ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎన్ ఎస్ యుఐ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో మొట్ట మొదటి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ 37వ వర్దంతి ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఈ దేశానికి ఎనలేని సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా రాజబరణలను రద్దు చేసి, బ్యాంకులను జాతీయకరణం చేయడం,20 సూత్రాల పతాకాన్ని తీసుకవచి పేదరికాన్ని నిర్ములించడినికి కృషి చేసిన గొప్ప నాయకురాలు,గరిబి హఠావో అనే నినాదంతో ప్రజలందరికీ అండగా నేనుంటా అని ఉత్తేజ పరిచిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ ఈ దేశంలో ఉన్న ప్రజల గుండల్లో చేరిగిపోని ముద్ర వేసుకున్న నాయకురాలు ఇందిరాగాంధీ వారు ఈ లోకంలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీ తీరని లోటని వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రాధిస్తూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ని చేయడమే లక్ష్యంగా ప్రతి ఎన్ ఎస్ యు ఐ కార్యకర్త ఒక సైనికులుగా పని చేయాలని ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగించాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పోతర్ల ప్రేమ్ కుమార్, మాట్టేవాడ సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి,అజ్మీరా వినోద్, కాలేజీ ప్రెసిడెంట,శ్రీకాంత్,మహేష్,ప్రవీణ్,రాజు, స్వాతి కిరణ్, సమీర్, రాజేష్,శివ తదితరులు పాల్గొన్నారు..
