ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్డు కాదని, అయితే బిహార్ లో ఓటర్గా పరిగణించేందుకు దాన్ని కూడా పరిగణనలోకి…
◆:- దాంతో ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందే
◆:- ఆధార్ సరైనదో కాదో తేల్చే హక్కు ఈసీకి ఉంది
◆:- కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం
◆:- ఆధార్ పౌరసత్వ గుర్తింపు కాదని స్పష్టీకరణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్డు కాదని, అయితే బిహార్‌లో ఓటర్‌గా పరిగణించేందుకు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకునే 11 డాక్యుమెంట్లకు అదనంగా 12వ డాక్యుమెంట్‌గా ఆధార్ కార్జును చేర్చాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా ఆధార్‌ను ఈసీ అధికారులు ఆమోదించడం లేదని ఆర్జేడీ, ఎంఐఎం ఇతర పార్టీలు పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్‌గా గుర్తించేందుకు ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా సమర్పించడాన్ని ఆమోదించాలని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కింది స్థాయిలో అధికారులంతా ఆధార్‌ను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆమోదించాలని ఆదేశాలు జారీ చేయాలని, తమ వెబ్‌సైట్‌లలో ఈ విషయం స్పష్టం చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అదే సమయంలో ఆధార్‌తో పాటు ఓటర్ సమర్పించిన డాక్యుమెంట్లు ఏవైనా సరైనవా కాదా తనిఖీ చేసే అధికారం ఈసీకి ఉన్నదని కోర్టు స్పష్టం చేసింది ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్జు కాదని ఆధార్ చట్టంలోనే ఉందని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ప్రకారం మనిషిని గుర్తించేందుకు అది ఉపయోగపడుతుందని తెలిపింది. ఆధార్ కార్డును కూడా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇచ్చిన హామీ పత్రాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది.
ఆధార్ ఓకే అంటే షోకాజ్ ఇచ్చారు
ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు మూడుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నియోజకవర్గ స్థాయి ఓటర్ల నమోదు అధికారులు(ఈఆర్‌వో), బూత్ స్థాయి అధికారులు ఆమోదించడం లేదని, బూత్ స్థాయి అధికారి ఆధార్‌ను అంగీకరించినందుకు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆర్జేడీ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆధార్ కార్డును ఆమోదించాల్సిందిగా ఇంతవరకూ ఈసీ తమ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేదీ వాదిస్తూ ఆధార్‌ను పౌరసత్వానికి రుజువుగా భావించలేమని చెప్పారు. కపిల్ సిబల్ స్పందిస్తూ, పౌరసత్వాన్ని గుర్తించే బాధ్యత ఈసీది కాదని అన్నారు. ఒక వ్యక్తి పౌరుడా కాదా అన్న విషయం నిర్ణయించే అధికారం ఈసీకి ఉన్నదని, ఈ విషయం స్పష్టం చేయాలని రాకేశ్ ద్వివేదీ సుప్రీంకోర్టును కోరారు. అయితే, ఈసీ కోరిన 11 డాక్యుమెంట్లలో పాస్‌పోర్టు, పుట్టినతేదీ సర్టిఫికెట్ తప్ప మిగతా వేవీ పౌరసత్వాన్ని ధ్రువీకరించవని న్యాయమూర్తి బాగ్చీ ఎత్తి చూపారు. వాదోపవాదాల తర్వాత చివరకు రేషన్ కార్డు, ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఆధార్‌ను 12వ డాక్యుమెంట్‌గా చేర్చి ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు రుజువుగా స్వీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే ఆధార్ కార్డు సరైనదో కాదో తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది.
జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన ఐదేళ్లు కఠిన శిక్ష
జహీరాబాద్ నేటి ధాత్రి:
జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50,000 వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు.. దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు. పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన. 50, వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు. తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికా కుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు. సీనియర్ జర్నలిస్టులు ఈతీర్పును ఆహ్వానించారు.అలాగే రాజకీయ నాయకుల నుండి ఒక్కింత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈతీర్పు. ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…
జహీరాబాద్ పట్టణం లోని ఎంపిడిఓ కార్యాలయం లో ఈ నెల 11 న గురువారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రతినిధులు తెలిపారు.
