ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్..

ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్

సీ ఎం కార్యలయము ప్రజా వాణి నుండి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కార్యాలయంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తులను కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వకరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి లో 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ ప్రజాభవన్ నుండి ప్రజావాణిలో వచ్చిన, దరఖాస్తులు పరిష్కరించాలని జిల్లా లో ని అధికారులను కలెక్టర్ ఆదేశించారు

వనపర్తి జిల్లా లో మరుగుదొడ్లు లేని పాఠశాలలకు నిర్మాణం చేపట్టాలి..

వనపర్తి జిల్లా లో మరుగుదొడ్లు లేని పాఠశాలలకు నిర్మాణం చేపట్టాలి

కలెక్టర్ అధికారులుకు ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి .

 

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని, మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో నిర్మాణం చేపట్టే విదంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అంగన్వాడీల్లో తాగునీటి వసతి, పై అదనపు కలెక్టర్ యాదయ్య తో కలిసి సంబంధితఅధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల సౌకర్యం లేని పాఠశాలల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద టాయిలెట్స్ మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు త్వరగా చేపట్టాలని కోరారుఅదేవిధంగా జిల్లాలోని 35 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కోసం చేపట్టిన పనులపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు కేవలం 9 అంగన్వాడీల్లో మాత్రమే తాగునీటి వసతికి పనులు పూర్తి చేసినట్లు, ఇంకా 26 అంగన్వాడీల్లో పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పగా ఆయా పనులని జనవరి మొదటి వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు ఈసమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని ఉమాదేవి, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాజపేట దగ్గర పెట్రోల్ పంపు ప్రారంభోత్సవంలో ఐజీ…

రాజపేట దగ్గర పెట్రోల్ పంపు ప్రారంభోత్సవంలో ఐజీ

పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగింది

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో నాణ్యత ప్రమాణాలు పాటించడం జరుగుతుంద ని రాష్ట్ర పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్.ఐజి రమేష్ రెడ్డి తెలిపారు
రాజపేట గ్రామ శివారులో వనపర్తి పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బాంక్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పెట్రోల్ బాంక్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్ల ఎస్పీ రావుల గిరీదర్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఐ ఓ సి ఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version