భారతీయ వైద్య విధానం ప్రపంచానికి ఆదర్శం…

భారతీయ వైద్య విధానం ప్రపంచానికి ఆదర్శం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

భారతీయ వైద్య విధానం ప్రపంచానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ప్రపంచ హోమియోపతి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత,ప్రోగ్రాం అధికారులతో హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతీయ వైద్య విధానం ఆదర్శంగా నిలిచిందని,ఎన్నో రకాల వైద్య పద్ధతుల ద్వారా వ్యాధులను నయం చేసే విధానాలను అవలంబించడం జరుగుతుందని తెలిపారు.భారతీయ వైద్య వ్యవస్థలో హోమియో, ఆయుర్వేదం,యునాని,యోగ వంటి అనేక పద్ధతులలో వ్యాధులను నయం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.కీళ్ల నొప్పులు,మధుమేహం,రక్త పోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హోమియోపతి,న్యాచురోపతి, యోగ వంటి విధానాల ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయుష్ వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.అతి సాధారణ ఖర్చులతో ప్రకృతికి దగ్గరగా యోగ,ఫిజియోథెరపీ ద్వారా అందించే చికిత్సకు మంచి ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన ప్రజా పలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, గ్రామీణ స్థాయి నుండి పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని,మన జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు,వైద్యులు,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓరి దేవుడా.. నిలబడి నీళ్లు తాగితే ఇన్ని ఆరోగ్య సమస్యలా..

ఓరి దేవుడా.. నిలబడి నీళ్లు తాగితే ఇన్ని ఆరోగ్య సమస్యలా..?

 

ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. కానీ, నిలబడి నీళ్లు తాగితే శరీరం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని అంటారు. అయితే, ఇందులో నిజమెంత? ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

 శరీరానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇది మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా మన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. కానీ, చాలా కాలంగా నీరు తాగడానికి సరైన మార్గం గురించి చర్చ జరుగుతోంది. నిలబడి ఉన్నప్పుడు నీరు తాగకూడదని అంటారు. దీనికి కారణం అందరికీ తెలియకపోయినా, చాలా మంది ఈ నియమాన్ని పాటిస్తారు. అయితే, నిలబడి ఉన్నప్పుడు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదా? ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నిలబడి నీరు తాగినప్పుడు, అది అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వెళుతుంది. ఇది అజీర్ణం లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది, కాబట్టి కూర్చుని నెమ్మదిగా నీరు తాగడం మంచిది.నిలబడి నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు?

సాధారణంగా నిలబడి నీరు తాగడం మంచిది కాదు. ఇది మోకాళ్లకు నేరుగా హాని కలిగించకపోయినా.. జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది: నిలబడి నీరు తాగినప్పుడు, అది అన్నవాహిక ద్వారా త్వరగా కడుపులోకి ప్రవేశిస్తుంది. ఈ వేగవంతమైన వినియోగం జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.

మూత్రపిండాల నొప్పికి కారణం: నిలబడి నీరు తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది మూత్రపిండాలలో ద్రవం నిలుపుదలకు దారితీస్తుంది. చివరికి మూత్రపిండాల నొప్పికి దారితీస్తుంది. నిలబడి నీరు తాగడం వల్ల అది ఫిల్టర్ కాకుండా త్వరగా కడుపులోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మూత్ర నాళంలో నీటిలో మలినాలు పేరుకుపోతాయి. అంతే కాదు, ఇది మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

 మీరు నిలబడి నీరు తాగినప్పుడు అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థ ద్వారా సరిగ్గా గ్రహించలేరు.నరాల చికాకు: నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది నరాల చికాకుకు కారణమవుతుందని కూడా అంటారు.

ఆయుర్వేదం ప్రకారం, నీటిని ఎప్పుడూ కూర్చున్నప్పుడు, ప్రశాంతంగా, చిన్న సిప్స్‌లో తాగాలి. నిలబడి లేదా తొందరపడి నడుస్తున్నప్పుడు తాగకూడదు. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.

ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం.!

ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం అజయ్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్
శేరిలింగంపల్లి,

నేటి ధాత్రి:-

 

నల్లగండ్లలో ఇందూ ఆయుర్వేద క్లినిక్ ప్రారంభం

ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, మందుల ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా అన్నారు. నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందు ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాస్పిటల్ వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ప్రాచీన వైద్య చికిత్సలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద హాస్పిటల్ ను అందరికీ అందుబాటులో ఉండేలా నల్లగండ్లలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, దీని ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. ఎంతోకాలంగా ఆయుర్వేద చికిత్స విధానాలను అనుసరిస్తున్నానని, తద్వారా 35 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వానికి సేవలందించానన్నారు. మానసిక, శారీరక రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక రోగాలకు సైతం మెరుగైన వైద్య చికిత్సలో ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయని వైద్యులు ప్రదీప్ నోరి అన్నారు. ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పవన్ మల్లాడి,,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version