`అందరినీ దారిలో పెట్టే బాధ్యత!
`అన్ని విధాలుగా పూర్తి అధికారం

`పని చేయని వారిని పక్కన పెట్టండి
`పార్టీ ప్రతిష్టకు భంగవాటిల్లితే ఉపేక్షించొద్దు
`ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించొద్దు
`జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిచి తీరాలి
`ఏ విషయంలోనైనా అంతిమ నిర్ణయం సిఎం. రేవంత్‌కే
`రాష్ట్ర వ్యవహారాలలో రేవంత్ నిర్ణయం అందరూ ఆమోదించాల్సిందే
`మెతక వైఖరి అవసరం లేదని రేవంత్ కు సూచించిన హై కమాండ్
`అధిష్టానం పిలిస్తే తప్ప మంత్రులెవరూ డిల్లీకి రావొద్దు
`పార్టీ పరంగా ఎవరు హద్దు దాటినా వేటు వేయండి
`ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పార్టీ నాయకులు మాట్లాడినా సహించకండి
హైదరాబాద్, నేటిధాత్రి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ పూర్త స్ధాయి ఫ్రీ హాండ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై పాలన అంటే ఎలా వుంటుందో, రేవంత్ రెడ్డి పవర్ ఎలా వుంటుందో తెలిసే సమయం వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఇంత కాలం ఆయనకు పూర్తి స్దాయిలో వెసులుబాటు లేదన్నది కొంత వరకు సత్యం. కాని ఇటీవల ఆయనపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో హైకమాండ్ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే పూర్తి స్దాయిలో సిఎం.రేవంత్ రెడ్డికి ఫ్రీ హాండ్ ఇస్తే తప్ప వివాదాలు సమసిపోవు అనే ఆలోచనకు వచ్చింది. అందుకే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా సిఎం. రేవంత్ రెడ్డి ఇకపై తన మార్కు పాలనను చూపిస్తానని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం సిఎం. రేవంత్ రెడ్డి మంత్రుల్లో ఎవరు తనపై అసత్య ప్రచారాలు సాగేలా వ్యవహరిస్తున్నారన్న దానిపై చాల సేపు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిరది రేవంత్ రెడ్డి. పార్టీని అదికారంలోకి తీసుకురావడంలో అందరికన్నా కీలకభూమిక పోషించింది రేవంత్ రెడ్డి. అధిష్టానం ఆషామాషీగా రేవంత్‌రెడ్డిని సిఎం. చేయలేదు. అదిష్టానానికి అన్నీ తెలుసు. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు తెలుసు. రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడల్లో కేసిఆర్ ఎలా చిక్కుకున్నారో తెలుసు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సిఎం. చేసింది. ఈ మాత్రం అవగాహన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కాని కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలుసు. అయినా తాము ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష మేరకు కొ ంత మంది మంత్రులు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా సిఎం. దృష్టికి వచ్చింది. పైగా వ్యక్తిగతంగా సిఎం. రేవంత్‌రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నది గుర్తించారు. అందుకే మంత్రి వర్గ సమావేశంలో మంత్రులందిరి పనితీరుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. పైగా ఆయా మంత్రుల తీరుపై కూడా అదిష్టానానికి సమగ్రమైన నివేధిక కూడా సిఎం. రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వున్న క్యాబినేట్‌లో చాలా మంది మంత్రులు సిఎం.