మహిళ సాధికారత లక్ష్యమే స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్
* ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, నేటిధాత్రి :
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 75వ పుట్టిన రోజునుపురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పట్టణ కేంద్రంలో బుధవారం కేజీఆర్ కన్వెన్షన్ హాల్ లో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవకాశాన్ని మహిళలు, చిన్నపిల్లల కు డయాబెటిస్, డెంటల్, కలరా, సాదరణ ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 74 మంది యువత రక్తదానం చేశారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి తమ వంతు సహకారం అందించిన యువతను అభినందించారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. నరేంద్ర మోడీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నేరంద్రమోడీ పదేళ్ల పాలనలో దేశప్రగతి పురోగతి సాధించిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు. పార్లమెంట్ లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించి సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బిజెపి యువ నాయకులు డా. మల్గారి వైభవ్ రెడ్డి , మండల అధ్యక్షులు శ్రీకాంత్, అనంతరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కొంచెం శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, శర్వలింగం, మాణిక రెడ్డి, శర్వలింగం, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, గుడిపల్లి మధుసూదన్ రెడ్డి, పత్తి సత్యనారాయణ, పెద్దోళ్ల కృష్ణ, బిజెపి శ్రేణులు వైద్య అధికారులు, అంగనివాడి, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు
సిద్ధాపూర్ వద్ద చిరుత పులి కలకలం: ప్రజల్లో భయాందోళనలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం పట్టి సిద్ధాపూర్ వద్ద జహీరాబాద్-తాండూర్ రహదారిపై శుక్రవారం ఉదయం చిరుత పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జహీరాబాద్ నుంచి సిద్ధాపూర్, కుంచారం నుంచి జహీరాబాద్ వెళ్లే మార్గాల్లో రాకపోకలకు ప్రజలు భయపడుతున్నారు. ఐదు నుంచి ఆరు మంది గుంపులుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి బారి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఈ సమాచారాన్ని వినయ్ పవర్, AITF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, NHCR చైర్మన్ అందించారు.
జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (బి) గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతానికి చెందిన ఆయన, నిర్వర్తిస్తున్నారు. ఈనెల 162 తేదీన ఆరోగ్య సమస్యలు ఉన్నందున సెలవు ఇవ్వాలని ఎం.పీ.డీ.వోను కోరగా, ఆ సెలవు తిరస్కరించారని మృతుని భార్య ఆరోపించారు. అంతేకాక, గత ఎం.పీ.వో.తో పాటు ప్రస్తుత ఎం.పీ.వో కూడా తన భర్తను మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్కు ఒక చిన్న పాప ఉంది.
రైతు యూరియా పొందడం అంటే ఓ యుద్ధం చేసినట్టుగా మారింది. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు యూరియా లోడ్ రావడం జరిగింది.
urea shortage in Nizampet, Medak
సమాచారం తెలుసుకున్న రైతులు గ్రామంలో గల రైతు వేదికలో యూరియా పంపిణీ చేస్తారెమొనని వేచి ఉన్నప్పటికీ యూరియా పంపిణీ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి భారీ వర్షం కురవడంతో కరెంటు బంద్ అయినప్పటికీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చీకటిలో, చెప్పులతో సహా క్యూలైన్లో ఉన్నారు.
urea shortage in Nizampet, Medak
యూరియా పంపిణీ జరగకపోవడంతో తెల్లవారితే.. క్యూలైన్ పెరుగుతుందని రైతులు రాత్రి వేళలో క్యూ లైన్ కట్టారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి యూరియాను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.
urea shortage in Nizampet, Medakurea shortage in Nizampet, Medak
కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ -కంచెలు తొలగించాం..మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచాం..
– అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి పాలన
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
-విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఆంధ్ర నుండి విడివడిన తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో నియంత పాలనలో మగ్గిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు నయా నిజాంగా మారి భూములను, ప్రాజెక్టులను మింగేశాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..మొగుళ్లపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోలినేని లింగారావు గత ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట నయా నిజాంగా మారాడన్నారు. పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ప్రజాస్వామ్యం పీక పీకేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తామని చెప్పిన ప్రకారంగానే 2023 డిసెంబర్ 3న తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యమన్నారు. తెలంగాణలో దొరవేసిన కంచెలను తెంచి..మానసిక బానిసత్వ సంకెళ్లను తెంచామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారన్నారు. పాలనలో పారదర్శకత..అభివృద్ధిలో ఆధునికత..సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ..తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ..నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులను తీసుకువచ్చి..కనివిని ఎరుగని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాడని పోలినేని లింగారావు కొనియాడారు.
గంగమ్మ దేవస్థానం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన – సుమన్ బాబు..
తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా ఏర్పాటైన చైర్మన్ మహేష్ యాదవ్, కమిటీ సభ్యులు రుద్ర కిషోర్, విమల, వరలక్ష్మి, మధులత, గుణ, భాగ్య వల్లి, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, శ్యామల, లక్ష్మనరావు లను.. గురువారం గంగమ్మ తల్లి దేవస్థానంలో తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సుమన్ బాబు ఘనంగా సత్కరించారు. చైర్మన్, కమిటీ సభ్యులందరికీ జనసేన నాయకులు సుధాకర్, పవన్ కుమార్, సుమంత్ లలో కలసి శుభాకాంక్షలు తెలియజేశారుకూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ కమిటీ సభ్యుల ద్వారా గంగమ్మ తల్లిని భక్తులకు మరింత చేరువయ్యేలా చేయాలని, ఆలయ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని సుమన్ బాబు కోరారు. ఈ క్రమంలో ఆముదాల వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, పవన్ ముకేష్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు.. లక్ష రూపాయల బహుమతి అవకాశం – జిల్లా కన్వినర్ మేడికాల అంజయ్య
చందుర్తి, నేటిధాత్రి:
రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, తెలంగాణ (ఎస్ ఏల్ టీ ఏ -టి ఎస్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ లు మేడికాల అంజయ్య, రాచర్ల వేణుమాధవ్, సత్య ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే ఈ అవకాశం ఉందన్నారు. 6వ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు, రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయించిన తెలంగాణ కవులైన 11మంది గురించి వ్యాసం రాయాలన్నారు. ఆ కవులు, 1)బమ్మెర పోతన ,2)దాశరధి కృష్ణమాచార్య ,3)సుద్దాల హనుమంతు, 4)వట్టి కోట ఆళ్వార్ స్వామి, 5)వానమామలై వరదాచార్యులు, 6)సురవరం ప్రతాపరెడ్డి, 7)సామల సదాశివ, 8)బోయ జంగయ్య, 9)పాకాల యశోద రెడ్డి, 10)కాళోజీ నారాయణరావు, 11)డాక్టర్ సి.నారాయణరెడ్డి పాఠశాల స్థాయిలో పై కవుల గురించి వ్యాసరచన పోటీ పెట్టి ప్రతి పాఠశాల నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి రాసిన రెండు వ్యాసాలను జిల్లా స్థాయి పోటీలకు పంపించవలసి ఉంటుందని వారు తెలిపారు. అలా జిల్లా స్థాయిలో ప్రత్యక్ష పోటీకి ఎంపికై వచ్చిన 50 వ్యాసాల నుండి 5 గురుని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు అంజయ్య తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ గెలిచిన విద్యార్థులందరికీ లక్ష రూపాయలను బహుమతులుగా పంచనున్నట్లు నిర్వాహకులు నిర్ణయించినట్లు, వారు తెలిపారు. జిల్లా స్థాయికి ప్రతి పాఠశాల నుంచి రెండు వ్యాసాలు పంపించాలన్నారు. వీటికి చివరి తేదీ అక్టోబర్ ఆరు గా నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరిని ఈ వ్యాసరచన పోటీలలో పాల్గొనేటట్లు చేసి, ప్రతి పాఠశాల నుంచి రెండు వ్యాసాలను పంపించేలా తెలుగు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, ఇందుకుగాను గూగుల్ ఫాం నింపాలన్నారు.విద్యార్థులు రాసిన తెలంగాణ కవుల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ఉన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడికాల అంజయ్య, వేణుమాధవ్, సత్య ప్రవీణ్ పిలుపునిచ్చారు.పూర్తి వివరాలకు 9441544727,9440491439 నెంబర్ల ను సంప్రదించాలన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్న రావు ఆదేశాల మేరకు నాటు సారా నియంత్రణకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గురువారం నల్లబెల్లి మండలం నందిగామ, రేలకుంట జంట గ్రామాలలో నాటుసార స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందని.ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 1900 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని వరంగల్ రూరల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ మురళీధర్ పేర్కొన్నారు. ఈ దాడులలో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, వరంగల్ రూరల్ టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగయ్య, ఎస్సైలు రమ, శిరీష, స్థానిక ఎస్ఐ గోవర్ధన్ సిబ్బంది పాల్గొన్నారు
అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు గత రెండు సంవత్సరాల నుండి పూర్తికాలేదు ఈ రోడ్డు నిధులను స్థానిక ఎమ్మెల్యే తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమనే రెడ్డి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా నుండి జంగేడు వరకు సెంట్రల్ లైటింగ్ నాలుగు లైన్లతో రోడ్డుకు 10 కోట్లతో రూపాయలతో రోడ్డు నిర్మాణానికి గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు 10 కోట్లు కేటాయించడం జరిగింది కానీ ఆ నిధులను స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భూపాలపల్లి అభివృద్ధిని మరిచి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం నిధులను తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఇప్పటికైనా అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డుకు నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి రఘుపతిరావు తిరుపతి మాడ హరీష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
శాయంపేట మండలం గోవిందా పూర్ గ్రామంలోజాగృతి పోలీస్ కళా బృందం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:45 గంటల వరకు శాయంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం వారిచే యువకులు గంజాయి డ్రగ్స్,గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్ద ని,గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారం అందించాలి. ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, డయల్100, సీసీటీవీ కెమెరాలు, వృద్ధాప్యం లో తల్లితండ్రులను మంచిగ చూసుకోవాలని, మూడ నమ్మకాలపై మ్యాజిక్ షో, అలాగే తదితర సామాజిక అంశాలపై పాటల ద్వార వివరిస్తూ, మరియు సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ ఆప్స్ పై నాటిక ద్వార ప్రదర్శన చేస్తూ1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ తెలి యజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్ ఏ ఎస్ ఐ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్స్ ఆఫీసర్స్, కళాబృందం ఇంచార్జ్ వుమెన్ ఏఎస్ఐ నాగమణి సభ్యులు, హెచ్ ఎస్ విలియమ్, వెంకటేశ్వర్లు,రత్న య్య, పిసి పూల్ సింగ్, హోమ్ గార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, చిరంజీవి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహం,బిపి పరీక్షలు
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :
మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ వద్ద తాండూర్ తెలంగాణ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 46 మందికి మధుమేహం(షుగర్) బి.పి పరీక్షలు ఉచితంగా చేపించారు.మధుమేహం (షుగర్) బీపీ ఉన్నవారికి జాగ్రత్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు దేవరకొండ రాజయ్య,ఉపాధ్యక్షులు ఠాగూర్ ఉమ్రాసింగ్,మద్దికుంట రామచందర్,క్యాబినెట్ మెంబర్ రౌతు వెంకటేశం, తాటిపాముల సాంబమూర్తి ,గందె రాజన్న, తొగరు శ్రీనివాస్,ల్యాబ్ టెక్నీషియన్ వేణు,వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
*రొయ్య రైతులపై అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు..
*ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్రం స్పందన..
తిరుపతి(నేటి ధాత్రి)సెప్టెంబర్ 18:
ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రస్తావించిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా విధించిన దిగుమతి సుంకాల కారణంగా రొయ్య రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే రొయ్యలలో దాదాపు 70 శాతం అమెరికాకు ఎగుమతి అవుతుండగా, తిరుపతి జిల్లాలోనే 28 వేల ఎకరాల్లో సుమారు 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందని ఎంపీ కేంద్రానికి వివరించారు. ఈ విషయంపై సమగ్ర పరిశీలన జరిపిన తర్వాత, మెరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడా)తో చర్చించి పలు చర్యలు చేపట్టినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. అమెరికా పరస్పర సుంకాల నిర్ణయం నేపథ్యంలో ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అధిక విలువ కలిగిన సముద్ర జాతుల ఉత్పత్తి వైపు దృష్టి సారించిందని తెలిపారు. ఇందులో సీబాస్, కోబియా, పొంపానో, క్రాబ్, తిలాపియా, గ్రూపర్, బ్లాక్ టైగర్,స్కాంపి వంటి జాతులను ప్రోత్సహిస్తోందన్నారు. తద్వారా ఆక్వాకల్చర్ రైతుల ఆదాయ భద్రతను పెంచి, అమెరికా వంటి ప్రధాన మార్కెట్లలో టారిఫ్‌ల కారణంగా వచ్చే ఆదాయ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తెలియజేశారుఅంతేకాకుండాఎంపెడా ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లను గుర్తించడం తోపాటుగా, ఇప్పటికే ఉన్న మార్కెట్లను విస్తరించే దిశగా కృషి చేస్తోందన్నారురైతులకు లాభదాయకమైన ధరలు లభించేలా విదేశీ ప్రదర్శనలు, కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు, వాణిజ్య ప్రతినిధి బృందాల ద్వారా చర్యలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ లో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంపొందించేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపిందని తెలియజేశారుఆక్వా రైతుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో అమెరికా సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపి, మార్కెట్ యాక్సెస్ పెంపు, టారిఫ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
జహీరాబాద్: మధ్యాహ్న భోజనం పై ప్రత్యేక దృష్టి సారించండి
జహీరాబాద్ నేటి ధాత్రి:
గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై ఏంఈవోలు తనిఖీలు చేయాలని సూచించారు. స్థలం ఉన్న పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలోపు విద్యార్థుల హాజరును మొబైల్ యాప్ లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాలని ఆదేశించారు.
లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి(11వ వార్డు)లో జరిగిన లంబాడీల తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెళ్లికాని యువతులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులేసి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ…ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకువెళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కుంట పల్లి గ్రామ వాసులు పాల్గొన్నారు
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకన్నగారి చెరువు వద్ద బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించి సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. చెరువు కట్టపైకి వచ్చే మహిళలు సౌకర్యంగా పూల బతుకమ్మలు నిమజ్జనం చేయగలిగేలా ప్రత్యేకంగా మెట్లు తయారు చేయడంపై మున్సిపల్ సిబ్బంది పట్టు పట్టారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో మహిళలు చెరువుకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే భద్రతా చర్యలతో పాటు సౌకర్యాల కల్పనకు ముందస్తుగానే పనులు ప్రారంభించారు. విద్యుత్ దీపాలు, త్రాగునీటి సదుపాయం, చెరువు పరిసరాల్లో శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలందరూ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకునేలా మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని పేర్కొన్నారు. పట్టణంలో బతుకమ్మ వేడుకలు మరింత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరగాలని మున్సిపల్ సిబ్బంది ఆకాంక్షిస్తున్నారు.”
◆:- డా.సంగిశెట్టి శ్రీనివాస్ సామాజిక, రాజకీయ విశ్లేషకులు
◆:- సంచకారి
రజాకార్లలో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారు అని ‘హిందూత్వ’ వాదులు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, రజాకార్లలో దళితులు, బీసీలు, రెడ్లు కూడా ఉన్నారు. నిజానికి ప్రతి గ్రామంలో వారికి అన్ని విధాల షెల్టర్ ఇచ్చి, వండి పెట్టింది గ్రామ పటేల్, పట్వారీలు. వీళ్లు ఎక్కువగా రెడ్డి, బ్రాహ్మణ సామాజికవర్గం వారే! ఈ వాస్తవాన్ని దాచిపెట్టి రజాకార్ల పేరిట ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని టార్గెట్ చేయడము, దోషులుగా చిత్రించడం, ముస్లింలందరూ రజాకార్లే అనే విధంగా భావజాల వ్యాప్తి చేయడం ప్రజల మధ్యన విద్వేషాలను సృష్టించేందుకు వేసే పన్నాగంగానే చూడాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
తము అధికారంలోకి రావాలన్నా, ఉన్న అధికా రాన్ని కాపాడుకోవాలన్న భారతీయ జనతాపార్టీ మత రాజకీయాలపై ఆధారపడుతుంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రత్యేకంగా వాట్సప్ యూనివర్సిటీ సహకారం తీసుకుంటుంది. మతాల మధ్యన ఉద్రిక్తత సదలకుండా చూస్తుంది. ఆవుల రవాణా అడ్డుకునే పేరిట లేని అధికారాన్ని చేతు ల్లోకి తీసుకొని ఆ పార్టీ మద్దతుదారులు లించింగ్కు పాల్పడుతారు. అంతెందుకు చేప్ కేసులో శిక్ష పడ్డ గుజరాతీ నిందితులను విడుదల చేయించడంలోనూ, విడుదలైన వారిని ఘనంగా ఊరేగించడంలోనూ వీరికి వీరే సాటి, ఒకే దేశం, ఒకే సంస్కృతి’ పేరిట భిన్నత్వాన్ని చిరిమేస్తున్నది. నిలదీస్తే నిందిస్తున్నదీ వీళ్ళే.
