నేటి బీసీ సంఘాల రాష్ట్ర బంద్ కు సీపీఐ మద్దతు
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే నేటి తెలంగాణ రాష్ట్ర బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు మాట్లాడారు. బీసీలు దశాబ్ద కాలంగా రిజర్వేషన్లు పెంచాలని పోరాటాలు చేస్తున్న నేపద్యంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని తలపెట్టిన బంద్ కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, అన్ని కుల సంఘాలు,అన్ని వర్గాల ప్రజలు సహకరించి బంద్ లో పాల్గొనాలని తెలిపారు. అగ్రకులాల వారు బీసీ రిజర్వేషన్ ఆపాలని కోరుతూ స్టే తీసుకొచ్చిన నేపథ్యంలో బంద్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇప్పకాయల లింగయ్య, సాంబయ్య , మొండి, పౌలు, మారేపల్లి రవి, రాయలింగు,రాములు,దేవానంద్, గోపి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
