111జీవోలో ఆగని అక్రమ నిర్మాణాలు
•అనుమతులు నిల్..కన్స్ట్రక్షన్స్ ఫుల్
* కమ్మెట పంచాయతీ కార్యదర్శి ఫెయిల్యూర్
* పంచాయతీ కార్యదర్శి పై చర్యలేవి.
* పత్రిక కథనాలకు స్పందించని కార్యదర్శి, ఎంపీఓ
•111లో వెలుస్తున్న రోజుకొక్క అక్రమ నిర్మాణం
* పిర్యాదు చేసి 30 రోజులైనా చర్యలు శూన్యం
* నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న పంచాయత్ రాజ్ అధికారులు
చేవెళ్ల,నేటిధాత్రి:
111జీవో ప్రాంతంలో పలువురు భవనాలు కడుతున్నారు? ఎవరి అండ చూసుకుని వీరంతా రెచ్చిపోతున్నారు? హెచ్ఎండీఏ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు కడుతుంటే.. అధికారులేం చేస్తున్నారు? 111 జీవో ప్రాంతాల్లో అక్రమ నిర్మాణల్ని కడుతున్న విషయం అధికారులకు తెలియదా? తెలిసినా, తెలియనట్లు నటిస్తున్నారా?అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయకుండా పంచాయతీరాజ్, హెచ్ఎండిఎ అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.
* అనుమతులు నిల్… కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఫుల్.
ఈ బిల్డింగ్ నిర్మాణానికి హెచ్ఎండిఏ నుండి ఇలాంటి అనుమతులు లేవని, నిర్మాణం ఆపాలంటూ గతంలోనే 3 నోటీసులు ఇచ్చామని కమ్మెట పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
ఇచ్చిన నోటీసులు బేఖాతరు చేస్తూ అనుమతులు లేకుండానే దర్జాగా జి+3 భవన నిర్మాణం చేపడుతున్నారని, నోటీసులను బేఖాతరు చేస్తూ ఈ బిల్డింగ్ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్, జి ప్లస్ వన్ లో కమర్షియల్ షెటర్స్ నిర్మిస్తున్నారు. ఈ భవనాలు ఎనికెపల్లి ప్రధాన చౌరస్తా కావటంతో భారీగా అద్దె పర్పస్ కమర్షియల్ షెటర్లను నిర్మిస్తున్నారు. నిర్మాణాలకు గ్రామపంచాయతీ కార్యదర్శి అండ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడో నోటీస్ ఇచ్చామని చెబుతున్న పంచాయతీ కార్యదర్శి మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కమ్మెట, ఎనికేపల్లి త్రిబుల్ వన్ జీవోలోనే ఉన్నాయి. కమ్మెట గ్రామపంచాయతీ పరిధిలో నిత్యం అక్రమ నిర్మాణాల జోరు కొనసాగు తుంది. నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన పంచాయతీ కార్యదర్శి, మండలపంచాయతీ అధికారి, అక్రమ చర్యలపై చేతులేత్తేశారు.
* అక్రమాలకు ఊతమిస్తున్న అధికారులు
ముడిమ్యాల, గొల్లపల్లి, రావులపల్లి, మల్కాపూర్ గ్రామాలతో పాటు
కమ్మెట రెవెన్యూపరిధిలోని 111జీవోలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై వెలువడుతున్న వార్త పత్రిక కథనాలకు పంచాయతీరాజ్ అధికారులు స్పందించడం లేదు. గతంలో జరిగిన నిర్మాణాలు
పక్కన పెడితే, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల కమర్శియల్ అక్రమ నిర్మాణాలపై ఇసుమంత చర్యలు చేపట్టలేదు. అక్రమ నిర్మాణాలకు అధికారులే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహి స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి గతంలో ఎప్పుడో నోటిసులు ఇచ్చినవే తప్పితే మళ్లీ అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. కమ్మెట పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారులు ఫెయిల్యూర్ అయ్యారు.కమ్మెట పరిధిలో111జీవోలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు నిస్సహాయత తీరుపై విమర్శలకు దారితీస్తుంది. మండల ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
శ్రీనివాస్ రెడ్డి.
కమ్మెట పంచాయతీ సెక్రెటరీ
కమ్మెట రెవెన్యూ పరిధిలో111జీవోలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలకు పంచాయతీ నుండి ఇలాంటి అనుమతులు, ఇంటినెంబర్ ఇవ్వబడదు. ఇప్పటికే నోటీసులు ఇచ్చాము. ఈ విషయాన్నీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నత అధికారుల ఆదేశాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.