విమర్శించాడా..

విమర్శించాడా…

 

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల విడుదలైన ‘దురంధర్’ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ సినిమా తనకు తెగ నచ్చిందని తెలిపాడు. అదే సమయంలో అందులోని రాజకీయ అంశాలతో తాను ఏకీభవించనని, కొన్ని సందర్భాలలో ఫిల్మ్ మేకర్స్ ప్రపంచ పౌరులుగా ఆలోచించాలని సూచన చేశాడు. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike) మూవీ తర్వాత ఆదిత్య థర్ తెరకెక్కించిన సినిమా ‘దురంధర్’ (Durandhar). డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమాపై మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన… వాటికి భిన్నంగా సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. సినిమా నిడివి మూడున్నర గంటలు ఉండటాన్ని చాలామంది విమర్శిస్తున్నా… మరికొందరు అంత సమయం సినిమా చూశామనే భావనే తమకు కలగలేదని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇండి-పాక్ వార్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు పెద్దంతగా జనాదరణకు నోచుకోలేదు. వాటి మేకింగ్ ఎఫిక్టివ్ గా లేకపోవడమే దానికి కారణమని విమర్శకులు చెబుతున్నారు. ఈ సమయంలో ‘దురంధర్’ మూవీని ఆదిత్య ధర్ (Aditya Dhar) ఎలాంటి శష బిషలు పెట్టుకోకుండా తాను అనుకున్న రీతిలో, అనుకున్న విధంగా తీశారు. ఇండియాను నాశనం చేయడానికి శత్రుదేశం పాకిస్తాన్ ఎలాంటి పన్నాగులు పన్నుతుంటుంది, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అదే దేశంలో భారత దేశానికి చెందిన సీక్రెట్ ఏజెంట్స్ ఎలా పనిచేస్తుంటారో ఇందులో చూపించారు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లోని పాలిటిక్స్, మిలిటరీ వ్యవస్థలకు సంబంధించి కూలంకషంగా ‘దురంధర్’లో చూపించే ప్రయత్నం ఆదిత్య ధర్ చేశాడు. ఇది ఓ రకంగా ఇక్కడి వారిని బాగా ఆకట్టుకున్న అంశం. అదే సమయంలో పాకిస్తాన్ కుట్రలను భగ్నం చేయడానికి ఈ దేశ రహస్య గూఢచారులు ఎంతవరకైనా వెళతారనే విషయాన్ని చూపించిన విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాలో హింస మోతాదుకు మించి ఉందనే వాదనా లేకపోలేదు.ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెట్టిన రివ్యూ చర్చలకు దారితీస్తోంది. ‘నాకు సినిమాలంటే ఇష్టం. కథలో ప్రేక్షకుడిని లీనం చేసి, వారి మనసులోని భావాలను బయటకు తీసుకొచ్చే ఫిల్మ్ మేకర్స్ అంటే అభిమానం. ‘దురంధర్’ కూడా అలాంటిఓ అద్భుతమైన సినిమా. నిజం చెప్పాలంటే… ఇదే అసలైన సినిమా’ అని ఆకాశానికి ఎత్తేశాడు. అదే సమయంలో ఈ సినిమాలోని రాజకీయాలతో తాను ఏకీభవించని, మేకర్స్ ఎప్పుడు విశ్వ మానవులమనే భావనతో సినిమాలు తీయాలని పేర్కొన్నాడు. అంటే ఈ సినిమాలో పాకిస్తాన్ ను శత్రువుగా ఆదిత్య ధర్ చూపించడాన్ని హృతిక్ రోషన్ కు ఎక్కడో బాధను కలిగించినట్టుగా నెటిజన్స్ భావిస్తున్నారు.

ప్రియుడి భార్య ఎంట్రీ.. 10వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీసిన మహిళ..

ప్రియుడి భార్య ఎంట్రీ.. 10వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీసిన మహిళ

ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న ఓ మహిళ అతని భార్య సడెన్ గా ఎంట్రీ ఇవ్వడంతో షాక్ కి గురైంది. తప్పించుకునే ప్రయత్నంలో 10వ అంతస్తు బాల్కానీ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేయగా అది కాస్త బెడిసి కొట్టింది.ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కాపురాలు కుప్పకూలి పోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. తాజాగా చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచిచాడు. అంతలోనే అతని భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక భయపడి తన ప్రియురాలిని బాల్కానీలో దాక్కోమని బలవంతం చేశాడు.

అలాంటి కన్నింగ్ వ్యక్తి కోసం ప్రాణాలు ఇలా పణంగా పెట్టడం సరికాదు అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. కొంత కాలంగా చైనాలో విడాకుల రేటు గణనీయంగా పెరిగిపోయింది. 1998 నుంచి 2018 మధ్య విడాకుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్లు సమాచారం. 2023 నాటికి, 3.6 మిలియన్లకు పైగా జంటలు విడాకుల కోసం దాఖలు చేశాయి. దీన్ని అరికట్టేందుకు.. అక్కడి ప్రభుత్వం విడాకులు కోరే జంటకు ముప్పై రోజుల పాటు ‘కూలింగ్ – ఆఫ్’ పిరియడ్ ని తప్పనిసరి చేసింది. దీని ద్వారా 30 రోజుల్లోపు దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశం లభించింది.

