రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు
◆:- సీఐ హనుమంతు
◆:- ఎస్ఐ,, క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం పోలీస్ స్టేషన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ అధికారులు జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31 సందర్భంగా, భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఝరాసంగం సీఐ హనుమంతు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ హనుమంతు మాట్లాడుతూ..ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం అని అన్నారు. యువత, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సర్దార్ పటేల్ సేవలు, దేశాన్ని ఏకతా బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన తమ వంతు సహకారం అందించాలి అన్నారు. శుక్రవారం ఉదయం 06:30 గంటలకు, పోలీస్ స్టేషన్ నుండి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, ప్రింట్ మీడియా మిత్రులు మరియు వివిధ సామాజిక సంస్థల సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు,