మొత్తమ్మీద తమకు ఓట్లు ఒనగూరే ఏ మార్గాన్నైనా ఈ పార్టీ ఆరాధిస్తుంది. అనుసరిస్తుంది. మెజారిటీ-మైనారిటీ నేరేషన్ ప్రచారంలో పెడుతూ ఓట్ల రాజకీయా లకు తెరదీస్తుంది. ఈ పరంపరలో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వరుసగా రెచ్చగొట్టే సినిమాలు తీసి విడుదల చేసిండ్రు. అందుకు తగ్గట్టుగా రాజకీయ లాభమూ పొందిండ్రు! అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ‘రజాకార్’ అనే సినిమాను విడుదల చేసిండ్రు. ఇప్పుడు హైదరాబాద్్ప పోలీసు చర్య జరిగి 77 ఏండ్లయిన సందర్భంగా మరో సారి ఈ విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమున్నది.
1947 ఆగస్టు 15 తర్వాత నిజాం హైదరాబాద్్న ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ మేరకు ఇండియా- హైదరాబాద్ రాజ్యాల మధ్యన నవంబర్ 29, 1947 నాడు యథాతథ ఒడంబడిక జరిగింది. పాకిస్తాన్ ప్రధాని జిన్నా, ఇంగ్లండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్లు హైదరాబాద్ రాజ్య సార్వభౌమాధికారాన్ని గుర్తించారు. లాండ్లకే దేశమయినంత మాత్రానా దానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉండవా అని చర్చిల్ దేశ పార్లమెంటులో మాట్లాడిండు. హైదరాబాడ్ని వెనకేసుకొచ్చిండు. ఈ అన్నింటి నేపథ్యంలో హైదరాబాద్్ప ఇండియా దాడి సరికాదంటూ రజాకార్లు తిరుగుబాటు చేసిండ్రు.
అయోధ్యలో బాబ్రీమసీదుని కూల్చిన కరసేవకుల మాదిరిగానే రజాకార్లు చట్టానికి అతీతులుగా వ్యవహరించారు. నిజానికి రజాకార్లు అంటే దైవ కార్యకర్తలు. ఈ దైవ కార్యకర్తలు దేవుని పేరిట నిజామ్ ప్రభుత్వాన్ని, ‘ప్రభువు’ ఉప్మానలీ ఖాన్ని కాపాడేందుకు అనుసరించిన దోపిడి, దౌర్జన్య, హత్య, అత్యాచార మార్గాలను ఖండించాల్సిందే. ఈ దుర్మార్గానికి గాను వారిని నిందించాల్సిందే, నిలదీయాల్సిందే. దోషులుగా నిలబెట్టాల్సిందే. అయితే అదే సమయం లో రజాకార్లు ఎవరు? ఇందులో అన్ని మతాల వారున్నారా? ఉంటే వారి వ్యవహార శైలి ఎలా ఉండింది? అనే విషయాలన్నీ కూలంకషంగా చర్చించుకోవాలి. స్వీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించకుండా చూడాలి.
రజాకార్’ సినిమాలో అత్యాచారాలు, హత్యలు చేసే ఉన్మాద బృందంగా ఈ రజాకార్లను చిత్రించారు. అయితే ఈ రజాకార్లలో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారు అని హిందూత్వ వాదులు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, రజాకార్లలో దళితులు, బీసీలు, రెడ్లు కూడా ఉన్నారు. నిజానికి ప్రతి గ్రామంలో వారికి అన్ని విధాల షిల్టర్ ఇచ్చి, నండి పెట్టింది గ్రామ పటేల్, పట్వారీలు, వీళ్లు ఎక్కువగా రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గం వారే! ఈ వాస్తవాన్ని దాచిపెట్టి రజాకార్ల పేరిట ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని టార్గెట్ చేయడము, దోషులుగా చిత్రించడం, ముస్లింలందరూ రజాకార్లే అనే విధంగా భావజాల వ్యాప్తి చేయడం ప్రజల మధ్యన విద్వేషాలను సృష్టించేందుకు చేసే పన్నాగంగానే చూడాలి.
దొరలు, దేశ ముఖు, దేశ పొంద్యాలు, జాగీర్దార్లు, జమీందార్లు గ్రామాల్లో చేయించే నిర్బంధ వెట్టిచాకిరిని నిరసిస్తూ 1937, 1938
రెండేండ్లలోనే తెలంగాణలోని కేవలం నల్లగొండ, వరంగల్ జిల్లాలలో మొత్తం 18వేల మంది దళితులు ఇస్లామ్ మతంలోకి మారిండ్రు. వెట్టి దాకిరి నుంచి విముక్తి కలగడమే గాకుండా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ వాళ్లు వీరిని కొంత ఆర్థికంగా ఆదుకున్నారు. ఇట్లా మతం మార్చుకున్న వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా రక్షణగా ఉండింది కూడా మజ్లిస్ బృందమే! కేవలం దళితులే కాదు బీసీలు కూడా ఇట్లా మతం మార్చుకున్న వారిలో ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య కూడా ఇస్లామ్ స్వీకరించిండు. తన మందలోని గొర్లను దొరలు బలవంతంగా ఎత్తుకుపోవడానికి పరిష్కార మార్గంగా దొడ్డి మల్లయ్య మతం మారిండు. శుద్ధి, కబ్లీగ్ ఉద్యమాలు రెండు వైపులా జరిగాయి. ఈ ఉద్రిక్త పరిస్థితి ఒక దశాబ్దంపాటు కొనసాగింది
సాయుధ పోరాట కాలంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, రజాకార్ల మధ్యన ముఖాముఖి పోరు జరిగింది. ఒకరినొకరు చంపుకున్నారు. ఇందులో భాగంగానే రజాకార్లు’ 1947 జూలై తర్వాత మాత్రమే మిలిటరీ శిక్షణ ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాం పార్వభౌమత్వానికి భంగం రాకుండా చూడాలని కార్యకర్తలకు ఉద్బో ధించారు. ఇదంతా రజాకార్లు నిజాం ప్రభుత్వాన్ని కాపాడుకోన దానికి, ఇండియా దాడి చేస్తే తిప్పికొట్టడానికి కాసిం రజ్వీ మద్దతు దారులు చేసిన ప్రతిజ్ఞ. అయితే ఈ ప్రతిజ్ఞ చేసిన వారిలో కేవలం ముస్లింలే కాదు. అన్ని మతాల వారున్నారు.
