ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T133333.172-1.wav?_=1

 

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎన్ ఎస్ యుఐ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో మొట్ట మొదటి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ 37వ వర్దంతి ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఈ దేశానికి ఎనలేని సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా రాజబరణలను రద్దు చేసి, బ్యాంకులను జాతీయకరణం చేయడం,20 సూత్రాల పతాకాన్ని తీసుకవచి పేదరికాన్ని నిర్ములించడినికి కృషి చేసిన గొప్ప నాయకురాలు,గరిబి హఠావో అనే నినాదంతో ప్రజలందరికీ అండగా నేనుంటా అని ఉత్తేజ పరిచిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ ఈ దేశంలో ఉన్న ప్రజల గుండల్లో చేరిగిపోని ముద్ర వేసుకున్న నాయకురాలు ఇందిరాగాంధీ వారు ఈ లోకంలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీ తీరని లోటని వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రాధిస్తూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ని చేయడమే లక్ష్యంగా ప్రతి ఎన్ ఎస్ యు ఐ కార్యకర్త ఒక సైనికులుగా పని చేయాలని ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగించాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పోతర్ల ప్రేమ్ కుమార్, మాట్టేవాడ సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి,అజ్మీరా వినోద్, కాలేజీ ప్రెసిడెంట,శ్రీకాంత్,మహేష్,ప్రవీణ్,రాజు, స్వాతి కిరణ్, సమీర్, రాజేష్,శివ తదితరులు పాల్గొన్నారు..

మొంథా తుఫాన్ ప్రభావంతో వాణిజ్య పంటలు నష్టం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T132924.472.wav?_=2

 

 

పత్తి వర్షార్పణం…..!

◆:- మొంథా తుఫాన్ ప్రభావంతో వాణిజ్య పంటలు నష్టం

◆:- చేతికొచ్చిన పత్తి, సోయా పంటలు నష్టం

◆:- ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకొలు

 

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకొలు – ఝరాసంగం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందులో ముఖ్యంగా చేతికొచ్చిన పత్తి, సోయా, అల్లం, బొప్పాయి లాంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో వేకువజాము నుండే వర్షాలు మండల వ్యాప్తంగా విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, ఊట కుంటలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. మండలంలో పత్తి, సోయా, అల్లం, చెరుకు, కంది పంటలలో నీరు నిలిచి ప్రవహిస్తోంది. దీంతో రైతులు చేసేదేమీ లేక వర్షాలు ఈ ఏడాది నిండా ముంచాయని కన్నీటి పర్యంతంమవుతున్నారు.

తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులు..

అధిక వర్షాలకు పత్తి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత పిందె కాయ నుండి కాపాడుకుంటూ వచ్చిన పత్తి రైతులు ఇప్పుడు కనులెత్తితే పనికి రాకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి
భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట నీటిపాల అవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల వరకు పత్తి పంటను సాగు చేస్తున్నారు. పూత దశలో ఉన్నప్పుడే కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతిందని, ఎదిగే దశలో ఉన్నప్పుడు రైతులు ఎరువులు వేసి మందులు పిచికారి చేశారు. అప్పుడు సైతం పూత పిందెలు కాళ్లతో సహ వరుసగా వర్షాలు కురవడంతో నేలరాలిపోయాయి. ప్రస్తుతం పత్తి తీయడానికి రావడంతో ఈ తూఫాన్ ప్రభావంతో చేలలోనే నీరు గారి పోతోంది. చేలలో వర్షాలు నిలవడంతో పత్తి రంగు మారడమే కాకుండా పూర్తిగా నేలరాలి పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నా పంట నష్టపోయిన తమకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కనీసం ఎకరాకు నష్టపరిహారంగా రూ.30 వేయులు వేయులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు,

పత్తి రైతులను ఆదుకోవాలి

ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాలకు పత్తి పంట పూర్తిగా తీవ్రంగా నష్టపోయింది. ఏడాదంతా కష్టపడి సాగుచేసిన పత్తి రైతులకు ఈసారి వర్షాల ప్రభావంతో కన్నీరే మిగిల్చాయి. చీడపీడలకు ఎదుర్కొని సాగు చేసిన పంటలు నీటిపాలయ్యాయి. ప్రస్తుతం చేతికొచ్చిన పత్తి పంటలు కూడా తూఫాన్ ప్రభావంతో పూర్తిగా నేలరాలి పోయింది. ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేయిల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.

