ఇంతకూ రజాకార్లెవరు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-18T142221.421.wav?_=1

 

ఇంతకూ రజాకార్లెవరు?

◆:- డా.సంగిశెట్టి శ్రీనివాస్ సామాజిక, రాజకీయ విశ్లేషకులు

◆:- సంచకారి

రజాకార్లలో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారు అని ‘హిందూత్వ’ వాదులు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, రజాకార్లలో దళితులు, బీసీలు, రెడ్లు కూడా ఉన్నారు. నిజానికి ప్రతి గ్రామంలో వారికి అన్ని విధాల షెల్టర్ ఇచ్చి, వండి పెట్టింది గ్రామ పటేల్, పట్వారీలు. వీళ్లు ఎక్కువగా రెడ్డి, బ్రాహ్మణ సామాజికవర్గం వారే! ఈ వాస్తవాన్ని దాచిపెట్టి రజాకార్ల పేరిట ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని టార్గెట్ చేయడము, దోషులుగా చిత్రించడం, ముస్లింలందరూ రజాకార్లే అనే విధంగా భావజాల వ్యాప్తి చేయడం ప్రజల మధ్యన విద్వేషాలను సృష్టించేందుకు వేసే పన్నాగంగానే చూడాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తము అధికారంలోకి రావాలన్నా, ఉన్న అధికా రాన్ని కాపాడుకోవాలన్న భారతీయ జనతాపార్టీ మత రాజకీయాలపై ఆధారపడుతుంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రత్యేకంగా వాట్సప్ యూనివర్సిటీ సహకారం తీసుకుంటుంది. మతాల మధ్యన ఉద్రిక్తత సదలకుండా చూస్తుంది. ఆవుల రవాణా అడ్డుకునే పేరిట లేని అధికారాన్ని చేతు ల్లోకి తీసుకొని ఆ పార్టీ మద్దతుదారులు లించింగ్కు పాల్పడుతారు. అంతెందుకు చేప్ కేసులో శిక్ష పడ్డ గుజరాతీ నిందితులను విడుదల చేయించడంలోనూ, విడుదలైన వారిని ఘనంగా ఊరేగించడంలోనూ వీరికి వీరే సాటి, ఒకే దేశం, ఒకే సంస్కృతి’ పేరిట భిన్నత్వాన్ని చిరిమేస్తున్నది. నిలదీస్తే నిందిస్తున్నదీ వీళ్ళే.

 

 

 

మొత్తమ్మీద తమకు ఓట్లు ఒనగూరే ఏ మార్గాన్నైనా ఈ పార్టీ ఆరాధిస్తుంది. అనుసరిస్తుంది. మెజారిటీ-మైనారిటీ నేరేషన్ ప్రచారంలో పెడుతూ ఓట్ల రాజకీయా లకు తెరదీస్తుంది. ఈ పరంపరలో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వరుసగా రెచ్చగొట్టే సినిమాలు తీసి విడుదల చేసిండ్రు. అందుకు తగ్గట్టుగా రాజకీయ లాభమూ పొందిండ్రు! అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ‘రజాకార్’ అనే సినిమాను విడుదల చేసిండ్రు. ఇప్పుడు హైదరాబాద్్ప పోలీసు చర్య జరిగి 77 ఏండ్లయిన సందర్భంగా మరో సారి ఈ విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమున్నది.

 

 

1947 ఆగస్టు 15 తర్వాత నిజాం హైదరాబాద్్న ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ మేరకు ఇండియా- హైదరాబాద్ రాజ్యాల మధ్యన నవంబర్ 29, 1947 నాడు యథాతథ ఒడంబడిక జరిగింది. పాకిస్తాన్ ప్రధాని జిన్నా, ఇంగ్లండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్లు హైదరాబాద్ రాజ్య సార్వభౌమాధికారాన్ని గుర్తించారు. లాండ్లకే దేశమయినంత మాత్రానా దానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉండవా అని చర్చిల్ దేశ పార్లమెంటులో మాట్లాడిండు. హైదరాబాడ్ని వెనకేసుకొచ్చిండు. ఈ అన్నింటి నేపథ్యంలో హైదరాబాద్్ప ఇండియా దాడి సరికాదంటూ రజాకార్లు తిరుగుబాటు చేసిండ్రు.

 

 

 

అయోధ్యలో బాబ్రీమసీదుని కూల్చిన కరసేవకుల మాదిరిగానే రజాకార్లు చట్టానికి అతీతులుగా వ్యవహరించారు. నిజానికి రజాకార్లు అంటే దైవ కార్యకర్తలు. ఈ దైవ కార్యకర్తలు దేవుని పేరిట నిజామ్ ప్రభుత్వాన్ని, ‘ప్రభువు’ ఉప్మానలీ ఖాన్ని కాపాడేందుకు అనుసరించిన దోపిడి, దౌర్జన్య, హత్య, అత్యాచార మార్గాలను ఖండించాల్సిందే. ఈ దుర్మార్గానికి గాను వారిని నిందించాల్సిందే, నిలదీయాల్సిందే. దోషులుగా నిలబెట్టాల్సిందే. అయితే అదే సమయం లో రజాకార్లు ఎవరు? ఇందులో అన్ని మతాల వారున్నారా? ఉంటే వారి వ్యవహార శైలి ఎలా ఉండింది? అనే విషయాలన్నీ కూలంకషంగా చర్చించుకోవాలి. స్వీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించకుండా చూడాలి.