అంతేందుకు నిజాం ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పింగళి వెంకటరామారెడ్డి ఉప ప్రధానిగా వ్యవహరించిండు. రజాకార్లకు మద్దతుదారుగా నిలిచారు అనే ఆరోపణలపై పోలీస్ యాక్షన్ తర్వాత ఈయన్ని మిలిటరీ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. ఈయన తనయుడు పింగళి జగన్మోహన్రెడ్డి ఆ తర్వాత జడ్జిగా పనిచేశారు. అదే సమయంలో వెంకటరామారెడ్డితో పాటు గృహ నిర్బంధంలో ఉన్న మరో మంత్రి బి.ఎస్.వెంవిద్యాశా దళితుడైన బి.ఎస్.వెంకటరావు బహిరంగంగానే రజాకార్లకు మద్దతు ప్రకటించిండు. ఈయన నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ
మంత్రిగా పనిచేసిండు. తన పదవీ కాలంలో అంబేడ్కర్ ఔరంగా బాద్లో ఏర్పాటు చేసిన కళాశాలకు ఈయన ఆర్ధికంగా అండగా నిలిచిండు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కోటి రూపాయల నిధిని నిజామ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నిధి నుంచి విద్యాశాఖా మంత్రిగా పదిలక్షల వరకు తన అభీష్టం మేరకు సంస్థలకు కేటాయించే అధికారం ఆయనకుండింది. అట్లా ఎన్ని సార్లయినా కేటాయించే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కట్ట బెట్టింది. అయితే ఈ సొమ్ములో నుంచి కాసిం రజ్వీ నడిపించిన రజాకార్లకు ఆర్ధిక సహాయం అందిందని రిపోర్టు ఆన్ ద రజాకార్స్ అనే పేరిట హైదరాబాద్్ప పోలీసు చర్య జరిగిన వెంటనే ప్రచురించిన గ్రంథంలో పేర్కొన్నారు. ఇదే నివేదికలో బి.ఎస్.వెంకటరావు స్వయం గా బీదర్ కు వెళ్ళి దళితులను రెచ్చగొట్టి భూస్వాములను దోచుకో వాలని రెచ్చగొట్టినట్టు కూడా పేర్కొంది. అయితే ఇదంతా ఎక్కడా కూడా రుజువు కాలేదు. బి.ఎస్.వెంకటరావుని కూడా మిలిటరీ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకున్నది. మొత్తం ఐదు మంది హిందువులు నిజాం ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిండ్రు. ఇందులో మొదటి వ్యక్తి పింగళి వెంకట రామారెడ్డి పూర్తి కాలం నిజాంకు మద్దతుదారుడిగా ఉన్నారు రెండో
పూర్తి బి.ఎస్.వెంకటరావు. ఈయన కూడా సానుకూలంగానే ఉన్నాడు. మూడో వ్యక్తి రామాచారి. కర్నాటక-హైదరాబాద్కు చెందిన ఈయన మొదట నిజాం ప్రభుత్వంలో చేరిండు. అయితే వారి చర్యలు హిందు పులకు వ్యతిరేకంగా ఉండడంతో కొన్ని రోజుల తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈయన కాంగ్రెస్ వాది, మరో వ్యక్తి మల్లికార్జు నప్ప, హైదరాబాద్- కర్కాటకకు చెందిన ఈయన లింగాయత్ ల ప్రతినిధిగా మంత్రివర్గంలో కొనసాగించు. చివరి వ్యక్తి జోషి, ఈయన గుజరాతీ మూలాలున్న మరత్వాణా లాయర్. కాసీం రజ్వీని అప్పటి దేశ ఉప ప్రధాని సర్దార్ పటేల్తో కల్పించింది కూడా ఈ జోషియే జోషికి పటేల్ బంధువు కావడంతోనే ఆయన మంత్రయిందు అనే ప్రచారమూ జరిగింది. ఇట్లా నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి హిందువులందరూ ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నారు. (ఒక్క రామాచారి తప్ప), ఈ సమయంలోనే రజాకార్ల ఆగడాలు కూడా జరిగినాయి. అయితే ఈ ఆగడాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయింది. ఈ విఫలమయిన ప్రభుత్వంలో వీరూ ఉన్నారు. అట్లాగే ఆగడాలను అరికట్టక పోవడమే గాకుండా వారికి లోపాయ కారిగా మద్దతు పలికింది పోలీసు డైరెక్టర్ నవాబ్ దీన్ యార్ జంగ్. ఆయన పూర్తిగా ఖాసిం రాజ్వి మనిషి
ఇక్కడ గుర్తించాల్సిన విషయమేమిటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పోరాటం చేసిండ్రు. కమ్యూనిస్టులు నిజామ్ ప్రభుత్వం రద్దు కావాలని, భూమి, భుక్తి, విముక్తి కోసం కొట్లాడిండ్రు. ఇక్కడ రజాకార్లు ప్రధానంగా ఘర్షణ పడ్డది కమ్యూనిస్టులతోనే అశ్వరావుపేట (ఖమ్మం జిల్లా)లాంటి మారుమూల ప్రాంతాల్లో సైతం మందుపాతరలో రజాకార్లు చనిపోయిండ్రు. అయితే భారత సైన్యం హైదరాబాద్్ప పోలీసు చర్య జరిపిన తర్వాత కమ్యూనిస్టులు, రజాకార్లు ఒక్కట య్యిండ్రు. రజాకార్ల ఆయుధాలు కమ్యూనిస్టుల పరమయ్యాయి. ఇట్లా చరిత్రలో అనేక మలుపులు తిరిగిన రజాకార్ల గురించి సరైన విశ్లేషణ ఇంకా జరగాల్సి ఉన్నది. రజాకార్ల పాలన, నయా రజాకార్లు అంటూ ఇప్పటికీ ముస్లింలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పార్టీలు ప్రచారం చేస్తూ ఉంటాయి. వారికి రజాకార్లలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేయించాలి. ఈ విషయాలు అర్ధం కాకపోవడం మూలంగానే భారత కమ్యూనిస్టూ పార్టీ సెప్టెంబర్ 17ని విలీన దినంగా చేయాలని కోరుతుంది. తన ఎజెండా క్లియర్గా ఉందడంతో భారతీయ జనతా పార్టీ విమోచన దినంగా జరుపుతున్నది.