పట్టణం లోని మహేంద్ర లిమిటెడ్ లో 200 పోస్టులు ఖాళీగానే ఉన్నాయని పద వ తరగతి ఇంటర్ మరియు ఐ టి ఐ చేసి 18 సంవత్సరాలనుండి 25 వరకు వయస్సు గల వారు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరని అన్నారు.
సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సాహితీ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అందులో భాగంగా సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ యాస భాష మన కాళోజీ అని, నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన యోధుడని, కలం పట్టి ఖడ్గంగా మార్చిన మన కాళోజీ తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని రచించినటువంటి వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా సాహితీ సమితి ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాళోజి పై కవితను గానం చేశారు నిజాం తూటాలకు, కలం పట్టిన వీరుడని పొగిడారు. అలాగే బుర దేవానందం మాట్లాడుతూ కాళోజీ పై కవితను గానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోడం నారాయణ, దొంత దేవదాస్, అంకారపు రవి,ఎం.డి ఆఫీజ్, తదితర కవులు రచయితలు పాల్గొన్నారు.
షేఖపూర్ దర్గాలో సర్కార్ గంధం సమర్పణ, భక్తుల కోలాహలం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని షేక్ షాబుద్దీన్ దర్గా వద్ద సోమవారం రాత్రి సర్కార్ గంధం సమర్పించారు. పోలీస్ పటేల్ వారి ఇంటి నుండి డప్పు చప్పులతో ఒంటపై గంధాన్ని దర్గాలో సమర్పించారు. మంగళవారం వరకు ఖవ్వాలి పోటీలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.
ఈ జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దర్గాను చందర్ పూలమాలలు సమర్పించి వచ్చిన భక్తులు మొక్కులు చెలించుకొని ఫేతెహ మిఠాయి సమర్పించి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ప్రర్తించారు,
సైబర్ నేరాలకు అప్రమత్తతే రక్షణ కవచం : ఎస్సై బాలరాజు..
రామాయంపేట, సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
నేటి డిజిటల్ యుగంలో సాంకేతికతను ఆయుధంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను ఉచ్చు వేస్తున్నారని రామాయంపేట ఎస్సై బాలరాజు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రజలకు అప్రమత్తతే ప్రధాన రక్షణ కవచమని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, స్టాక్ మార్కెట్ మోసాలు, యూపీఐ మోసాలు, లోన్ ఫ్రాడ్లు, నకిలీ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు వంటి మోసపూరిత పద్ధతులు ప్రస్తుతం విస్తరించి ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ ఉచ్చులో పడుతున్నారని, ఆకర్షణీయమైన లాభాలు, సులభంగా డబ్బు సంపాదన వాగ్దానాలను నమ్మకూడదని సూచించారు.
“వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా పంపే APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ ఫోన్ మొత్తం నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లకు స్పందించరాదు. మొదట ఎక్కువ లాభాలు వస్తాయని చూపించి డబ్బు పెట్టించాక, తిరిగి రాబట్టడం అసాధ్యం అవుతుంది” అని ఎస్సై ఉదాహరణలు ఇచ్చారు. ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’ లోనే చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని బాలరాజు హితవు పలికారు. దానికి గాను జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయవచ్చని, లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ మోసాల నివారణకు పోలీసులు నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని, అయితే ప్రజలు స్వయంగా అప్రమత్తతతో వ్యవహరించడమే నిజమైన రక్షణ కవచమని ఎస్సై బాలరాజు స్పష్టం చేశారు.
ఎస్సి గర్ల్స్ హాస్టల్ కొత్త భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కృషి చేయాలి
హాస్టళ్లను పర్యవేక్షణ చేసిన యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటి సభ్యుడు రవి..
రామాయంపేట సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణ కేంద్రంలో ఉన్న పలు హాస్టళ్లను జిల్లా అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గుడికందుల రవి పర్యవేక్షణ చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని రవి మాట్లాడుతూ…. సమీకృత హాస్టల్ ఆవరణలో అవరి గోడ లేకపోవడం వల్ల బయట వ్యక్తులు హాస్టల్లోకి వెళ్లి బాత్రూం లు నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు.
