పత్తి వర్షార్పణం…..!
◆:- మొంథా తుఫాన్ ప్రభావంతో వాణిజ్య పంటలు నష్టం
◆:- చేతికొచ్చిన పత్తి, సోయా పంటలు నష్టం
◆:- ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకొలు
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకొలు – ఝరాసంగం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందులో ముఖ్యంగా చేతికొచ్చిన పత్తి, సోయా, అల్లం, బొప్పాయి లాంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో వేకువజాము నుండే వర్షాలు మండల వ్యాప్తంగా విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, ఊట కుంటలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. మండలంలో పత్తి, సోయా, అల్లం, చెరుకు, కంది పంటలలో నీరు నిలిచి ప్రవహిస్తోంది. దీంతో రైతులు చేసేదేమీ లేక వర్షాలు ఈ ఏడాది నిండా ముంచాయని కన్నీటి పర్యంతంమవుతున్నారు.
తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులు..
అధిక వర్షాలకు పత్తి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత పిందె కాయ నుండి కాపాడుకుంటూ వచ్చిన పత్తి రైతులు ఇప్పుడు కనులెత్తితే పనికి రాకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి
భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట నీటిపాల అవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల వరకు పత్తి పంటను సాగు చేస్తున్నారు. పూత దశలో ఉన్నప్పుడే కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతిందని, ఎదిగే దశలో ఉన్నప్పుడు రైతులు ఎరువులు వేసి మందులు పిచికారి చేశారు. అప్పుడు సైతం పూత పిందెలు కాళ్లతో సహ వరుసగా వర్షాలు కురవడంతో నేలరాలిపోయాయి. ప్రస్తుతం పత్తి తీయడానికి రావడంతో ఈ తూఫాన్ ప్రభావంతో చేలలోనే నీరు గారి పోతోంది. చేలలో వర్షాలు నిలవడంతో పత్తి రంగు మారడమే కాకుండా పూర్తిగా నేలరాలి పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నా పంట నష్టపోయిన తమకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కనీసం ఎకరాకు నష్టపరిహారంగా రూ.30 వేయులు వేయులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు,
పత్తి రైతులను ఆదుకోవాలి
ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాలకు పత్తి పంట పూర్తిగా తీవ్రంగా నష్టపోయింది. ఏడాదంతా కష్టపడి సాగుచేసిన పత్తి రైతులకు ఈసారి వర్షాల ప్రభావంతో కన్నీరే మిగిల్చాయి. చీడపీడలకు ఎదుర్కొని సాగు చేసిన పంటలు నీటిపాలయ్యాయి. ప్రస్తుతం చేతికొచ్చిన పత్తి పంటలు కూడా తూఫాన్ ప్రభావంతో పూర్తిగా నేలరాలి పోయింది. ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేయిల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
:- నాగేందర్ పటేల్ బిఆర్ఎస్ నాయకులు బోరేగావ్ గ్రామం
