రొయ్య రైతులపై అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు..

*రొయ్య రైతులపై అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు..

*ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్రం స్పందన..

తిరుపతి(నేటి
ధాత్రి)సెప్టెంబర్
18:

 

 

 

ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రస్తావించిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా విధించిన దిగుమతి సుంకాల కారణంగా రొయ్య రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే రొయ్యలలో దాదాపు 70 శాతం అమెరికాకు ఎగుమతి అవుతుండగా, తిరుపతి జిల్లాలోనే 28 వేల ఎకరాల్లో సుమారు 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందని ఎంపీ కేంద్రానికి వివరించారు.
ఈ విషయంపై సమగ్ర పరిశీలన జరిపిన తర్వాత, మెరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడా)తో చర్చించి పలు చర్యలు చేపట్టినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. అమెరికా పరస్పర సుంకాల నిర్ణయం నేపథ్యంలో ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అధిక విలువ కలిగిన సముద్ర జాతుల ఉత్పత్తి వైపు దృష్టి సారించిందని తెలిపారు. ఇందులో సీబాస్, కోబియా, పొంపానో, క్రాబ్, తిలాపియా, గ్రూపర్, బ్లాక్ టైగర్,స్కాంపి వంటి జాతులను ప్రోత్సహిస్తోందన్నారు. తద్వారా ఆక్వాకల్చర్ రైతుల ఆదాయ భద్రతను పెంచి, అమెరికా వంటి ప్రధాన మార్కెట్లలో టారిఫ్‌ల కారణంగా వచ్చే ఆదాయ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తెలియజేశారుఅంతేకాకుండాఎంపెడా ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లను గుర్తించడం తోపాటుగా, ఇప్పటికే ఉన్న మార్కెట్లను విస్తరించే దిశగా కృషి చేస్తోందన్నారురైతులకు లాభదాయకమైన ధరలు లభించేలా విదేశీ ప్రదర్శనలు, కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు, వాణిజ్య ప్రతినిధి బృందాల ద్వారా చర్యలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ లో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంపొందించేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపిందని తెలియజేశారుఆక్వా రైతుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో అమెరికా సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపి, మార్కెట్ యాక్సెస్ పెంపు, టారిఫ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.

తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం

తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి.‌.

*తిరుపతి
ఎంపి గురుమూర్తి…

తిరుపతి నేటి ధాత్రి:

ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాల గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. ఇందుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానం ఇచ్చారు.
ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదు సంవత్సరాల్లో రూ.28.82 కోట్ల మేర కేంద్ర నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో రెండు 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని, మరో నాలుగు ఆయుష్ ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చినట్టు చెప్పారు.అదే సమయంలో ఐదు ఆయుష్ ప్రజా ఆరోగ్య కార్యక్రమాలకు కూడా సహకారం అందించామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 92 కో-లొకేటెడ్ ఆయుష్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం ముఖ్యమైన ఆయుష్ మందుల సరఫరాకు కేంద్రం ద్వారా మద్దతు లభించిందని మంత్రి వివరించారు. అంతేకాక,ఒక కొత్త ఆయుష్ విద్యాసంస్థ ఏర్పాటుతో పాటు,రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయం అందించామని తెలిపారు. తిరుపతి జిల్లాలోని చెంగనగుంట రూ.9.08 లక్షలు, కురుగొండ రూ.8.62 లక్షలు, మోమిడి రూ.8.01 లక్షలు, మంగళం ప్రాజెక్టుకు రూ.8.29 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నాలుగు కేంద్రాల ద్వారా ఏప్రిల్ 2024 నుండి జూన్ 2025 వరకు మొత్తం 25,173 మంది లబ్ధిదారులు ఆయుష్ సేవలు పొందారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ద్వారా ఇటీవల తిరుపతి జిల్లాలోని రాస్-కృషి విజ్ఞాన కేంద్రంలో నన్నారి సాగు, కోత తర్వాత నిర్వహణ, మార్కెటింగ్ అవకాశాలు అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడిందని, దాని ద్వారా సుమారు 60 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలో ఒక హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు రూ.10.80 లక్షలు, అశ్వగంధ మొక్కల ప్రచారానికి రూ.18.90 లక్షలు ఆర్థిక సహాయం అందించబడిందని కేంద్ర మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి ఆయుష్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి విస్త్రుతమన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృత సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version