సిగరెట్ల డబ్బాలు, అంబర్ వంటి పొట్లాలు మైదానంలో పడేసి వెళుతున్నారని అన్నారు కావునా అధికారులు అవరిగోడ నిర్మించాలని ఆయన కోరారు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ సమస్యలు పరిష్కరించే నాథుడే కరువయ్యాడనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శిధిల వ్యవస్థకు చేరిన హాస్టల్ కొత్త భవనం నిర్మించే దిశగా స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని ఆయన అన్నారు పట్టణ కేంద్రంలో ఇంటర్మీడియట్ డిగ్రీ అబ్బాయిలు హాస్టల్లో ఉందామంటే వారికి హాస్టల్ సదుపాయం లేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేద వ్యక్తం చేశారు గురుకుల హాస్టల్ సదుపాయాలకు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని ఆయన తెలియజేశారు కేజీబీవీ హాస్టల్లో నీటి కొరత తీర్చాలని. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ హాస్టల్లో అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని వారి సమస్యలు పరిష్కరించాలనీ అన్నారు జిల్లా కలెక్టర్ లాగా ప్రతి విద్యాధికారులు పర్యవేక్షణలో ఉండాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యు ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శేఖర్ నాయకులు మహేష్ పాల్గొన్నారు
పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళా జూనియర్ అసిస్టెంట్.
Suicide note of female employee
రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమా..?
Suicide note of female employee
నల్లబెల్లి, నేటిధాత్రి:
రాజకీయ నాయకుల ఒత్తిడితోనా లేక అధికారుల వేధింపుల వల్ల మనోవేదనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్యనికి పాల్పడ్డ మహిళా జూనియర్ అసిస్టెంట్ సంఘటన నల్లబెల్లి మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే నల్లబెల్లి తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్
Suicide note of female employee
అసిస్టెంట్ గా పనిచేస్తున్న కల్పన సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమె వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యనికి పాల్పడగా గమనించిన తోటి ఉద్యోగులు హుటా హుటిన మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై మండలంలో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ చర్చించుకుంటున్నారు. ఏది ఏమనప్పటికీ మండలంలోని వివిధ శాఖలో పనిచేస్తున్న అధికారులపై వేధింపులు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
-మంత్రిత్వ శాఖల నిర్వహణలో శీనన్నే టాప్ అని చెప్పిన సిఎం
-పదేళ్ల బిఆర్‌ఎస్‌లో ఆగిపోయిన అభివృద్ధి
-ఖమ్మం అభివృద్ధి పరుగులో పొంగులేటి చిత్తశుద్ధి
-ప్రజలకిచ్చిన మాట కోసం పొంగులేటి కృషి
-తెలంగాణ వచ్చినా నిన్నటి దాక అభివృద్ధికి ఖమ్మం ఆమడ దూరం
-ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం అందుకుంటున్న మొదటి స్థానం
-చికచక సాగునీటి ప్రాజెక్టులు
-ఊరూర ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు
-వాడ వాడలా సాగుతున్న అభివృద్ధి పనులు
-అవినీతి రహిత పాలనలో దేశానికే ఆదర్శం
-రెవెన్యూ సంస్కరణల్లో భూ భారతి ఒక విప్లవం
-రిజిస్ట్రేషన్ శాఖలో అనూహ్యమైన మార్పులు
-పేదలకు మెరుగైన సేవలకు రిజిస్ట్రేషన్ శాఖలు నిలయాలు
-ఖమ్మం అభివృద్ధికి మంత్రి పొంగులేటి పట్టుదల
-ఏడాదిన్నరలోనే ఖమ్మం ప్రగతి తోరణాలతో కళకళ
-ఖమ్మంతో పాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి శీనన్న కృషి
-ప్రతి ఏడాది 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
-ప్రతి గ్రామంలో ప్రతి పేదకు ఇల్లు
-ఐదేళ్ళలో విడతల వారిగా నిర్మాణాలు.
