ఎస్సై ఆధ్వర్యంలో 2కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రతి మనిషి ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయిస్తే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ మేరకు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, భారత ఏక్తా దినోత్సవం పురస్కరించుకొని నిజాంపేట నస్కల్ బస్టాండ్ నుండి నస్కల్ వెళ్లే రోడ్డు మార్గంలో 2k రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతను చాటే విధంగా 2k రన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో మొదటి స్థానం రచ్చ కొండ అభినయ్, ద్వితీయ స్థానం దొంతరమైన రాజేష్, తృతీయ స్థానం శివారం పథకాలను గెలుపొందారు అని అన్నారు