:- నాగేందర్ పటేల్ బిఆర్ఎస్ నాయకులు బోరేగావ్ గ్రామం

ఉపాధి హామీ కూలీలకు ఈ కేవైసీ తప్పనిసరి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T131633.968.wav?_=3

 

ఉపాధి హామీ కూలీలకు ఈ కేవైసీ తప్పనిసరి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఆయా గ్రామ ఉపాధి హామీ కూలీలకు అతి ముఖ్యమైన సమాచారం అందిస్తున్న స్వాతంత్ర సంఘ ఝరాసంగం మండల అధ్యక్షులు ఈశ్వర్ పటేల్ ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కార్మికు అదే విధంగా పనిచేయకుండా ఉన్న కార్మికులకు ప్రతి ఒక్కరు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ ఈ కేవైసీ తప్పకుండా చేసుకోవాలి లేనియెడల మీరు పని చేసిన పైసలు రావు భవిష్యత్తు ఉపాధి హామీ పని ఉండదు గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకాల ఉపాధి హామీ జాబ్ కార్డు డీటెయిల్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు ఒకవేళ ఆధార్ ఈ కేవైసీ ఆన్లైన్ చేసుకోకపోలే మీ యొక్క జాబ్ కార్డ్ ఆన్లైన్ లో రద్దు కావచ్చు

ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T130519.597-1.wav?_=4

 

ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకలు

జెండా ఎగరవేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో జెండా ఆవిష్కరణ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు కార్మికుల యొక్క హక్కుల కోసం ఆవిర్భవించిన గొప్ప చరిత్ర ఉన్న ఏఐటీయూసీ ఆరోజు జరిగిన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమే అని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చి హక్కు లేకుండా చేసి యాజమాన్యాలకు తొత్తులుగా చట్టాలు మార్పు చేశారన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం ,కనీస వేతనాలు అమలు కోసం, సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగ భద్రత కోసం నిరంతర ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉందన్నారు …ఫ్యాక్టరీల చట్టం ,ఈఎస్ఐ చట్టం, పీఎఫ్ చట్టం ,ప్రసూతి ప్రయోజనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, గ్రాటిటీ చెల్లింపు చట్టం ,బాల కార్మిక నిషేధ చట్టం, ఉద్యోగుల పదవి విరమణ పెన్షన్ పథకం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ,ఉపాధి హామీ చట్టం .వీటితోపాటు అనేక కార్మికుల హక్కుల కోసం చట్టాలను సాధించిన గొప్ప చరిత్ర కలిగిన యూనియన్ ఎఐటియుసి అని అన్నారు.. భవిష్యత్తులో మోడీ అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ ఇచ్చే పోరాట పిలుపులో భాగంగా కార్మికులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మోట పలుకుల రమేష్, ఏఐటీయూసీ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్, ఎఐటియుసి నాయకులు కమలాకర్ ,శ్రావణ్ ,రాజు ,యాదగిరి రాజయ్య, పీక రవి ,భూమయ్య తోపాటు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు

ఎస్సై ఆధ్వర్యంలో 2కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T130519.597.wav?_=5

 

ఎస్సై ఆధ్వర్యంలో 2కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం

నిజాంపేట: నేటి ధాత్రి

 

ప్రతి మనిషి ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయిస్తే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ మేరకు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, భారత ఏక్తా దినోత్సవం పురస్కరించుకొని నిజాంపేట నస్కల్ బస్టాండ్ నుండి నస్కల్ వెళ్లే రోడ్డు మార్గంలో 2k రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతను చాటే విధంగా 2k రన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో మొదటి స్థానం రచ్చ కొండ అభినయ్, ద్వితీయ స్థానం దొంతరమైన రాజేష్, తృతీయ స్థానం శివారం పథకాలను గెలుపొందారు అని అన్నారు

గుండాల లో రన్ ఫర్ యూనిటీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T122921.932.wav?_=6

 

 

గుండాల లో రన్ ఫర్ యూనిటీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం గుండాల పోలీస్ లు నిర్వహించారు. ఇందులో భాగంగా గుండాల సెంటర్ నుండి గురుకులం స్కూల్ వరకు రెండు కిలోమీటర్లు రన్నింగ్ నిర్వహించారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహిచమని గుండాల ఎస్సై సైదా రహూఫ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు,యువత, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై రహూఫ్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని అయన పేర్కొన్నారు.యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే సమరయోధులకు నిజమైన నివాళిఅర్పించినట్టవుతుందని అన్నారు.

అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నేలపాలు ..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T121956.242.wav?_=7

 

అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నేలపాలు ..

◆:- ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వేడుకలు ..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొంథా భారీ తుఫాన్ కారణంగా శుక్రవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలకు జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో రైతులు కుదేలవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాను కారణంగా నీటిపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా తమ విలపిస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంట చేతికి రావడంతో కురుస్తున్న వర్షాలకు మొలక ఎత్తే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి వర్షం కారణంగా నేత మరణంతో రైతుల కోసం అంత ఇంత కాదని చెప్పాలి తుఫాన్ చాలా వేగంగా వహించి మండల రైతులను పెద్ద మొత్తంలో ఊబిలోకి నెట్టింది భారీ వర్షాల కారణంగా జనం జీవితాలను దెబ్బతీస్తూ పల్లె ప్రాంతాల్లో విస్తృతంగా పంట పొలాలను నాశనం చేసింది వరి పత్తి మిరప పంటలు తుఫాన్ తో పాటు గాలి వర్షం ముప్పుతో కిందపడిపోవడం వలన రైతులకు భారీగా హార్దిక నష్టం కలిగింది.

◆:- పత్తి రైతు సుల్తాన్ సలావుద్దీన్ ఈదులపల్లి గ్రామం

రైతులు మమ్మల్ని ‌ప్రభుత్వం ఆదుకోవాలని ఈదులపల్లి చెందిన రైతు సుల్తాన్ సలావుద్దీన్ మాట్లాడుతూ.భారీ తుఫాన్ కారణంగా పంట నష్టపోయామని రైతులు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మండల వ్యాప్తంగా ఉన్న రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో వ్యవసాయ సాగుకు వేలాది రూపాయలు అప్పు తెచ్చి సాగు చేశామని వడ్డీ మందం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T121544.783.wav?_=8

 

రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు

◆:- సీఐ హనుమంతు

◆:- ఎస్ఐ,, క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం పోలీస్ స్టేషన్ 
 
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ అధికారులు జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31 సందర్భంగా, భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఝరాసంగం సీఐ హనుమంతు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ హనుమంతు మాట్లాడుతూ..ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం అని అన్నారు. యువత, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సర్దార్ పటేల్  సేవలు, దేశాన్ని ఏకతా బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన తమ వంతు సహకారం అందించాలి అన్నారు. శుక్రవారం ఉదయం 06:30 గంటలకు, పోలీస్ స్టేషన్ నుండి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, ప్రింట్ మీడియా మిత్రులు మరియు వివిధ సామాజిక సంస్థల సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు,

ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు…

ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో “భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి, ‘ఉక్కు మనిషి ’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సంధర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింధి ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మొదటగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి, పూలతో నివాళులు అర్పించారు.
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ … “భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి, హోం మినిస్టర్ ‘ఉక్కు మనిషి ’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సంధర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం మన మందరం గౌరవంగా జరుపుకుంటున్నాం అన్నారు . దేశ సమైక్యతకు, జాతీయ ఏకతకు పటేల్ సేవలు అమూల్యం అన్నారు . ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మనం సమాజం మరియు దేశం అభివృద్ధికి పాటు పడాలన్నారు .
ఈరోజు గ్లోబల్ పోటీ కాలంలో , మన కార్యాలయంలోనూ ఐక్యత, పరస్పర గౌరవం, సహకారం అత్యంత అవసరంఅన్నారు . వివిధ ఆలోచనలు, భిన్న సంస్కృతులు ఉన్న మనమందరం ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేయడం మన బలం. ఉద్యోగులు తన బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చాలన్నారు . ఐక్యత భావనతో, సమైక్యతతో ముందుకు సాగితే సింగరేణి సంస్థ ఇంకా ఎన్నో విజయ శిఖరాలను అధిరోహిస్తుందన్నారు .
సమైక్యత ఒక్క రోజు కార్యక్రమం కాకుండా — అది మన రోజువారీ ఆచరణ. మనం కలిసికట్టుగా పనిచేయాలన్నారు , పరస్పరం ప్రోత్సహించుకొని , సామూహిక అభివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు . ప్రతి ఉద్యోగి సంస్థ పురోగతిలో ముఖ్య భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమములో ఏరియా ఎస్ఓటీజిఎం కవీంద్ర, , ఎస్ జోతి– రాజేశ్వర్ (క్వాలిటీ) కృష్ణప్రసాద్, ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, పోషమల్లు గుర్తింపు సంఘం ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ఇతర ఉన్నత ఆధికారులు,జియమ్ కార్యలయంలోని సిబ్భంది పాల్గొన్నారు .