-ఖమ్మంలో తొలి విడత ఇండ్లకు గృహప్రవేశాలు
-తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సంబరాలు
హైదరాబాద్,నేటిధాత్రి: ప్రజా ప్రభుత్వం, సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పడుతున్న శ్రమతో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్నదే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఆయన వేసుకన్న ప్రణాళికలను అమలు చేస్తూ వున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. అటు మంత్రిగా రాష్ట్రాభివృద్ది, జిల్లా నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఖమ్మం జిల్లా అన్ని రంగాలలో ప్రగతిలో దూసుకుపోయేలా చేస్తున్నారు. ముఖ్యంగా గూడులేని నిరుపేదలు ఇండ్లు నిర్మించి ఇచ్చి తీరుతామన్న తన ఎన్నికల హమీని పక్కాగా అమలు చేస్తున్నారు. పేదల కళ్లలో ఆనందం నింపుతున్నారు. అన్ని జిల్లాల కంటే ముందుగా తన జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టిన నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అంతే వేగంగా తన జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వహస్తాలతో ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయించారు. ఏడాది కాలంలో ఆ ఇండ్లను పూర్తి చేసి మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదగా గృహ ప్రవేశాలు చేయించారు. అదీ నాయకుడిగా, ప్రజలకిచ్చిన హమీలు నేరవేర్చే ప్రజా ప్రతినిధి లక్ష్యమని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన చూసిన తమ జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలని ఇతర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు స్పూర్తిపొందేలా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన కితాబు ఎంతో విలువైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనకు కుడిభుజంగా వున్నారని అన్నారు. ఆయన పక్కన వుంటే కొండంత బలమున్నట్లేనే అని మంత్రి పొంగులేటిని సిఎం. కొనియాడారు. ఎందుకంటే మంత్రి పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న మంత్రిత్వ బాధ్యతల్లో ఆయన శాఖలు అన్నింటా ఫస్టు..బెస్ట్ అనిపించేలా పనిచేస్తున్నారు. గత బిఆర్‌ఎస్ హాయాంలో డబుల్ బెడ్ రూంలు ఇస్తామని చెప్పి ఊరించి, ఊరించి పదేళ్లపాటు ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు. ఒక్క ఇటుక పేర్చలేదు. అలాంటి కాలం నుంచి కాంగ్రెస్‌ను అదికారంలోకి తెచ్చి, ఖమ్మం జిల్లాలో అర్హులైన పేదలందిరకీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తున్నారు. గృహ నిర్మాణ మంత్రిగా కూడా పొంగులేటి శ్రీనివాస్ వుండడంతో ఇందిరమ్మ ఇండ్లపై ఎక్కువ దృష్టిపెట్టారు. ఈ ఐదేళ్ల కాలానికి 20లక్షలకు పైగా ఇ ందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం శరవేగంగా జరుతున్నాయి. అందులో చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు కూడా జరుపుకున్నాయి. ఈ దసరాకు చాలా వరకు పూర్తయి, గృహ ప్రవేశాలకు సిద్దంగా వున్నాయి. గత ప్రభుత్వంలాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంమాటలు చెప్పి తప్పించుకోలేదు. అందుకే తొలి ఏడాది బడ్జెట్‌లో రూ.22వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ఏడాది మొత్తం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపూరి చేయనున్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునే పేదలకు ఇంటి నిర్మాణ పూర్తిని బట్టి బ్యాంకుల్లో నేరుగా డబ్బులు వేస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే అటు ఇంటి నిర్మాణం,ఇటు బ్యాంకుల చుట్టూ ప్రజలు తిరగకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ప్రతి వారం డబ్బులు వేయడం అనేది గొప్ప విషయం. ఏ వారానికి ఆ వారం డబ్బులు చేతిలో వుంటే, ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పులు చేయాల్సిన అవసరం వుండదు. పైగా ఇంటి నిర్మాణం ఒక్క రోజు కూడా ఆగిపోదు. వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం కల్గుతుంది. ఇలా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయలేదు. గత బిఆర్‌ఎస్ పాలకులు అసలే చేయలేదు. డబుల్ బెడ్‌రూంలు నిర్మాణం చేసి ఇస్తామని 2014,2018 ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు. కాని