ఓరి దేవుడా.. నిలబడి నీళ్లు తాగితే ఇన్ని ఆరోగ్య సమస్యలా..

ఓరి దేవుడా.. నిలబడి నీళ్లు తాగితే ఇన్ని ఆరోగ్య సమస్యలా..?

 

ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. కానీ, నిలబడి నీళ్లు తాగితే శరీరం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని అంటారు. అయితే, ఇందులో నిజమెంత? ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

 శరీరానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇది మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా మన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. కానీ, చాలా కాలంగా నీరు తాగడానికి సరైన మార్గం గురించి చర్చ జరుగుతోంది. నిలబడి ఉన్నప్పుడు నీరు తాగకూడదని అంటారు. దీనికి కారణం అందరికీ తెలియకపోయినా, చాలా మంది ఈ నియమాన్ని పాటిస్తారు. అయితే, నిలబడి ఉన్నప్పుడు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదా? ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నిలబడి నీరు తాగినప్పుడు, అది అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వెళుతుంది. ఇది అజీర్ణం లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది, కాబట్టి కూర్చుని నెమ్మదిగా నీరు తాగడం మంచిది.నిలబడి నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు?

సాధారణంగా నిలబడి నీరు తాగడం మంచిది కాదు. ఇది మోకాళ్లకు నేరుగా హాని కలిగించకపోయినా.. జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది: నిలబడి నీరు తాగినప్పుడు, అది అన్నవాహిక ద్వారా త్వరగా కడుపులోకి ప్రవేశిస్తుంది. ఈ వేగవంతమైన వినియోగం జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.

మూత్రపిండాల నొప్పికి కారణం: నిలబడి నీరు తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది మూత్రపిండాలలో ద్రవం నిలుపుదలకు దారితీస్తుంది. చివరికి మూత్రపిండాల నొప్పికి దారితీస్తుంది. నిలబడి నీరు తాగడం వల్ల అది ఫిల్టర్ కాకుండా త్వరగా కడుపులోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మూత్ర నాళంలో నీటిలో మలినాలు పేరుకుపోతాయి. అంతే కాదు, ఇది మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

 మీరు నిలబడి నీరు తాగినప్పుడు అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థ ద్వారా సరిగ్గా గ్రహించలేరు.నరాల చికాకు: నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది నరాల చికాకుకు కారణమవుతుందని కూడా అంటారు.

ఆయుర్వేదం ప్రకారం, నీటిని ఎప్పుడూ కూర్చున్నప్పుడు, ప్రశాంతంగా, చిన్న సిప్స్‌లో తాగాలి. నిలబడి లేదా తొందరపడి నడుస్తున్నప్పుడు తాగకూడదు. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version