హోటల్ గది ఖాళీ చేసే సమయంలో..

హోటల్ గది ఖాళీ చేసే సమయంలో.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

హోటల్ గదిని బుక్ చేసుకున్న దంపతులు.. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. భర్త హోటల్ గదిని ఖాళీ చేస్తున్న సమయంలో భార్యకు వింత ఆలోచన వచ్చింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో కక్కుర్తి కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో మాత్రం ఇది పీక్స్‌లో ఉంటుంది. ఎంతలా ఉంటుందంటే.. కంటికి కనిపించే ప్రతీదీ తనకే దక్కాలి.. అనేంతలా ఉంటుంది. ఇలాంటి కక్కుర్తితో కొందరు చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. మరికొందరు చేసే పనులు తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ హోటల్ గదిలో చేసిన నిర్వాకం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హోటల్ గదిలో ఇదేం పనమ్మా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హోటల్ గదిని బుక్ చేసుకున్న దంపతులు.. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. భర్త హోటల్ గదిని ఖాళీ చేస్తున్న సమయంలో భార్య కన్ను.. లోపల ఉన్న వస్తువులపై పడింది. ఫ్రీగా ఏం దొరుకుతుందబ్బా.. అని గది మొత్తం తేరిపారా చూసింది.ఇంతలో ఆమెకు బాత్రూంలో హ్యాండ్ వాష్ లిక్విడ్ కనిపించింది. దాన్ని ఎందుకు వదిలేయడం అనుకుని.. వెంటనే అక్కడికి వెళ్లి.. లోపల ఉన్న లిక్విడ్ బాటిల్‌ను బయటికి తీసింది. అందులోని లిక్విడ్‌ను (Woman Stole Hand Wash Liquid) వాటర్ బాటిల్‌లో నింపేసింది. తర్వాత ఖాళీ బాటిల్‌ను యథావిధిగా అక్కడే పెట్టేసి.. ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయింది. లిక్విడ్‌ను కూడా వదలని ఆమె కక్కుర్తి.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది.ఈ ఘటనను మొత్తం ఆమె భర్త వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె కక్కుర్తి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ఘనకార్యాలు మహిళలకే సాధ్యం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

జంగిల్ సఫారీలో ఫొటోగ్రాఫర్లకు షాక్..

 జంగిల్ సఫారీలో ఫొటోగ్రాఫర్లకు షాక్.. ఫొటోలు తీస్తుండగా పక్కనే చిరుత.. చివరకు..

 

కొందరు ఫొటోగ్రాఫర్లు వాహనాల్లో జంగిల్ సఫారీకి వెళ్లారు. అడవిలో చక్కర్లు కొడుతూ తమ కంటికి కనిపించే దృశ్యాలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇంతలో వారికి దూరంగా చిరుత పులులు కనిపించాయి. వాటిని ఫొటోలు తీస్తుండగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

జంగిల్ సఫారీ అంటే ఇష్టపడని వారుండరు. అడవి మధ్యలో క్రూరమృగాల మధ్యలో నుంచి వెళ్లడమే కాకుండా వాటిని అతి దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే అడవిలోని అద్భుత దృశ్యాలను వీక్షించే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే కొన్నిసార్లు అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. పులులు, సింహాలు.. వాహనాలను చుట్టుముట్టడం ఒక ఎత్తైతే.. కొన్నిసార్లు అవి మనుషులు గాయపడడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఫొటోగ్రాఫర్లు (Photographers) వాహనాల్లో జంగిల్ సఫారీకి (Jungle Safari) వెళ్లారు. అడవిలో చక్కర్లు కొడుతూ తమ కంటికి కనిపించే దృశ్యాలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇంతలో వారికి దూరంగా చిరుత పులులు కనిపించాయి. దీంతో వాహనాన్ని గడ్డిలో ఆపి.. కిందకు దిగారు. వాహనం పక్కనే కూర్చున్న ఇద్దరు ఫొటోగ్రాఫర్లు కాస్త దూరంలో ఉన్న చిరుతను ఫొటోలు తీస్తుంటారు.
అక్కడున్న ఇద్దరు ఫొటోగ్రాఫర్లలో ఓ మహిళ కూడా ఉంటుంది. వారు ఫొటోలు తీస్తుండగా.. మరో చిరుత (Leopard) వచ్చి వారి పక్కనే నిలబడుతుంది. కాసేపట తర్వాత ఫొటోలు తీస్తున్న మహిళ దృష్టి.. ఆ చిరుతపై పడుతుంది. చిరుతను ఫొటో తీస్తున్న ఆమె.. పక్కనే మరో చిరుత ఉండడం చూసి షాక్ అవుతుంది. అయితే ఆ చిరుత వారికి ఎలాంటి హానీ చేయకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘లక్ష్యంపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యంపై.. వెళ్తున్న మార్గాన్ని పరిశీలించడం కూడా అంతే ముఖ్యం’.. అంటూ కొందరు, ‘వీళ్ల అదృష్టం బాగుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 88 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version