– కుల వివక్షత చూపరాదు.

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T115709.129.wav?_=9

 

– కుల వివక్షత చూపరాదు.
తహసిల్దార్ శ్రీనివాస్ .

నిజాంపేట: నేటి ధాత్రి

గ్రామాల్లో కులవివక్షత చూపరాదని భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ప్రతి మనిషి స్వేచ్చగా జీవించవచ్చని తహసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులకు పౌర హక్కుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు, అంటరానితనాన్ని నమ్మవద్దన్నారు. గ్రామాల్లో కులవివక్షత చూపరాదన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్, గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామస్తులు అందే స్వామి, మ్యాదరి నర్సింలు, భూపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో 2 కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం.

పోలీసుల ఆధ్వర్యంలో 2 కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం.

మంగపేట నేటిధాత్రి

 

 

భారత్ తొలి ప్రధాని హోం శాఖ మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా శుక్రవారం మంగపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2 కె రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంగపేట ఎస్ ఐ టి వి ఆర్ సూరి మాట్లాడుతూ.

భారత స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత కూడా సుమారు 565 రాజ్యాలు హైదరాబాద్ సంస్థనంతో కలిపి భారత్ లో విలీనం కాలేదు. దేశానికి మొదటి ఉప ప్రధాని, హోం శాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వున్నారు. వీరు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఆటక్ నుండి కటక్ వరకు వున్న చిన్న చిన్న రాజ్యలను భారతదేశం దేశంలో కలపడానికి విశేషమైన కృషి చేసారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్యం రాజకీయ చాణక్యం, స్థిరమైన సంకల్పం వల్లనే భారత యూనియన్ లో చిన్న చిన్న రాజ్యలన్నీ కలపగాలిగారు. భారత్ ను ఒక సర్వబౌమ దేశంగా ఏకికరించే మహాత్తర కార్యానికి పునుకునుని సఫలికృతమయ్యారు. దేశాన్ని ఒకటిగా చేసారు. అందుకే పటేల్ 150 వ జయంతిని దేశం మొత్తం సంబరాలు జరుపుకొంటుంది అని అన్నారు.

రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం లో పోలీసులు, యువజన సంఘాల

భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T114141.957.wav?_=10

 

భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్
: ఎస్పీ మహేష్ బి. గితే

– “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతం

– సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహణ

– రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని ఎస్పీ పేర్కొన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్ కమాండెంట్ సురేష్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ లు రాందాస్, ఎస్. సురేష్, ఇన్స్పెక్టర్ లు కృష్ణ, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు,కిరణ్ కుమార్, శ్రీకాంత్, శ్రావణ్ యాదవ్, సాయి, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, యువత క్రీడాకారులు పాల్గొన్నారు.

 అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది…

 అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది

 

అతివేగం ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. డ్యూటీకి వెళుతున్నానని చెప్పి బయలు దేరిన యువకుడు అరగంటలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. బాలానగర్‌ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ…

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ

 

మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.

