రభుత్వం కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే బడిబాట కంటే ముందే సర్దుబాటు ఏంటి…..?

ప్రయత్నం చేయకుండానే పాఠశాలల మూసివేతలా…?

ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కావాలి కానీ ఏదో కారణంతో మూసివేయడం కారాదు.

ప్రభుత్వం ఈ సర్దుబాటు నిర్ణయాన్ని వెంటనే పునః పరిశీలించాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం సరికాదని,ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ సర్దుబాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా సురేందర్ మీడియాతో మాట్లాడుతూ…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆయా వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయులను మరొక పాఠశాలలో సర్దుబాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

ఇటీవలే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి, పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని,బడిబాటలో అత్యధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయాలని సూచించిన ప్రభుత్వం, కనీసం ఉపాధ్యాయులకు ఆ ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకుండానే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం ప్రకటించడం అనైతికమని విమర్శించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జూన్ 6వ తేదీ నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఉపాధ్యాయ లోకం కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అత్యధికంగా చేర్పించాలనే కసితో ఉన్నారని, ఇప్పటికే పలుమార్లు గ్రామాల్లో బడిబాట ర్యాలీలు తీయడం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం కూడా జరిగిందని వివరించారు.

ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే సంకల్పం, పట్టుదలతో ఉపాధ్యాయులు ఉన్నారని, చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు.

విద్యార్థులను పాఠశాలలో చేర్పించే అసలు బడి బాట కార్యక్రమం ముందే ఉండగా, కనీసం ఉపాధ్యాయులను బడిబాట కార్యక్రమ ప్రయత్నం చేయనివ్వకుండానే కొన్ని పాఠశాలలను మూసివేస్తామనడం, ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామనడం ప్రభుత్వ దమననీతికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. కనీస ప్రయత్నం చేయించకుండానే పాఠశాలలను ఎలా మూసివేస్తారని, ఏ ప్రాతిపదికన ఉపాధ్యాయ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కావాలి కానీ పాఠశాలలను ఏదో ఒక కారణంతో మూసివేయడం కారాదు అని సూచించారు.

ఒకవేళ బడిబాట కార్యక్రమ అనంతరం కూడా అడ్మిషన్లలో ఎలాంటి పురోగతి లేనట్లయితే అప్పుడు ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

అంతే కాదు చాలా పాఠశాలల్లో త్రాగు నీటి సౌకర్యం లేదని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి త్రాగునీటి సౌకర్యం కల్పించేలాగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు .

ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం తీసుకొచ్చేలాగా ప్రభుత్వం పనిచేయాలని ఈ సందర్భంగా సురేందర్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version