ఇండ్లు నిర్మాణం చేపట్టలేదు. తర్వాత అప్పార్టుమెంట్లు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. ఆ మాటను కేసిఆర్ తప్పారు. ఏ రకంగా ఇండ్లను ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తీరా గత ఎన్నికల సమయంలో సొంత స్థలం వున్నవారికి రూ.5లక్షలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. దానిని ప్రజలు నమ్మలేదు. పదేళ్లలో పది ఇండ్లు కట్టని బిఆర్‌ఎస్‌కు ఎన్నికలప్పుడే డబుల్ బెడ్‌రూంలు గుర్తొస్తాయని ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిందంటే ఖచ్చితంగా ఇండ్లు ఇస్తుందని బలంగా నమ్మారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేదలందిరకీ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. ఆ సమయంలో తెలంగాణలో 25లక్షల ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో రేవంత్ సర్కారు ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొదటి విడతలో ఇండ్లు రాని వారు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇంకా నాలుగేళ్ల కాలం వుంది. విడతలవారిగా ఇచ్చే ఇండ్లలో ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు హమీ ఇచ్చారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లతోపాటు, ఆయన నిర్వహిస్తున్న రెవిన్యూ శాఖలో కూడ అనేకు మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. ప్రజాపాలన ప్రజలకు మరింత చేరువ చేశారు. గత ప్రభుత్వ హాయాంలో తీసుకొచ్చిన ధరణి మూలంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నీ తీర్చేందుకు భూ బారతీ తెచ్చారు. ప్రజల సమస్యలు తొలగించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమల రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు పడకుండా చేశారు. ధరణి మూలంగా కొన్నిలక్షల మంది సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని ఎంత చెప్పినా కేసిఆర్ వినిపించుకోలేదు. ప్రజల బాధలు పట్టించుకోలేదు. దాంతో రెవిన్యూ వ్యవస్ధలో అప్పుడు పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. నాయకులు పంచుకొని తినడానికి ధరణి బిఆర్‌ఎస్‌కు ఉపయోపడిరది. కాని ఇప్పుడు భూ భారతి మూలంగా ఏ ఒక్కరికీ ఇబ్బంది రాదు. నష్టం కలగదు. అవినీతికి ఎక్కడా తావులేదు. ఏ ఒక్క అదికారి అవినీతికి పాల్పడిని ప్రజా ప్రభుత్వం ఉపేక్షించడం లేదు. ఎంతో మంది అవినీతి అదికారులను జైలుకు పంపించారు. అవినీతిని ఇంతగా అంతం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. దేశంలోనే ఇంతలా అవినీతిని కంట్రోల్ చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు. అంతగా అవినీతి నిర్మూలన జరుగుతోంది. అది కేవలం రెవిన్యూలోనే కాదు, అన్ని శాఖల్లో అమలు జరుగుతోంది. అవినీతి రక్కసి పారిపోతోంది. ఇక రిజిస్ట్రేషన్ శాఖలో కూడా సమూల మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకే దగ్గర అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల సముదాయం ఏర్పాటు చేశారు. దాంతో ప్రజలకు ఎలాంటి అసౌక్యం కలగకుండా పోయింది. అవినీతి అనే పేరు వినపడకుండా చేసిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికే దక్కింది. ఇలా తన శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తూనే మరో వైపు ఖమ్మం జిల్లా ప్రగతిని బాటలువేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సాగు విస్తరణ, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరిపిస్తున్నారు. ఖమ్మ జిల్లాను అన్నపూర్ణగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి పొంగులేటి చొరవతో తెలంగాణలో పదేళ్ల తర్వాత సుమారు ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. పేదలకు సన్న బియ్యం అందేలా చేస్తున్నామని పొంగేలేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇలా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ చేస్తూ ముందుకు సాగుతుండడంతో, మంత్రుల్లో ఆయననే ఫస్ట్ , బెస్ట్ అనే కితాబు అందుకుంటున్నారు. మిగతా మంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకొని అభివృద్ది పనులు వేగ వంతంచేస్తున్నారు. దటీజ్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని కొనియాడబడుతున్నారు.