సంగారెడ్డి జిల్లా జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనుల వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ,రెవెన్యూ అధికారులను ఆదేశించారు . బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్ ( ఆర్ఆర్ఆర్ ),రోడ్ ఓవర్ బ్రిడ్జీలు ( ఆర్ఓబిఎస్ ) నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ( నిమ్స్ ) కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు .ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణలో ప్రజల న్యాయమైన హక్కులు కాపాడబడేలా, రైతులకు న్యాయం జరుగేలా, అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పెద్దాపూర్, గిర్మాపూర్ శివాంపేట్ మండలాల్లో భూసేకరణ సమస్యలపై సవివర చర్చ జరిపి,వాటికి సాధ్యమైన పరిష్కారాలను సూచించారు.ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ విషయమై భూముల సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు . భూసేకరణలో న్యాయం జరిగేలా విక్రయ విలువలను ఆధారంగా పరిగణించాల్సిందిగా పేర్కొన్నారు .అదేవిధంగా,జహీరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయబోతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్స్) కు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు.నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఎన్ఐసిడిసి ) తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ( టి జి ఐ ఐ సి )ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ( ఎంఓయు ) మేరకు, నిమ్స్ లో భాగంగా జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయబడనున్నది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమైన భూముల సేకరణపై అధికారులు సమగ్ర నివేదికను సమర్పించారు.ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి,రెవెన్యూ అధికారులు ,నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
`కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
`పల్లెల్లో యూరియా సమస్య మొదటికే మోసం తేవొచ్చు.
`అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు.
`ఇటు నిరుద్యోగుల పోరు.
`42 శాతం బీసీల రిజర్వేషన్ ఒత్తిళ్లు.
`ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి.
`వెళ్ళి ఓటమి కొని తెచ్చుకోలేని స్థితి.
`ఏ మాత్రం తొందరపడినా కాంగ్రెస్ కు తీరని నష్టమే!
`గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు పెడితే ఇంత గందరగోళం వుండేది కాదు!
`ఆలస్యం చేసిన తప్పిదం కాంగ్రెస్‌ను ఇబ్బందుల పాలు చేయొచ్చు!
హైదరాబాద్, నేటిధాత్రి: తెలంగాణలో పంచాయితీ ఎన్నికులు జరుగుతాయా? లేదా? అనే ప్రశ్న కూడా వినిపించనంత రాజకీయాలు మారిపోయాయి. రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30లోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు వాయిదాతోనే ఫాయిదా వుంటుందనుకుంటోంది. తొందపడి కోడ్ కూస్తే మొదటికే మోసం వచ్చే పరిసి ్దతి కనిపిస్తోంది. పల్లెపోరు ఇప్పట్లో లేనటే? అనిపిస్తోంది. ఎందుకంటే హైకోర్టు పెట్టిన గడువు మరీ దగ్గరకొచ్చింది. ఆ లోపు ఎన్నికల నిర్వహణ అసాద్యం. పైగా గత శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. దాని ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో బిసిలకు 42శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అందుకు రాష్ట్రంలో కుల గణన కూడా చేపట్టారు. 42శాతం బిసిలకు రిజర్వేషన్ అంశం మీద అసెంబ్లీలో తీర్మాణం చేశారు. అది గవర్నర్‌కు పంపించారు. అక్కడ నుంచి ఆ తీర్మాణం రాష్ట్రపతికి చేరింది. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రాజకీయాల్లోనైనా, ఉద్యోగాల్లోనైనా 50శాతానికి మంచి రిజర్వేషన్లు అమలు చేసే వీలు లేదు. అయితే తమిళనాడు లాంటికొన్ని రాష్ట్రాలలో 50శాతం లిమిట్ లేదు. దాన్ని అనుసరించి తెలంగాణ కూడా 42శాతం బిసిలకు రిజర్వేషన్లు కల్పించుందామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు చెప్పింది. ప్రజలు కూడా నమ్మారు. కాని సుప్రింకోర్టులో తీర్పు రాకముందు నుంచి షెడ్యూల్ 9 ప్రకారం తమిళనాడులో ఆ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. దాంతో సుప్రింకోర్టు తీర్పు ఆ రాష్ట్రానికి వర్తించడం లేదు. సుంప్రికోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50శాతానికి మించడం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆర్టినెన్స్ జారీ చేసింది. దానిని మళ్లీ గవర్నర్‌కు పంపించింది. అది కూడా గవర్నర్ వద్ద పెండిరగ్‌లో వుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ కేవలం గత ఎన్నికల్లో గెలిచేందుకు ఆడిన డ్రామా అంటూ బి ఆర్‌ఎస్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. 