సిద్ధాపూర్ వద్ద చిరుత పులి కలకలం: ప్రజల్లో భయాందోళనలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం పట్టి సిద్ధాపూర్ వద్ద జహీరాబాద్-తాండూర్ రహదారిపై శుక్రవారం ఉదయం చిరుత పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జహీరాబాద్ నుంచి సిద్ధాపూర్, కుంచారం నుంచి జహీరాబాద్ వెళ్లే మార్గాల్లో రాకపోకలకు ప్రజలు భయపడుతున్నారు. ఐదు నుంచి ఆరు మంది గుంపులుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి బారి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఈ సమాచారాన్ని వినయ్ పవర్, AITF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, NHCR చైర్మన్ అందించారు.