విజయవాడ, అక్టోబర్ 31: ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు (MLA Bonda Uma Maheshwar Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్‌ని జయించటం కోసం పోరాడుతోందన్నారు. క్యాన్సర్‌ని జయించాలంటే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని డయాగ్నెస్ చేస్తే చాలా వరకు క్యూరైపోయే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్‌మెంట్‌తో అనేక క్యాన్సర్లకి మందులు, వ్యాక్సిన్ కూడా వచ్చాయని.. దీన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బెస్ట్ క్యాన్సర్‌తో పాటు సర్వైవల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే సీఎం చంద్రబాబు (CM Chandrababu) కల అని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు. ఇన్నర్‌విల్ క్లబ్ వంటి సంస్థలు ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. వారు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఉచిత స్క్రీనింగ్ టెస్ట్‌లను కూడా అందిస్తున్నారని తెలియజేశారు.
ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఆడపిల్లలు, యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటివి చాలా ముఖ్యమన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు.

జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T111310.376.wav?_=11

 

జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి….

ఆర్కేపి ఎస్సై జి రాజశేఖర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా ర్యాలీ….

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

కుల, మత ,వర్గ, లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జి రాజశేఖర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు లు పిలుపునిచ్చారు. భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు హాజరయ్యారు. పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం నుండి 2 కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. రన్ లో పట్టణ పోలీసులు, విద్యార్థులు, యువతతో పాటు పలు రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐక్యత స్ఫూర్తితో సమాజంలో శాంతి సహకారం నెలకొల్పేలా ప్రజలు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

‘అఖండ 2’ మ్యూజిక్‌ కొంత పూర్తయింది…

‘అఖండ 2’ మ్యూజిక్‌ కొంత పూర్తయింది

 

నందమూరి బాలకృష్ణ ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్‌ కళాకారుడు శివమణి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

తిరుమల: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్‌ కళాకారుడు శివమణి(Shivamani) తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు తమన్‌(Taman)కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమల(Tirumala)లో మంచి దర్శనాలు చేయిస్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ధన్యవాదాలన్నారు.

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి…

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి

 

పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

డీప్‌ఫేక్‌పై (DeepFake) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందించారు. డీప్‌ఫేక్‌ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళానని.. డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లు (Hyderabad CP Sajjanar) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని.. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు. ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

సీరియస్‌గా తీసుకున్నాం: సీపీ సజ్జనార్

మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. డీప్‌ఫేక్‌ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్‌ పెట్టినట్లు చెప్పారు. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని అన్నారు. ప్రజల్లో ఎంతో అవగాహన తీసుకువస్తున్నామని.. అయినప్పటికీ డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇతర సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. పిల్లలు 5 వేలు, 10 వేల కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారని.. దీని వల్ల పెద్దలు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీ వెల్లడించారు.

టాస్క్ ఫోర్స్ ఎస్సై సస్పెండ్‌పై…

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఉప్పలపాటి సతీష్‌పై సీఐడీ, జీఎస్టీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని.. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

హై కమాండ్‌..రేవంత్‌కు ఫ్రీ హాండ్‌!

`అందరినీ దారిలో పెట్టే బాధ్యత!

`అన్ని విధాలుగా పూర్తి అధికారం

`పని చేయని వారిని పక్కన పెట్టండి

`పార్టీ ప్రతిష్టకు భంగవాటిల్లితే ఉపేక్షించొద్దు

`ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించొద్దు

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికలలో గెలిచి తీరాలి

`ఏ విషయంలోనైనా అంతిమ నిర్ణయం సిఎం. రేవంత్‌కే

`రాష్ట్ర వ్యవహారాలలో రేవంత్‌ నిర్ణయం అందరూ ఆమోదించాల్సిందే

`మెతక వైఖరి అవసరం లేదని రేవంత్‌ కు సూచించిన హై కమాండ్‌

`అధిష్టానం పిలిస్తే తప్ప మంత్రులెవరూ డిల్లీకి రావొద్దు

`పార్టీ పరంగా ఎవరు హద్దు దాటినా వేటు వేయండి

`ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పార్టీ నాయకులు మాట్లాడినా సహించకండి

