భూములు కోల్పోతే.. మా బతుకులు ఆగం.. ఆగం….

భూములు కోల్పోతే.. మా బతుకులు ఆగం.. ఆగం

“ఆర్ఆర్ఆర్ కు.. మేము భూములు ఇవ్వం”

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

బాలానగర్ మండలంలోని చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి, గౌతాపూర్, వనమోనిగూడ, పెద్దాయపల్లి తదితర గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ఇటీవలే సర్వే నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేయడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాలానగర్ తాహాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ.. తహాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో భూములు ఇవ్వబోమని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాము సన్న కారు రైతులమని, తమ జీవనాధారం వ్యవసాయ పొలమేనని, భూములను కోల్పోతే తాము ఉపాధిని కోల్పోతామన్నారు. నిరక్షరాసులైన తాము వ్యవసాయం తప్ప మరో పని చేయలేమన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మరో ప్రాంతం నుంచి ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రచించాలన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

రైతులను ఇబ్బంది పెట్టవద్దు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్…

రైతులను ఇబ్బంది పెట్టవద్దు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

 

కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం పరిసర గ్రామాల రైతుల పొలాలగుండా 765 పవర్ గ్రిడ్ హైటెన్షన్ లైన్ ను ఎలాంటి సమాచారం లేకుండా 1200 వందల మంది రైతులకు నష్టం కలిగించే విధంగా తీసుకెళ్తున్న పవర్ గ్రిడ్ లైన్ పనులు ఆపాలని బాధిత రైతులు కడ్తాల్ లో ధర్నా నిర్వహిస్తున్నారు. వారికి సంఘీభావంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేహాజరయ్యారు.ఈసందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ..ప్రభుత్వం అప్రజాస్వామికంగా రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిరుపేద సన్న, చిన్నకారు రైతుల పొలాలగుండా 765 పవర్ గ్రిడ్ లైన్ తీసుకెళ్లడం అన్యాయమని, బజారునపడే దుస్థితి వస్తుందని, గత కొన్ని నెలలుగా ఈవిషయం ముఖ్యమంత్రికి తప్ప మిగతా అధికారపార్టీ నాయకులకు, అధికారులకు నివేదించినప్పటికీ స్పందనలేదని, అధికారులు పట్టించుకోని ఈ సమస్యను వెంటనే తీర్చాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో బాధిత రైతులు, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్ రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ సులోచన, సాయిలు గ్రామ బీ ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ,రాఘవేందర్, నరసింహ, వెంకటేష్,అంజి,మనీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version