– కుల వివక్షత చూపరాదు.
తహసిల్దార్ శ్రీనివాస్ .
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామాల్లో కులవివక్షత చూపరాదని భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ప్రతి మనిషి స్వేచ్చగా జీవించవచ్చని తహసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులకు పౌర హక్కుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు, అంటరానితనాన్ని నమ్మవద్దన్నారు. గ్రామాల్లో కులవివక్షత చూపరాదన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్, గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామస్తులు అందే స్వామి, మ్యాదరి నర్సింలు, భూపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