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హైకమాండ్‌ పూర్త స్ధాయి ఫ్రీ హాండ్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై పాలన అంటే ఎలా వుంటుందో, రేవంత్‌ రెడ్డి పవర్‌ ఎలా వుంటుందో తెలిసే సమయం వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఇంత కాలం ఆయనకు పూర్తి స్దాయిలో వెసులుబాటు లేదన్నది కొంత వరకు సత్యం. కాని ఇటీవల ఆయనపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో హైకమాండ్‌ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే పూర్తి స్దాయిలో సిఎం.రేవంత్‌ రెడ్డికి ఫ్రీ హాండ్‌ ఇస్తే తప్ప వివాదాలు సమసిపోవు అనే ఆలోచనకు వచ్చింది. అందుకే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇకపై తన మార్కు పాలనను చూపిస్తానని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం సిఎం. రేవంత్‌ రెడ్డి మంత్రుల్లో ఎవరు తనపై అసత్య ప్రచారాలు సాగేలా వ్యవహరిస్తున్నారన్న దానిపై చాల సేపు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిరది రేవంత్‌ రెడ్డి. పార్టీని అదికారంలోకి తీసుకురావడంలో అందరికన్నా కీలకభూమిక పోషించింది రేవంత్‌ రెడ్డి. అధిష్టానం ఆషామాషీగా రేవంత్‌రెడ్డిని సిఎం. చేయలేదు. అదిష్టానానికి అన్నీ తెలుసు. రేవంత్‌ రెడ్డి రాజకీయ వ్యూహాలు తెలుసు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడల్లో కేసిఆర్‌ ఎలా చిక్కుకున్నారో తెలుసు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సిఎం. చేసింది. ఈ మాత్రం అవగాహన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరికీ తెలుసు. అయినా తాము ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష మేరకు కొ ంత మంది మంత్రులు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా సిఎం. దృష్టికి వచ్చింది. పైగా వ్యక్తిగతంగా సిఎం. రేవంత్‌రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నది గుర్తించారు. అందుకే మంత్రి వర్గ సమావేశంలో మంత్రులందిరి పనితీరుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. పైగా ఆయా మంత్రుల తీరుపై కూడా అదిష్టానానికి సమగ్రమైన నివేధిక కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వున్న క్యాబినేట్‌లో చాలా మంది మంత్రులు సిఎం.కు ఇబ్బందికరమైన పరిస్ధితులు తెచ్చిపెట్టాలనే చూస్తున్నారు అనేది వెల్లడౌతోంది. పైగా తమ ఇష్టాను సారం కూడా కొంత మంది మంత్రులు పనిచేస్తున్నారు. అందుకే ఇలాంటి ఇబ్బ ందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే తాము పదువుల్లో వున్నామన్న విషయాన్ని చాలా మంది మంత్రులు మర్చిపోతున్నట్లున్నారు. తమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా కొంత మంది అనుకుంటున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ప్రోద్భలం వల్లనే కొంత మంది ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్‌ పెట్టేందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫరావా లేదన్నట్లు అధిష్టానం కూడా తేల్చిచెప్పినట్లు కూడా సమాచారం అందుతోంది. రాజకీయంగా సిఎం. రేవంత్‌రెడ్డి వ్యూహాలు ఇప్పుడున్న మంత్రులకు ఎవరికీ తెలియవు. అర్ధం కావు. అందుకే రేవంత్‌ రెడ్డి పిపిసి అధ్యక్షుడు అయిన నుంచి ఆయనను తప్పు పడుతూనే వున్నారు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడలు ఎలా వున్నాయో ఒక్కసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. గత ఎన్నికల ముందు నుంచి కూడా సిఎం.రేవంత్‌రెడ్డి వేసిన ప్రతి స్కెచ్‌లోనూ కేసిఆర్‌ చిక్కుకుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం కూడా కేసిఆర్‌ చెప్పలేకపోయాడు. ఇక్కడ ఒక్క విషయం సూటిగా చెప్పుకోవాలి. గత ఎన్నికలు ముందు రెండేళ్లుగా కేసిఆర్‌ అంటేనే జనం చీ కొట్టేలా చేయడంలో రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. రైతులు కూడా కేసిఆర్‌కు వ్యతిరేంగా మారడంలో కీలక భూమిక పోషించారు. రైతుల ఓట్లు బిఆర్‌ఎస్‌కు పడకుండా నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని కేసిఆర్‌ను దెబ్బకొట్టిన ఘనత రేవంత్‌ రెడ్డిది. పల్లె సీమలను భాగ్య సీమలు చేశానని గొప్పలు చెప్పుకున్న కేసిఆర్‌కు ఆ పల్లెలే చుక్కలు చూపించేలా చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది. ఇలా ఏ పల్లె జనాన్ని తనకు ఎదురులేదు. తిరుగులేదు. అనుకొని ప్రజలు కూడా కలవకుండా పాలన సాగించిన కేసిఆర్‌ను ఫామ్‌ హౌజ్‌కు పరిమితం చేసి, కోలుకోలేని దెబ్బలు కొడుతున్న నాయకుడు, పాలకుడు రేవంత్‌ రెడ్డి. ఒకప్పుడు కేసిఆర్‌ వ్యూహాం ముందు అప్పటి నాయకులు చతికిలపడేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేక కేసిఆర్‌ గింగిరాలు తిరుగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు కేసిఆర్‌ను స్ధానం లేకుండా చేశారు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ను రేవంత్‌ రెడ్డి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నుంచి తన మార్కు రాజకీయ దెబ్బ చూపిస్తూ వస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కాంగ్రెస్‌కు వీక్‌ అభ్యర్ధిని నిలబెట్టి బిఆర్‌ఎస్‌ను ఓడిరచారు. అప్పుడు రేవంత్‌రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కాని రేవంత్‌ తన వ్యూహాంలో విజయం సాధించారు. ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్‌ అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే అంతిమంగా బిఆర్‌ఎస్‌ గెలుస్తుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి,ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కేసిఆర్‌ను దెబ్బకొట్టారు. కేసిఆర్‌కు మొదటిసారి ఓటమి రుచి చూపించారు. తర్వాత దుబ్బాకలో ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు. అక్కడా బిఆర్‌ఎస్‌ పతనాన్ని రచించారు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమిని రేవంత్‌ రెడ్డి రచించారు. విజయం సాదించారు. సిఎం. అయ్యారు. అందుకు ముందుగా అమలు చేసిన స్కెచ్‌నే ఇప్పటికీ రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. కాని కేసిఆర్‌ అదే ఉచ్చులో పదే పదే చిక్కుకుంటున్నారు. దమ్ముంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ ఇచ్చి గెలిపించుకో అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన సవాలును స్వీకరించి గత ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసినా అదే ఎమ్మెల్యేలకు కేసిఆర్‌ టిక్కెట్లు ఇచ్చి ఓటమిని తానే కొని తెచ్చుకునేలా చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలను మార్చకపోతే పార్టీ ఓడిపోతుందని ఎంతో మంది సీనియర్లు కేసిఆర్‌కు చెప్పినా వినలేదు. రేవంత్‌ రెడ్డి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్టీని ఓటమికి కేసిఆరే కారకులయ్యారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసినా కేసిఆర్‌ పసిగట్టలేకపోతున్నారు. రేవంత్‌రెడ్డి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడని తెలిసినా కేసిఆర్‌ చేతులెత్తేసే రాజకీయమే చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా రేవంత్‌రెడ్డి అనుసరించినా ఇప్పటికీ కేసిఆర్‌ పసిగట్టలేపోయారా? లేక తెలిసే వదిలేస్తున్నారా? ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఎన్నికలలో కేసిఆర్‌ ప్రచారానికి రాకుండా కట్టడి చేయడంలో రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలే నిదర్శనమని చెప్పకతప్పదు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్‌లో కేసిఆర్‌ ప్రచారానికి రావడానికి ఇష్టపడం లేదు. జూబ్లీహిల్స్‌ ఓడిపోయే సీటుకు ప్రచారం చేసి మరింత పరువు తీసుకోవడం కన్నా, ప్రచారానికి దూరంగా వుండడమే మేలనే పరిస్ధితికి కేసిఆర్‌ను నెట్టి వేయడంతో కూడా రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. దానికి తోడు తాజాగా రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ ఓట్లను గుండు గుత్తగా కాంగ్రెస్‌కు పడేలా చేసుకోవడం కోసం మరో ఎత్తుగడ వేస్తున్నారు. ఇండియన్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఇప్పటి వరకు మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు లేదు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ఓట్లను బిఆర్‌ఎస్‌ వైపు మళ్లకుండా చేసేఎత్తుగడ వేశారు. ఇప్పటికే ఎంఐఎంను ఒప్పించి అభ్యర్దిని నిలబెట్టకుండా చూసుకున్నారు. ఎంఐఎం సూచనల మేరకు నవీన్‌ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఇలా రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు కేసిఆర్‌కు మింగుడు పడడం లేదు. వ్యక్తిగతంగానే నవీన్‌ యాదవ్‌కు వేలాది ఓట్లు వున్నాయి. ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేస్తేనే 20వేల ఓట్లకు పైగా సాదించారు. ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో రెండో స్ధానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎంఐఎంల సపోర్టుతో కలుపుకుంటే నవీన్‌యాదవ్‌కు భారీ మెజార్టీ ఖాయంగానే కనిపిస్తోంది.. మరో వైపు సినీ ఇండ్రస్ట్రీనీ ఆకట్టుకోవడం కోసం రేవంత్‌ రెడ్డి రంగంలోకిదిగారు. ఇలాంటి వ్యూహాలు ఏనాడు సీనియర్లైన నాయకులు ఎవరూ అమలు చేయలేదు. గుడ్డిగా కేసిఆర్‌ వేసిన ఎత్తుల్లో చిక్కుకున్నారు. కాని రేవంత్‌రెడ్డి వేసే ఎత్తులు అర్ధం కాక బిఆర్‌ఎస్‌ కూడా చతికిలపడిపోతోంది. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దించే కుట్రలకు ఎంత మంది తెరతీసినా వాటిని పటా పంచెలు చేయగల రాజకీయ యుక్తి, శక్తి రేవంత్‌రెడ్డికి వుంది. పార్టీ కోసం ఆయన పడిన శ్రమ, అదికారంలోకి తెచ్చేందుకు ఆయన పడిన కష్టం సున్నితంగా వదిలేసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. ఇకపై సీనియర్‌ మంత్రులైనా, ఇతర నాయకులైనా సరే ఉపేక్షించేందుకు సిఎం. సిద్దంగా లేరు. ఏ మాత్రం మంత్రులు సరిగ్గా పని చేయకపోయినా తప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం వచ్చి రెండేళ్ల కావొస్తోంది. మంత్రి వర్గ కూర్పు, మార్పు కూడా తప్పదని తెలుస్తోంది. అదంతా పార్టీ అధిష్టానం పూర్తిగా సిఎం. రేవంత్‌ రెడ్డి చేతుల్లోనే పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇకపై సిఎం. రేవంత్‌ వ్యవహార శైలిని సరికొత్తగా చూడొచ్చని అనుకుంటున్నారు.

