ట్రస్మా జహీరాబాద్ అధ్యక్షులుగా కే శ్రీశైలం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ట్రస్మా( తెలంగాణ రికగ్నైజేడు స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్యక్షులుగా కె. శ్రీశైలం( శ్రీ నారాయణ హై స్కూల్ ప్రిన్సిపాల్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రాత్రి శ్రీ నారాయణ హై స్కూల్ లో ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో జహీరాబాద్ అధ్యక్షులుగా కె. శ్రీశైలం, కోశాధికారులుగా కె. శేఖర్ రెడ్డి (సిద్ధార్థ హై స్కూల్ ప్రిన్సిపాల్) ఎండి అసిఫ్ (సన హైస్కూల్ ప్రిన్సిపల్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ అన్ని పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు రాఘవేందర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, జహీరాబాద్ మాజీ అధ్యక్షులు జి మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి మరియు అన్ని పాఠశాలల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు,