42 శాతం రిజర్వేషన్ అనేది అమలు సాధ్యం కాదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసేందుకు హమీ ఇచ్చిందని బిఆర్‌ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. బిఆర్‌ఎస్‌కు బిసి రిజర్వేషన్ల పెంపు ఇష్టం లేదంటూ కాంగ్రెస్ కాలం గడుపుకుంటూ వచ్చింది. బిఆర్‌ఎస్ మీద నిందలు వేస్తూ కాలయాపన చేసింది. బి సిల రిజర్వేషన్ విషయంలో డిల్లీలో కాంగ్రెస్ ధర్నా కూడా చేసింది. కాని ఆ ధర్నాకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాందీ హజరు కాలేదు. సోనియాగాంధీ రాలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిరది. ఇక రాష్ట్రంలో పరిస్ధితులు స్ధానిక సంస్ధల ఎన్నికలకు అనుకూలంగా లేవు. ఒక వేళ కాంగ్రెస్‌పార్టీ పార్టీపరంగా బిసిలకు 42శాత టికెట్లు ఇచ్చినా అవి వర్కవుటయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో రెండు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారాయి. రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత వుంది. రైతులు మంట మీద వున్నారు. ఎరువులు ఇవ్వడం లేదన్న కోపం వారిలో కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులుగా రైతులు ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు సరిపడా ఎరువులు అందడం లేదు. మంత్రుల ప్రకటనలు ఒక రకంగా వుంటున్నాయి. అవి కూడా రైతులను నిందించేలా వుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎరువులు సంపూర్ణంగా వున్నాయంటున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కావాలని రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ విమర్శలు సాగిస్తోంది. ఇక ఎరువులు అదితో ఇదిగో వస్తున్నాయంటున్నారు. కాని వచ్చిన ఎరువులు ఎక్కడికి వెళ్లాయన్నదానిపై ప్రభుత్వం వద్ద సరైన సమాదానం లేదు. మరో వైపు ఎరువులు పక్క దారి పట్టాయన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఆనాటి రోజులు తెస్తామని చెప్పినట్లే వచ్చాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో ఏనాడు రైతులు ఎరువుల కోసం ఎదురు చూసింది లేదని రైతులే తేల్చిచెబుతున్నారు. ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు ఎరువులు తెచ్చుకున్నామని అంటున్నారు. ఇక కాంగ్రెస్, బిజేపిలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రం సరిపోయేంత ఎరువులు సరఫరా చేయలేదని కాంగ్రెస్ అంటోంది. రాష్ట్రానికి పంపించిన ఎరువులు ఏమయ్యాయని బిజేపి నిలదీస్తోంది? రాజకీయంగా రెండు పార్టీలు వాదులాండుకుంటే వచ్చే ఫలితమేమీ లేదు. రైతులు గత నెల రోజులుగా ఎండనక, వాననక, రాత్రనక, పగలనక క్యూలైన్లలో నిల్చుంటున్నారు. ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పదేళ్లలో మహిళలు ఏనాడు ఎరువుల కోసం రోడ్డెక్కిన సందర్భం లేదు. కాని ఇప్పుడు మహిళలు కూడా ఎరువుల కోసం క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోంది. పైగా ఎవరుల క్యూలైన్లో తోపులాటల మూలంగా మహిళలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్దితి తలెత్తుతోంది. ఇలా ఎరువులు అందక పల్లెల్లో రైతులు కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు అనే మాట మాట్లాడితే కాంగ్రెస్‌పై విరుచుకుపడే పరిసి ్దతి కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు వద్దని వాదిస్తున్నారు. ఎన్నికల్లో నిలబడలేం. ప్రచారం చేయలేమంటున్నారు. ఇక మరో సమస్య. నిరుద్యోగ సమస్య. ఏ గ్రూప్ వన్ పరీక్షను కాంగ్రెస్ రాజకీయం చేసిందో..ఇప్పుడు అదే గ్రూప్ వన్ కాంగ్రెస్ మెడకు చుట్టుకునేలా వుంది. గ్రూప్ వన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఎనమిది నెలల్లోగా మళ్లీ పరీక్ష నిర్వహించి, ఉద్యోగ కల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసేందుకు సిద్దమౌతోంది. కాని గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయడానికి ఇష్టపడం లేదు. దాంతో నిరుద్యోగులు మళ్లీ రొడ్డెక్కుతున్నారు. ఏ నిరుద్యోగులైతే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పల్లె పల్లె తిరిగి ప్రచారం చేశారో వాళ్లే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేంగా మాట్లాడుతున్నారు. జివో.29 రద్దు చేయాలంటున్నారు. గ్రూప్ వన్ పరీక్షలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటున్నారు. గ్రూప్ మెయిన్స్ రాసిన విద్యార్దులకు రెండు మార్కులు రావడమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు ఉద్యోగాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారంటూ నిరుద్యోగులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భం చూసుకొని దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటూ ఓ వైపు బిఆర్‌ఎస్ ఒత్తిడి తెస్తోంది. మరో వైపు రెచ్చగొడుతోంది. ఈ రెండిరటి మధ్య బిజేపి ఎలాంటి వాఖ్యలు చేయడం లేదు. పంచాయితీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని అడగడం లేదు. ఎన్నికలు పెడతామంటే కూడ బిజేపి తయారుగా వున్నట్లు లేదు. అందుకే సైలెంటుగా వుంటోందన్న విమర్శలున్నాయి. అంతే కాదు ఇప్పకిప్పుడు పంచాయితీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరిసి ్దతి లేదన్న సంగతి బిజేపికి బాగా తెలుసు. అయినా ఎన్నికల మీద ఆపార్టీకి పెద్దగా ఆశలు లేవన్న సంగతి అర్ధమౌతోంది. ఒక వేళ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో, రెండు శాతమో పంచాయితీ గెలుస్తామన్న ఆలోచన కూడా ఆపార్టీ పెద్దలు చేయడం లేదు. పంచాయితీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే పరిస్ధితి కనిపించడం లేదు.