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి…

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి.

జిల్లా ఇన్చార్జి డి డబ్ల్యు ఓ మల్లేశ్వరి.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక సెక్టార్ మీటింగ్ ఒడితల లక్ష్మి టీచర్ కేంద్రంలో జయప్రద సూపర్వైజరు సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి బీడబ్ల్యుఓ మల్లేశ్వరి హాజరై అంగన్వాడి కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. టీచర్ ,ఆయా సమయపాలన కచ్చితంగా పాటించాలి. ప్రీస్కూల్ కార్యక్రమాలన్నీ ఆట ,పాట ,కథ ద్వారా నేర్పించాలి. మెనూ ప్రకారం పిల్లలకు, తల్లులకు వేడిగా రుచిగా భోజనం పెట్టాలి. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేయాలి. కొత్తగా లబ్ధిదారులు వచ్చిన వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ , ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాతనే ఫుడ్ ఇవ్వాలని సూచించారు తదుపరి ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. లక్ష్మి, ఉమాదేవి, సుజాత మిగతా 25 మంది టీచర్స్ హాజరైనారు.

పలు కాలనీలను సందర్శించిన యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల..

పలు కాలనీలను సందర్శించిన యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల

 

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని పలు ప్రాంతాలలో నిన్నటి రోజు నుండి మంథా తుఫాన్ ప్రభావం వలన తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్,జిల్లా యూత్ కాంగ్రెస్ మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని పలు కాలనీలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.కాలనీవాసుల సమస్యలు తెలుసుకొని అనంతరం ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల-జెమిని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు సాంబయ్య,బొచ్చు కిరణ్, ఒంటేరు రాజు,ఒంటేరు అజయ్,ఒంటేరు రాహుల్, సంగి జస్వంత్,చెరుపల్లి సదయ్య,సరోజన,ఈశ్వర తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version