బాలానగర్ మండలంలోని చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి, గౌతాపూర్, వనమోనిగూడ, పెద్దాయపల్లి తదితర గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ఇటీవలే సర్వే నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేయడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాలానగర్ తాహాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ.. తహాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో భూములు ఇవ్వబోమని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాము సన్న కారు రైతులమని, తమ జీవనాధారం వ్యవసాయ పొలమేనని, భూములను కోల్పోతే తాము ఉపాధిని కోల్పోతామన్నారు. నిరక్షరాసులైన తాము వ్యవసాయం తప్ప మరో పని చేయలేమన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మరో ప్రాంతం నుంచి ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రచించాలన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాల శుద్ధి కార్యక్రమం
ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మారావుపేటలొ ఆదివారం చంద్రగ్రహణం కారణగా ఆలయాల మూసిన సందర్బంగా తిరిగి సోమవారం శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాలు శుద్ధి కార్యక్రమం.
దేవత మూర్తులను గ్రామ దేవతలకు పవిత్ర గంగా నది జలలతో స్నానాలు జరిపించడం జరిగిందని అర్చకులు రాజేందర్ సంప్రోక్షణ చేసి దూప దీప నైవేద్యలతో యధావిధిగా పూజ కార్యక్రమాలు పునః ప్రారంభం చేశారని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ అన్నారు..ఈ కార్యక్రమంలొ సమితి సభ్యులు వాల నర్సింగరావు దూలం శంకర్ ఆకుల దామోదర్ బెతి రవీందర్ రెడ్డి గందే ప్రకాష్ సింగం రాజవిరు ఎల్లంకి శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు
అమ్మో.. కస్తూర్బా గాంధీ.. ఆకస్మిక తనిఖీల్లో షాకైన అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ కోసం పలు రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, కింది స్థాయి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణం, గదులు, మరుగుదొడ్లు, వంట గది ఉన్నాయి. ఆకస్మిక తనిఖీ కి వచ్చిన అధికారులే అక్కడి సమస్యలను చూసి అవాక్కయ్యారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు, ఎంపీడీవో మంజుల, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామారావు, సాయికిరణ్ సిబ్బందితో కలిసి పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నిర్వహణ లోపం ఉండడం తో పాఠశాల ప్రత్యేక అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు జ్వరాలు వచ్చినా ఎందుకు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తూ అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. అధికారులు పాఠశాల వంటగదిని పరిశీలించగా ఎలుకలు కొరికిన టమాటాలు, కుళ్లిపోయ
వనపర్తి జిల్లాలో అటవీ శాఖ భూములలో నిర్మాణాలు ఇతరులకు అప్పగించారాదు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లాలో అటవీ భూమిలో ప్రభుత్వం ద్వారా ఏమైనా అసైన్మెంట్ చేసి ఉంటే అట్టి భూమిని గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ తో సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ గెజిట్ ప్రాకారం అదేవిధంగా సెక్షన్ 4 ప్రకారం గుర్తించిన అటవీ శాఖ భూమిలో ఎలాంటి నిర్మాణాలు ఇతరులకు అప్పగించడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు వనపర్తి జిల్లాలోని అటవీ భూమినీ ఎక్కడైనా పొరపాటున అసైన్మెంట్ చేసి ఉంటే అ భూమిని సర్వే నెంబరుతో గుర్తించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కమిటీలో ఫారెస్ట్ అధికారి ఆర్డీఓ ఎ.డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ తహసిల్దార్ తో కమిటి ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి ఆర్డీఓ సుబ్రమణ్యం ఎ .డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ, ఆర్ అండ్ బి అధికారి పాల్గొన్నారు
ఝరాసంగం మండల్ లోని ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయ బృందాన్ని జహీరాబాద్ ట్రస్మ తరఫున ఉపాధ్యాయులందరినీ సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఉపాధ్యాయులందరిని సన్మాన సత్కారము జరుపబడుతుంది అదేవిధంగా ఈసారి కూడా ప్రతి పాఠశాల ఐదుగురు ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ లను సన్మాన సత్కారము చేయబడింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్దలు ట్రస్మా ప్రెసిడెంట్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్ ల కరస్పాండెంట్లు విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ నాగన్న అక్షర భారతి కరస్పాండెంట్ శ్రీనివాస్ మరియు హాని టెక్నో పాఠశాల కరస్పాండెంట్ శరణప్ప ట్రస్మా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి మోహన్ రెడ్డి దశరథ్ రెడ్డి మరియు సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,
•అనుమతులు నిల్..కన్స్ట్రక్షన్స్ ఫుల్ * కమ్మెట పంచాయతీ కార్యదర్శి ఫెయిల్యూర్ * పంచాయతీ కార్యదర్శి పై చర్యలేవి. * పత్రిక కథనాలకు స్పందించని కార్యదర్శి, ఎంపీఓ •111లో వెలుస్తున్న రోజుకొక్క అక్రమ నిర్మాణం * పిర్యాదు చేసి 30 రోజులైనా చర్యలు శూన్యం * నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న పంచాయత్ రాజ్ అధికారులు
చేవెళ్ల,నేటిధాత్రి:
111జీవో ప్రాంతంలో పలువురు భవనాలు కడుతున్నారు? ఎవరి అండ చూసుకుని వీరంతా రెచ్చిపోతున్నారు? హెచ్ఎండీఏ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు కడుతుంటే.. అధికారులేం చేస్తున్నారు? 111 జీవో ప్రాంతాల్లో అక్రమ నిర్మాణల్ని కడుతున్న విషయం అధికారులకు తెలియదా? తెలిసినా, తెలియనట్లు నటిస్తున్నారా?అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయకుండా పంచాయతీరాజ్, హెచ్ఎండిఎ అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.
