ఆరు నెలలకు మించి బతకను అన్నారు..

ఆరు నెలలకు మించి బతకను అన్నారు.. క్యాన్సర్ నాటి రోజులను గుర్తు చేసుకున్న యువీ!

 

 

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో బాధ పడుతూనే 2011 ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా క్యాన్సర్ నాటి రోజులను, తనకు ఎదురైన అనుభవాలను యువీ గుర్తు చేసుకున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించాడు. క్యాన్సర్‌తో బాధ పడుతూనే. టీమిండియా 2011ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. యువీ సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నప్పటికీ.. అతడు పడ్డ కష్టాలు కూడా అంతే ఉన్నాయి. తాజాగా అతడు(Yuvraj Singh) క్యాన్సర్ బారిన పడిన రోజుల్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.
‘మూడు నుంచి ఆరు నెలలకు మించి బతకను అని డాక్టర్లు చెప్పారు. క్యాన్సర్ ట్యూమర్ నా ఊపిరితిత్తి, హృదయం మధ్యలో ఉందన్నారు. అది నరంపై ఒత్తిడి తెస్తోందన్నాడు. ఒకవేళ నేను కీమో థెరీకి వెళ్లకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు నన్ను హెచ్చరించారు. టెస్టు క్రికెట్ ఆడటం కోసం ఆస్ట్రేలియాలో పర్యటించాల్సిన సమయంలోనే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. నేను దాదాపు ఏడేళ్లు వేచి చూశాను. సుమారు 40 టెస్టులకు బెంచ్‌కే పరిమితం అయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. టెస్టుల్లో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్నా. కానీ నేను క్యా్న్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అంతకు మించి నా ముందు మరో దారి లేకపోయింది’ అని యువీ వివరించాడు.

పునర్జన్మలా అనిపించింది..

‘2011-2012లో అమెరికాలో కీమో థెరపీ చేయించుకున్నా. అప్పుడు డాక్టర్ల మాటలు నాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. నేను క్యాన్సర్‌ను జయించి.. ఆరోగ్యంగా నడుచుకుంటూ ఆసుపత్రి నుంచి వెళ్లిపోతానని డా.ఐన్‌హార్న్ చెప్పారు. ఆ మాటలు నాకు బలాన్నిచ్చాయి. నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాక.. ఇకపై క్రికెట్ ఆడొచ్చని వారు చెప్పాక.. అది నాకు పునర్జన్మలా అనిపించింది’ అని యువీ వివరించాడు.

క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్‌ సింగ్‌ టీమిండియా తరఫున పలు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతడు కేవలం 35 బంతుల్లోనే 77* పరుగులు సాధించాడు. అలాగే వన్డేల్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ 150 పరుగులను ఇంగ్లాండ్‌పై కటక్‌ వేదికగా 2017లో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు. తర్వాత అదే సంవత్సరం వెస్టిండీస్‌ టూర్‌లో అతడు చివరిసారిగా మైదానంలో కనిపించాడు. అనంతరం 2019లో యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

 

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ…

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ

 

మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.

విజయవాడ, అక్టోబర్ 31: ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు (MLA Bonda Uma Maheshwar Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్‌ని జయించటం కోసం పోరాడుతోందన్నారు. క్యాన్సర్‌ని జయించాలంటే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని డయాగ్నెస్ చేస్తే చాలా వరకు క్యూరైపోయే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్‌మెంట్‌తో అనేక క్యాన్సర్లకి మందులు, వ్యాక్సిన్ కూడా వచ్చాయని.. దీన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బెస్ట్ క్యాన్సర్‌తో పాటు సర్వైవల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే సీఎం చంద్రబాబు (CM Chandrababu) కల అని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు. ఇన్నర్‌విల్ క్లబ్ వంటి సంస్థలు ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. వారు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఉచిత స్క్రీనింగ్ టెస్ట్‌లను కూడా అందిస్తున్నారని తెలియజేశారు.
ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఆడపిల్లలు, యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటివి చాలా ముఖ్యమన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version