 

 

రజాకార్’ సినిమాలో అత్యాచారాలు, హత్యలు చేసే ఉన్మాద బృందంగా ఈ రజాకార్లను చిత్రించారు. అయితే ఈ రజాకార్లలో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారు అని హిందూత్వ వాదులు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, రజాకార్లలో దళితులు, బీసీలు, రెడ్లు కూడా ఉన్నారు. నిజానికి ప్రతి గ్రామంలో వారికి అన్ని విధాల షిల్టర్ ఇచ్చి, నండి పెట్టింది గ్రామ పటేల్, పట్వారీలు, వీళ్లు ఎక్కువగా రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గం వారే! ఈ వాస్తవాన్ని దాచిపెట్టి రజాకార్ల పేరిట ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని టార్గెట్ చేయడము, దోషులుగా చిత్రించడం, ముస్లింలందరూ రజాకార్లే అనే విధంగా భావజాల వ్యాప్తి చేయడం ప్రజల మధ్యన విద్వేషాలను సృష్టించేందుకు చేసే పన్నాగంగానే చూడాలి.

దొరలు, దేశ ముఖు, దేశ పొంద్యాలు, జాగీర్దార్లు, జమీందార్లు గ్రామాల్లో చేయించే నిర్బంధ వెట్టిచాకిరిని నిరసిస్తూ 1937, 1938

రెండేండ్లలోనే తెలంగాణలోని కేవలం నల్లగొండ, వరంగల్ జిల్లాలలో మొత్తం 18వేల మంది దళితులు ఇస్లామ్ మతంలోకి మారిండ్రు. వెట్టి దాకిరి నుంచి విముక్తి కలగడమే గాకుండా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ వాళ్లు వీరిని కొంత ఆర్థికంగా ఆదుకున్నారు. ఇట్లా మతం మార్చుకున్న వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా రక్షణగా ఉండింది కూడా మజ్లిస్ బృందమే! కేవలం దళితులే కాదు బీసీలు కూడా ఇట్లా మతం మార్చుకున్న వారిలో ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య కూడా ఇస్లామ్ స్వీకరించిండు. తన మందలోని గొర్లను దొరలు బలవంతంగా ఎత్తుకుపోవడానికి పరిష్కార మార్గంగా దొడ్డి మల్లయ్య మతం మారిండు. శుద్ధి, కబ్లీగ్ ఉద్యమాలు రెండు వైపులా జరిగాయి. ఈ ఉద్రిక్త పరిస్థితి ఒక దశాబ్దంపాటు కొనసాగింది

సాయుధ పోరాట కాలంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, రజాకార్ల మధ్యన ముఖాముఖి పోరు జరిగింది. ఒకరినొకరు చంపుకున్నారు. ఇందులో భాగంగానే రజాకార్లు’ 1947 జూలై తర్వాత మాత్రమే మిలిటరీ శిక్షణ ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాం పార్వభౌమత్వానికి భంగం రాకుండా చూడాలని కార్యకర్తలకు ఉద్బో ధించారు. ఇదంతా రజాకార్లు నిజాం ప్రభుత్వాన్ని కాపాడుకోన దానికి, ఇండియా దాడి చేస్తే తిప్పికొట్టడానికి కాసిం రజ్వీ మద్దతు దారులు చేసిన ప్రతిజ్ఞ. అయితే ఈ ప్రతిజ్ఞ చేసిన వారిలో కేవలం ముస్లింలే కాదు. అన్ని మతాల వారున్నారు.

అంతేందుకు నిజాం ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పింగళి వెంకటరామారెడ్డి ఉప ప్రధానిగా వ్యవహరించిండు. రజాకార్లకు మద్దతుదారుగా నిలిచారు అనే ఆరోపణలపై పోలీస్ యాక్షన్ తర్వాత ఈయన్ని మిలిటరీ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. ఈయన తనయుడు పింగళి జగన్మోహన్రెడ్డి ఆ తర్వాత జడ్జిగా పనిచేశారు. అదే సమయంలో వెంకటరామారెడ్డితో పాటు గృహ నిర్బంధంలో ఉన్న మరో మంత్రి బి.ఎస్.వెంవిద్యాశా దళితుడైన బి.ఎస్.వెంకటరావు బహిరంగంగానే రజాకార్లకు మద్దతు ప్రకటించిండు. ఈయన నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ

మంత్రిగా పనిచేసిండు. తన పదవీ కాలంలో అంబేడ్కర్ ఔరంగా బాద్లో ఏర్పాటు చేసిన కళాశాలకు ఈయన ఆర్ధికంగా అండగా నిలిచిండు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కోటి రూపాయల నిధిని నిజామ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నిధి నుంచి విద్యాశాఖా మంత్రిగా పదిలక్షల వరకు తన అభీష్టం మేరకు సంస్థలకు కేటాయించే అధికారం ఆయనకుండింది. అట్లా ఎన్ని సార్లయినా కేటాయించే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కట్ట బెట్టింది. అయితే ఈ సొమ్ములో నుంచి కాసిం రజ్వీ నడిపించిన రజాకార్లకు ఆర్ధిక సహాయం అందిందని రిపోర్టు ఆన్ ద రజాకార్స్ అనే పేరిట హైదరాబాద్్ప పోలీసు చర్య జరిగిన వెంటనే ప్రచురించిన గ్రంథంలో పేర్కొన్నారు. ఇదే నివేదికలో బి.ఎస్.వెంకటరావు స్వయం గా బీదర్ కు వెళ్ళి దళితులను రెచ్చగొట్టి భూస్వాములను దోచుకో వాలని రెచ్చగొట్టినట్టు కూడా పేర్కొంది. అయితే ఇదంతా ఎక్కడా కూడా రుజువు కాలేదు. బి.ఎస్.వెంకటరావుని కూడా మిలిటరీ
ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకున్నది. మొత్తం ఐదు మంది హిందువులు నిజాం ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిండ్రు. ఇందులో మొదటి వ్యక్తి పింగళి వెంకట రామారెడ్డి పూర్తి కాలం నిజాంకు మద్దతుదారుడిగా ఉన్నారు రెండో

పూర్తి బి.ఎస్.వెంకటరావు. ఈయన కూడా సానుకూలంగానే ఉన్నాడు. మూడో వ్యక్తి రామాచారి. కర్నాటక-హైదరాబాద్కు చెందిన ఈయన మొదట నిజాం ప్రభుత్వంలో చేరిండు. అయితే వారి చర్యలు హిందు పులకు వ్యతిరేకంగా ఉండడంతో కొన్ని రోజుల తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈయన కాంగ్రెస్ వాది, మరో వ్యక్తి మల్లికార్జు నప్ప, హైదరాబాద్- కర్కాటకకు చెందిన ఈయన లింగాయత్ ల ప్రతినిధిగా మంత్రివర్గంలో కొనసాగించు. చివరి వ్యక్తి జోషి, ఈయన గుజరాతీ మూలాలున్న మరత్వాణా లాయర్. కాసీం రజ్వీని అప్పటి దేశ ఉప ప్రధాని సర్దార్ పటేల్తో కల్పించింది కూడా ఈ జోషియే జోషికి పటేల్ బంధువు కావడంతోనే ఆయన మంత్రయిందు అనే ప్రచారమూ జరిగింది. ఇట్లా నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి హిందువులందరూ ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నారు. (ఒక్క రామాచారి తప్ప), ఈ సమయంలోనే రజాకార్ల ఆగడాలు కూడా జరిగినాయి. అయితే ఈ ఆగడాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయింది. ఈ విఫలమయిన ప్రభుత్వంలో వీరూ ఉన్నారు. అట్లాగే ఆగడాలను అరికట్టక పోవడమే గాకుండా వారికి లోపాయ కారిగా మద్దతు పలికింది పోలీసు డైరెక్టర్ నవాబ్ దీన్ యార్ జంగ్. ఆయన పూర్తిగా ఖాసిం రాజ్వి మనిషి

ఇక్కడ గుర్తించాల్సిన విషయమేమిటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పోరాటం చేసిండ్రు. కమ్యూనిస్టులు నిజామ్ ప్రభుత్వం రద్దు కావాలని, భూమి, భుక్తి, విముక్తి కోసం కొట్లాడిండ్రు. ఇక్కడ రజాకార్లు ప్రధానంగా ఘర్షణ పడ్డది కమ్యూనిస్టులతోనే అశ్వరావుపేట (ఖమ్మం జిల్లా)లాంటి మారుమూల ప్రాంతాల్లో సైతం మందుపాతరలో రజాకార్లు చనిపోయిండ్రు. అయితే భారత సైన్యం హైదరాబాద్్ప పోలీసు చర్య జరిపిన తర్వాత కమ్యూనిస్టులు, రజాకార్లు ఒక్కట య్యిండ్రు. రజాకార్ల ఆయుధాలు కమ్యూనిస్టుల పరమయ్యాయి. ఇట్లా చరిత్రలో అనేక మలుపులు తిరిగిన రజాకార్ల గురించి సరైన విశ్లేషణ ఇంకా జరగాల్సి ఉన్నది. రజాకార్ల పాలన, నయా రజాకార్లు అంటూ ఇప్పటికీ ముస్లింలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పార్టీలు ప్రచారం చేస్తూ ఉంటాయి. వారికి రజాకార్లలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేయించాలి. ఈ విషయాలు అర్ధం కాకపోవడం మూలంగానే భారత కమ్యూనిస్టూ పార్టీ సెప్టెంబర్ 17ని విలీన దినంగా చేయాలని కోరుతుంది. తన ఎజెండా క్లియర్గా ఉందడంతో భారతీయ జనతా పార్టీ విమోచన దినంగా జరుపుతున్నది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version