* అనుమతులు నిల్… కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఫుల్.
ఈ బిల్డింగ్ నిర్మాణానికి హెచ్ఎండిఏ నుండి ఇలాంటి అనుమతులు లేవని, నిర్మాణం ఆపాలంటూ గతంలోనే 3 నోటీసులు ఇచ్చామని కమ్మెట పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఇచ్చిన నోటీసులు బేఖాతరు చేస్తూ అనుమతులు లేకుండానే దర్జాగా జి+3 భవన నిర్మాణం చేపడుతున్నారని, నోటీసులను బేఖాతరు చేస్తూ ఈ బిల్డింగ్ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్, జి ప్లస్ వన్ లో కమర్షియల్ షెటర్స్ నిర్మిస్తున్నారు. ఈ భవనాలు ఎనికెపల్లి ప్రధాన చౌరస్తా కావటంతో భారీగా అద్దె పర్పస్ కమర్షియల్ షెటర్లను నిర్మిస్తున్నారు. నిర్మాణాలకు గ్రామపంచాయతీ కార్యదర్శి అండ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడో నోటీస్ ఇచ్చామని చెబుతున్న పంచాయతీ కార్యదర్శి మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కమ్మెట, ఎనికేపల్లి త్రిబుల్ వన్ జీవోలోనే ఉన్నాయి. కమ్మెట గ్రామపంచాయతీ పరిధిలో నిత్యం అక్రమ నిర్మాణాల జోరు కొనసాగు తుంది. నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన పంచాయతీ కార్యదర్శి, మండలపంచాయతీ అధికారి, అక్రమ చర్యలపై చేతులేత్తేశారు.
* అక్రమాలకు ఊతమిస్తున్న అధికారులు
ముడిమ్యాల, గొల్లపల్లి, రావులపల్లి, మల్కాపూర్ గ్రామాలతో పాటు కమ్మెట రెవెన్యూపరిధిలోని 111జీవోలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై వెలువడుతున్న వార్త పత్రిక కథనాలకు పంచాయతీరాజ్ అధికారులు స్పందించడం లేదు. గతంలో జరిగిన నిర్మాణాలు పక్కన పెడితే, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల కమర్శియల్ అక్రమ నిర్మాణాలపై ఇసుమంత చర్యలు చేపట్టలేదు. అక్రమ నిర్మాణాలకు అధికారులే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహి స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి గతంలో ఎప్పుడో నోటిసులు ఇచ్చినవే తప్పితే మళ్లీ అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. కమ్మెట పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారులు ఫెయిల్యూర్ అయ్యారు.కమ్మెట పరిధిలో111జీవోలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు నిస్సహాయత తీరుపై విమర్శలకు దారితీస్తుంది. మండల ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
శ్రీనివాస్ రెడ్డి. కమ్మెట పంచాయతీ సెక్రెటరీ
కమ్మెట రెవెన్యూ పరిధిలో111జీవోలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలకు పంచాయతీ నుండి ఇలాంటి అనుమతులు, ఇంటినెంబర్ ఇవ్వబడదు. ఇప్పటికే నోటీసులు ఇచ్చాము. ఈ విషయాన్నీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నత అధికారుల ఆదేశాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో నాణ్యత ప్రమాణాలు పాటించడం జరుగుతుంద ని రాష్ట్ర పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్.ఐజి రమేష్ రెడ్డి తెలిపారు రాజపేట గ్రామ శివారులో వనపర్తి పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బాంక్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పెట్రోల్ బాంక్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్ల ఎస్పీ రావుల గిరీదర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఓ సి ఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు
పరకాల అభివృద్ధి ప్రధాత చల్లా కు జన్మదిన శుభాకాంక్షలు
16వ డివిజన్ లో చల్లా జన్మదిన వేడుక నిర్వహించిన స్థానిక కార్పొరేటర్.