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్, బూత్ అధ్యక్షులు పెరుక రంజిత్, ముప్పిడి సత్తయ్య, సీనియర్ నాయకులు చింతకుంటగంగాధర్, నిరటి శేఖర్, శ్రీనివాస్, సంపునూరిదేవయ్య, బైరగోని వేణు, ముత్యాల రాజేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
◆:- ప్రభుత్వం బాధ్యత వహిస్తూ నష్టపరిహారం అందించాలి
◆:- పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయింది వెంటనే పూర్తిగా చెత్తను తొలగించాలి ప్రజలు తమ ఇష్టారిథిగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయుచున్నారు ఇలా పాడవేయకుండా ప్రజలను చైతన్య పరచాలి జహీరాబాద్ పట్టణంలో మురికి కాలువలలో నిండుగా మురికి పేరుకుపోవడంతోని విపరీతమైన దోమలు ఏర్పడి ప్రజలకు డెంగు మలేరియా లాంటి వ్యాధులు సోకుతున్నాయి వెంటనే వీటిని నిర్మూలించాలి మురికి కాలువలు నిండుకుండ లాగా తయారైనాయి మురికి కాలువలు పూర్తిగా పైకప్పులతో మూసి వేయబడ్డాయి వాటిని తొలగించి మురికి కాలువలు శుభ్రం చేయించాలి పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక పరిపాలన అధికారి జహీరాబాద్ పట్టణ పురవీధులను పరిశీలించాలి పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ పట్టణంలో గత నాలుగు రోజులుగా వేరువేరు స్థలాల వద్ద కొండముచ్చులు ప్రజల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి ఈ దాడిలో శాంతినగర్ హమాలీ కాలనీ రాంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలలో దాదాపుగా పదిమందిపై అనగా మారుతి రావు సిద్దు శాంతాబాయి శంకర్ లక్ష్మి శంకరమ్మ జీవరత్నం గార్లపై కొండముచ్చులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినాయి గాయపడ్డ చాలామంది నిరుపేదలు ఉన్నారు రోజువారి కూలీలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీరందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు నష్టపరిహారాన్ని చెల్లించాలని సవినయంగా బాధితుల పక్షాన పి.రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ ఘటనపై జాగో తెలంగాణ వ్యవస్థాపకులు పి. రాములు నేత మాట్లాడుతూ మూగజీవాలు ఈ రకంగా పట్టణంలో చేరి దాడి చేయడానికి తగు కారణం చూస్తుంటే జహీరాబాద్ పట్టణం ఎక్కడ చూసినా మురికితో నిండిపోయి ఉండడం కనబడుతుంది వాస్తవానికి జహీరాబాద్ పట్టణంలో పూర్తిస్థాయి చెత్త సేకరణ కార్యక్రమం జరగడం లేదు పురపాలక సంఘం అధికారులు ప్రజలకు ఎక్కడపడితే అక్కడ చెత్తను తినుబండరాలను పార వేయకుండా ఈ రకంగా పారవేసే వారి గురించి పురపాలక సంఘం అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టకపోవడం ప్రధాన కారణంగా కనబడుతుంది పురపాలక సంఘం పరిధిలో ఎక్కడ చూసినా విపరీతమైన చెత్త పేరుకుపోయి ఉన్నది మురికి కాలువలు మురికితో నిండుకుండ లాగా తయారైపోయాయి ఏ మూలమలుపులో చూసినా కూడా తినుబండారాలతో కూడిన చెత్త పేరుకుపోయి ఉంది దీనిని ఆసరా చేసుకొని వీధి పందులు వీధి కుక్కలు కొండముచ్చులు పశువులు ప్రజల నివాసాల మధ్య చేరిపోయి అనేక రకాలుగా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి ఇకనైనా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక పాలన అధికారి స్థానిక సంస్థల జిల్లా అధికారి జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే దసరా దీపావళి పండుగల సందర్భంగా జహీరాబాద్ లో పేరుకుపోయిన చెత్తాను పూర్తిగా తొలగించి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలను చైతన్య పరచాలని ఇలాంటి కార్యక్రమం పురపాలక శాఖ తీసుకుంటే మా వంతు సహకారం గా మేము కూడా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా అడవి శాఖ వారికి బాధితులను ఆదుకోవాలని తెలపగా అందుకు సానుకూలంగా స్పందించిన సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు జహీరాబాద్ అటవీశాఖ సిబ్బంది బాధితులను కలిసి వారి వివరాలను సేకరించారు మా శాఖ తరపు నుండి బాధితులకు వారికి జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం చే పరిహారం ఇప్పించడం జరుగుతుందని జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు బాధితులతో మరియు వారి పక్షాన ఉండి పోరాడుతున్న జాగో తెలంగాణ నాయకులకు తెలిపారు కార్యక్రమంలో జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు పి. కృష్ణమ్మ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జి. కిరణ్ కుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్లు గంగాభవాని భాస్కర్ నిజాముద్దీన్ సంజీవ్ గార్లు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్ , గొల్లమల్లు , కాలనీవాసులు సిహెచ్ సంతోష్ ,సిహెచ్ జగదీష్ ,జామ్ గారి రాజ్ కుమార్ ,నారాయణపేట రాజ్ కుమార్ పాల్గొన్నారు,
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.