వాయిదాతోనే ఫాయిదా!

`తొందరపడి కోడ్‌ కూస్తే కాంగ్రెస్‌ కు కష్టమే!

`పల్లెపోరు ఇప్పట్లో లేనట్లే!

`దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్‌.

`బీజేపీ మాత్రం సైలెంట్‌.

`ఎన్నికల మీద ఆశ లేదు.

`గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు.

`కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

`పల్లెల్లో యూరియా సమస్య మొదటికే మోసం తేవొచ్చు.

`అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు.

`ఇటు నిరుద్యోగుల పోరు.

`42 శాతం బీసీల రిజర్వేషన్‌ ఒత్తిళ్లు.

`ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి.

`వెళ్ళి ఓటమి కొని తెచ్చుకోలేని స్థితి.

`ఏ మాత్రం తొందరపడినా కాంగ్రెస్‌ కు తీరని నష్టమే!

`గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు పెడితే ఇంత గందరగోళం వుండేది కాదు!

`ఆలస్యం చేసిన తప్పిదం కాంగ్రెస్‌ను ఇబ్బందుల పాలు చేయొచ్చు!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో పంచాయితీ ఎన్నికులు జరుగుతాయా? లేదా? అనే ప్రశ్న కూడా వినిపించనంత రాజకీయాలు మారిపోయాయి. రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్‌ 30లోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు వాయిదాతోనే ఫాయిదా వుంటుందనుకుంటోంది. తొందపడి కోడ్‌ కూస్తే మొదటికే మోసం వచ్చే పరిసి ్దతి కనిపిస్తోంది. పల్లెపోరు ఇప్పట్లో లేనటే? అనిపిస్తోంది. ఎందుకంటే హైకోర్టు పెట్టిన గడువు మరీ దగ్గరకొచ్చింది. ఆ లోపు ఎన్నికల నిర్వహణ అసాద్యం. పైగా గత శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకటించారు. దాని ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో బిసిలకు 42శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అందుకు రాష్ట్రంలో కుల గణన కూడా చేపట్టారు. 42శాతం బిసిలకు రిజర్వేషన్‌ అంశం మీద అసెంబ్లీలో తీర్మాణం చేశారు. అది గవర్నర్‌కు పంపించారు. అక్కడ నుంచి ఆ తీర్మాణం రాష్ట్రపతికి చేరింది. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రాజకీయాల్లోనైనా, ఉద్యోగాల్లోనైనా 50శాతానికి మంచి రిజర్వేషన్లు అమలు చేసే వీలు లేదు. అయితే తమిళనాడు లాంటికొన్ని రాష్ట్రాలలో 50శాతం లిమిట్‌ లేదు. దాన్ని అనుసరించి తెలంగాణ కూడా 42శాతం బిసిలకు రిజర్వేషన్లు కల్పించుందామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రజలకు చెప్పింది. ప్రజలు కూడా నమ్మారు. కాని సుప్రింకోర్టులో తీర్పు రాకముందు నుంచి షెడ్యూల్‌ 9 ప్రకారం తమిళనాడులో ఆ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. దాంతో సుప్రింకోర్టు తీర్పు ఆ రాష్ట్రానికి వర్తించడం లేదు. సుంప్రికోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50శాతానికి మించడం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆర్టినెన్స్‌ జారీ చేసింది. దానిని మళ్లీ గవర్నర్‌కు పంపించింది. అది కూడా గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో వుంది. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ కేవలం గత ఎన్నికల్లో గెలిచేందుకు ఆడిన డ్రామా అంటూ బి ఆర్‌ఎస్‌ చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి కూడా తెలుసు. 42 శాతం రిజర్వేషన్‌ అనేది అమలు సాధ్యం కాదని తెలిసినా కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసేందుకు హమీ ఇచ్చిందని బిఆర్‌ఎస్‌ ఆరోపణలు గుప్పిస్తోంది. బిఆర్‌ఎస్‌కు బిసి రిజర్వేషన్ల పెంపు ఇష్టం లేదంటూ కాంగ్రెస్‌ కాలం గడుపుకుంటూ వచ్చింది. బిఆర్‌ఎస్‌ మీద నిందలు వేస్తూ కాలయాపన చేసింది. బి సిల రిజర్వేషన్‌ విషయంలో డిల్లీలో కాంగ్రెస్‌ ధర్నా కూడా చేసింది. కాని ఆ ధర్నాకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాందీ హజరు కాలేదు. సోనియాగాంధీ రాలేదు. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ ఇరుకున పడిరది. ఇక రాష్ట్రంలో పరిస్ధితులు స్ధానిక సంస్ధల ఎన్నికలకు అనుకూలంగా లేవు. ఒక వేళ కాంగ్రెస్‌పార్టీ పార్టీపరంగా బిసిలకు 42శాత టికెట్లు ఇచ్చినా అవి వర్కవుటయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో రెండు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారాయి. రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత వుంది. రైతులు మంట మీద వున్నారు. ఎరువులు ఇవ్వడం లేదన్న కోపం వారిలో కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులుగా రైతులు ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు సరిపడా ఎరువులు అందడం లేదు. మంత్రుల ప్రకటనలు ఒక రకంగా వుంటున్నాయి. అవి కూడా రైతులను నిందించేలా వుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎరువులు సంపూర్ణంగా వున్నాయంటున్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ కావాలని రాజకీయం చేస్తుందని కాంగ్రెస్‌ విమర్శలు సాగిస్తోంది. ఇక ఎరువులు అదితో ఇదిగో వస్తున్నాయంటున్నారు. కాని వచ్చిన ఎరువులు ఎక్కడికి వెళ్లాయన్నదానిపై ప్రభుత్వం వద్ద సరైన సమాదానం లేదు. మరో వైపు ఎరువులు పక్క దారి పట్టాయన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఆనాటి రోజులు తెస్తామని చెప్పినట్లే వచ్చాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో ఏనాడు రైతులు ఎరువుల కోసం ఎదురు చూసింది లేదని రైతులే తేల్చిచెబుతున్నారు. ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు ఎరువులు తెచ్చుకున్నామని అంటున్నారు. ఇక కాంగ్రెస్‌, బిజేపిలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రం సరిపోయేంత ఎరువులు సరఫరా చేయలేదని కాంగ్రెస్‌ అంటోంది. రాష్ట్రానికి పంపించిన ఎరువులు ఏమయ్యాయని బిజేపి నిలదీస్తోంది? రాజకీయంగా రెండు పార్టీలు వాదులాండుకుంటే వచ్చే ఫలితమేమీ లేదు. రైతులు గత నెల రోజులుగా ఎండనక, వాననక, రాత్రనక, పగలనక క్యూలైన్లలో నిల్చుంటున్నారు. ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పదేళ్లలో మహిళలు ఏనాడు ఎరువుల కోసం రోడ్డెక్కిన సందర్భం లేదు. కాని ఇప్పుడు మహిళలు కూడా ఎరువుల కోసం క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోంది. పైగా ఎవరుల క్యూలైన్లో తోపులాటల మూలంగా మహిళలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్దితి తలెత్తుతోంది. ఇలా ఎరువులు అందక పల్లెల్లో రైతులు కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు అనే మాట మాట్లాడితే కాంగ్రెస్‌పై విరుచుకుపడే పరిసి ్దతి కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నాయకులే ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు వద్దని వాదిస్తున్నారు. ఎన్నికల్లో నిలబడలేం. ప్రచారం చేయలేమంటున్నారు. ఇక మరో సమస్య. నిరుద్యోగ సమస్య. ఏ గ్రూప్‌ వన్‌ పరీక్షను కాంగ్రెస్‌ రాజకీయం చేసిందో..ఇప్పుడు అదే గ్రూప్‌ వన్‌ కాంగ్రెస్‌ మెడకు చుట్టుకునేలా వుంది. గ్రూప్‌ వన్‌ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఎనమిది నెలల్లోగా మళ్లీ పరీక్ష నిర్వహించి, ఉద్యోగ కల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటీషన్‌ వేసేందుకు సిద్దమౌతోంది. కాని గ్రూప్‌ వన్‌ పరీక్ష రద్దు చేయడానికి ఇష్టపడం లేదు. దాంతో నిరుద్యోగులు మళ్లీ రొడ్డెక్కుతున్నారు. ఏ నిరుద్యోగులైతే గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పల్లె పల్లె తిరిగి ప్రచారం చేశారో వాళ్లే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేంగా మాట్లాడుతున్నారు. జివో.29 రద్దు చేయాలంటున్నారు. గ్రూప్‌ వన్‌ పరీక్షలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటున్నారు. గ్రూప్‌ మెయిన్స్‌ రాసిన విద్యార్దులకు రెండు మార్కులు రావడమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు ఉద్యోగాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారంటూ నిరుద్యోగులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భం చూసుకొని దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటూ ఓ వైపు బిఆర్‌ఎస్‌ ఒత్తిడి తెస్తోంది. మరో వైపు రెచ్చగొడుతోంది. ఈ రెండిరటి మధ్య బిజేపి ఎలాంటి వాఖ్యలు చేయడం లేదు. పంచాయితీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని అడగడం లేదు. ఎన్నికలు పెడతామంటే కూడ బిజేపి తయారుగా వున్నట్లు లేదు. అందుకే సైలెంటుగా వుంటోందన్న విమర్శలున్నాయి. అంతే కాదు ఇప్పకిప్పుడు పంచాయితీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరిసి ్దతి లేదన్న సంగతి బిజేపికి బాగా తెలుసు. అయినా ఎన్నికల మీద ఆపార్టీకి పెద్దగా ఆశలు లేవన్న సంగతి అర్ధమౌతోంది. ఒక వేళ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో, రెండు శాతమో పంచాయితీ గెలుస్తామన్న ఆలోచన కూడా ఆపార్టీ పెద్దలు చేయడం లేదు. పంచాయితీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్లే పరిస్ధితి కనిపించడం లేదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version