కాశిబుగ్గ నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం లో పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గా నిరంతరం కృషి చేశారని,వారి పట్టుదలతో మండలానికి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వచ్చిందని,డివిజన్ వ్యాప్తంగా ధర్మారెడ్డి కృషితోనే అభివృద్ధి జరిగిందని,పరకాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న చల్లా ధర్మారెడ్డి రాబోయే రోజుల్లో మళ్ళీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరకాల ప్రజలకు సేవ చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ గోలి రాజయ్య,డివిజన్,గ్రామ అధ్యక్ష కార్యదర్శులు,బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లంబాడి లపై అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదు
◆:- లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ పవర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి గోపాల్ పవర్ మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే ఈ దేశ ములనివాసులు భారత దేశ స్వాతంత్రానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందినము, 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు, 1931 లో నిజాం రాజులు చేపట్టిన కులగణన లో బంజారా లంబాడిలను గిరిజనుల పట్టికలో చూపించారు 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్టం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని లంబాడిలు, సుగాలిలను భారత పార్లమెంట్ ఉభయశభల ఆమోదం తో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఆర్డర్ – 1956 ప్రకారం గిరిజనులుగా గుర్తింపు పొంది గిరిజన జాబితాలో సీరియల్ నెంబర్ 19 గా చేర్చాబడ్డారు అయితే ఒకే రాష్టంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజన లంబాడిలను సుమారు 25 సమ త్సరాలు గిరిజన జాబితాలో చేర్చకపోవడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ లంబాడిలను ఘోరమైన అన్యాయం చేసింది అని అన్నారు,1969 కే చందా అధ్యక్షతన వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారి నెత్రు త్వంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభ ల ఆమోదం తో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) యాక్ట్ 1976 (యాక్ట్ no 108 of1976)తేదీ :సెప్టెంబర్ 19, 1976 చట్టం చేసి తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడిలను గిరిజన జాబితాలో స
క్రమ సంఖ్య 29 గలో చేర్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ గారు గత శాసన సభ ఎన్నికల్లో లంబాడిల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ తాను గద్దెనెక్కనని అనేక సభలలో ప్రకటించారు. కానీ 2017 లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో హింసత్మక ఘటనకు పాల్పడిన సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లను కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకున్నారు. తేదీ 24/07/2025 నా వీరిద్దరూ లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలని రిట్ ఫిటిషన్ దాఖాలు చేశారు.ఇది కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమే జరిగిందా..? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లంబాడిలకు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై బి ఆర్ ఎస్, బీజేపీ ల వైఖరి కూడా ఎటువైపో..? సమాధానం చెప్పాలి అని అన్నారు ఈ కార్యక్రంలో జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు,
గణపురం మండల కేంద్రంలో పురాతన దేవాలయంలో శ్రీ నాగ లింగేశ్వర స్వామి రెడ్డి గుడి దేవాలయం వద్ద నిన్న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసి వేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు తెరిచి ఆలయ అర్చకులు భద్రమయ్య సంప్రోక్షణ పూజ జరిపించి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి దాత దూలం కుమార్ గౌడ్ శ్రీదేవి దంపతులు స్వామివారికి నిత్య దీపారాధన చేసే దీపాంతలను 2500 ఆలయ అర్చకునికి అందించడం జరిగింది ఆ దంపతులకు స్వామివారి కృప క్రెటాక్షణ ఉండాలని ఆశిస్తూ ఆలయ కమిటీ
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.