కు ఇబ్బందికరమైన పరిస్ధితులు తెచ్చిపెట్టాలనే చూస్తున్నారు అనేది వెల్లడౌతోంది. పైగా తమ ఇష్టాను సారం కూడా కొంత మంది మంత్రులు పనిచేస్తున్నారు. అందుకే ఇలాంటి ఇబ్బ ందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే తాము పదువుల్లో వున్నామన్న విషయాన్ని చాలా మంది మంత్రులు మర్చిపోతున్నట్లున్నారు. తమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా కొంత మంది అనుకుంటున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ప్రోద్భలం వల్లనే కొంత మంది ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్ పెట్టేందుకు సిఎం. రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫరావా లేదన్నట్లు అధిష్టానం కూడా తేల్చిచెప్పినట్లు కూడా సమాచారం అందుతోంది. రాజకీయంగా సిఎం. రేవంత్‌రెడ్డి వ్యూహాలు ఇప్పుడున్న మంత్రులకు ఎవరికీ తెలియవు. అర్ధం కావు. అందుకే రేవంత్ రెడ్డి పిపిసి అధ్యక్షుడు అయిన నుంచి ఆయనను తప్పు పడుతూనే వున్నారు. రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడలు ఎలా వున్నాయో ఒక్కసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. గత ఎన్నికల ముందు నుంచి కూడా సిఎం.రేవంత్‌రెడ్డి వేసిన ప్రతి స్కెచ్‌లోనూ కేసిఆర్ చిక్కుకుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం కూడా కేసిఆర్ చెప్పలేకపోయాడు. ఇక్కడ ఒక్క విషయం సూటిగా చెప్పుకోవాలి. గత ఎన్నికలు ముందు రెండేళ్లుగా కేసిఆర్ అంటేనే జనం చీ కొట్టేలా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రైతులు కూడా కేసిఆర్‌కు వ్యతిరేంగా మారడంలో కీలక భూమిక పోషించారు. రైతుల ఓట్లు బిఆర్‌ఎస్‌కు పడకుండా నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని కేసిఆర్‌ను దెబ్బకొట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. పల్లె సీమలను భాగ్య సీమలు చేశానని గొప్పలు చెప్పుకున్న కేసిఆర్‌కు ఆ పల్లెలే చుక్కలు చూపించేలా చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది. ఇలా ఏ పల్లె జనాన్ని తనకు ఎదురులేదు. తిరుగులేదు. అనుకొని ప్రజలు కూడా కలవకుండా పాలన సాగించిన కేసిఆర్‌ను ఫామ్ హౌజ్‌కు పరిమితం చేసి, కోలుకోలేని దెబ్బలు కొడుతున్న నాయకుడు, పాలకుడు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు కేసిఆర్ వ్యూహాం ముందు అప్పటి నాయకులు చతికిలపడేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేక కేసిఆర్ గింగిరాలు తిరుగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు కేసిఆర్‌ను స్ధానం లేకుండా చేశారు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ను రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి తన మార్కు రాజకీయ దెబ్బ చూపిస్తూ వస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్ గెలిచేలా చేసి, కాంగ్రెస్‌కు వీక్ అభ్యర్ధిని నిలబెట్టి బిఆర్‌ఎస్‌ను ఓడిరచారు. అప్పుడు రేవంత్‌రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కాని రేవంత్ తన వ్యూహాంలో విజయం సాధించారు. ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్ అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే అంతిమంగా బిఆర్‌ఎస్ గెలుస్తుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి,ఈటెల రాజేందర్ గెలిచేలా చేసి, కేసిఆర్‌ను దెబ్బకొట్టారు. కేసిఆర్‌కు మొదటిసారి ఓటమి రుచి చూపించారు. తర్వాత దుబ్బాకలో ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు. అక్కడా బిఆర్‌ఎస్ పతనాన్ని రచించారు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమిని రేవంత్ రెడ్డి రచించారు. విజయం సాదించారు. సిఎం. అయ్యారు. అందుకు ముందుగా అమలు చేసిన స్కెచ్‌నే ఇప్పటికీ రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. కాని కేసిఆర్ అదే ఉచ్చులో పదే పదే చిక్కుకుంటున్నారు. దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చి గెలిపించుకో అంటూ రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరించి గత ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసినా అదే ఎమ్మెల్యేలకు కేసిఆర్ టిక్కెట్లు ఇచ్చి ఓటమిని తానే కొని తెచ్చుకునేలా చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలను మార్చకపోతే పార్టీ ఓడిపోతుందని ఎంతో మంది సీనియర్లు కేసిఆర్‌కు చెప్పినా వినలేదు. రేవంత్ రెడ్డి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్టీని ఓటమికి కేసిఆరే కారకులయ్యారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసినా కేసిఆర్ పసిగట్టలేకపోతున్నారు. రేవంత్‌రెడ్డి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడని తెలిసినా కేసిఆర్ చేతులెత్తేసే రాజకీయమే చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా రేవంత్‌రెడ్డి అనుసరించినా ఇప్పటికీ కేసిఆర్ పసిగట్టలేపోయారా? లేక తెలిసే వదిలేస్తున్నారా? ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో కేసిఆర్ ప్రచారానికి రాకుండా కట్టడి చేయడంలో రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలే నిదర్శనమని చెప్పకతప్పదు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్‌లో కేసిఆర్ ప్రచారానికి రావడానికి ఇష్టపడం లేదు. జూబ్లీహిల్స్ ఓడిపోయే సీటుకు ప్రచారం చేసి మరింత పరువు తీసుకోవడం కన్నా, ప్రచారానికి దూరంగా వుండడమే మేలనే పరిస్ధితికి కేసిఆర్‌ను నెట్టి వేయడంతో కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. దానికి తోడు తాజాగా రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ ఓట్లను గుండు గుత్తగా కాంగ్రెస్‌కు పడేలా చేసుకోవడం కోసం మరో ఎత్తుగడ వేస్తున్నారు. ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఇప్పటి వరకు మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు లేదు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ఓట్లను బిఆర్‌ఎస్ వైపు మళ్లకుండా చేసేఎత్తుగడ వేశారు. ఇప్పటికే ఎంఐఎంను ఒప్పించి అభ్యర్దిని నిలబెట్టకుండా చూసుకున్నారు. ఎంఐఎం సూచనల మేరకు నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారు. ఇలా రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు కేసిఆర్‌కు మింగుడు పడడం లేదు. వ్యక్తిగతంగానే నవీన్ యాదవ్‌కు వేలాది ఓట్లు వున్నాయి. ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేస్తేనే 20వేల ఓట్లకు పైగా సాదించారు. ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో రెండో స్ధానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంఐఎంల సపోర్టుతో కలుపుకుంటే నవీన్‌యాదవ్‌కు భారీ మెజార్టీ ఖాయంగానే కనిపిస్తోంది.. మరో వైపు సినీ ఇండ్రస్ట్రీనీ ఆకట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి రంగంలోకిదిగారు. ఇలాంటి వ్యూహాలు ఏనాడు సీనియర్లైన నాయకులు ఎవరూ అమలు చేయలేదు. గుడ్డిగా కేసిఆర్ వేసిన ఎత్తుల్లో చిక్కుకున్నారు. కాని రేవంత్‌రెడ్డి వేసే ఎత్తులు అర్ధం కాక బిఆర్‌ఎస్ కూడా చతికిలపడిపోతోంది. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దించే కుట్రలకు ఎంత మంది తెరతీసినా వాటిని పటా పంచెలు చేయగల రాజకీయ యుక్తి, శక్తి రేవంత్‌రెడ్డికి వుంది. పార్టీ కోసం ఆయన పడిన శ్రమ, అదికారంలోకి తెచ్చేందుకు ఆయన పడిన కష్టం సున్నితంగా వదిలేసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. ఇకపై సీనియర్ మంత్రులైనా, ఇతర నాయకులైనా సరే ఉపేక్షించేందుకు సిఎం. సిద్దంగా లేరు. ఏ మాత్రం మంత్రులు సరిగ్గా పని చేయకపోయినా తప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం వచ్చి రెండేళ్ల కావొస్తోంది. మంత్రి వర్గ కూర్పు, మార్పు కూడా తప్పదని తెలుస్తోంది. అదంతా పార్టీ అధిష్టానం పూర్తిగా సిఎం. రేవంత్ రెడ్డి చేతుల్లోనే పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇకపై సిఎం. రేవంత్ వ్యవహార శైలిని సరికొత్తగా చూడొచ్చని అనుకుంటున్నారు.