అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నేలపాలు ..
◆:- ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వేడుకలు ..
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొంథా భారీ తుఫాన్ కారణంగా శుక్రవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలకు జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో రైతులు కుదేలవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాను కారణంగా నీటిపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా తమ విలపిస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంట చేతికి రావడంతో కురుస్తున్న వర్షాలకు మొలక ఎత్తే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి వర్షం కారణంగా నేత మరణంతో రైతుల కోసం అంత ఇంత కాదని చెప్పాలి తుఫాన్ చాలా వేగంగా వహించి మండల రైతులను పెద్ద మొత్తంలో ఊబిలోకి నెట్టింది భారీ వర్షాల కారణంగా జనం జీవితాలను దెబ్బతీస్తూ పల్లె ప్రాంతాల్లో విస్తృతంగా పంట పొలాలను నాశనం చేసింది వరి పత్తి మిరప పంటలు తుఫాన్ తో పాటు గాలి వర్షం ముప్పుతో కిందపడిపోవడం వలన రైతులకు భారీగా హార్దిక నష్టం కలిగింది.
◆:- పత్తి రైతు సుల్తాన్ సలావుద్దీన్ ఈదులపల్లి గ్రామం
రైతులు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈదులపల్లి చెందిన రైతు సుల్తాన్ సలావుద్దీన్ మాట్లాడుతూ.భారీ తుఫాన్ కారణంగా పంట నష్టపోయామని రైతులు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మండల వ్యాప్తంగా ఉన్న రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో వ్యవసాయ సాగుకు వేలాది రూపాయలు అప్పు తెచ్చి సాగు చేశామని వడ్డీ మందం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
