దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం…

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రి

 

 

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య ఆదేశాలమేరకు
దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించిన
మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ
ములుగు జిల్లా మంగపేట మండలం పెరకలకుంట గ్రామం లో నిరుపేద కుటుంబంకు చెందిన మడకం నరెందర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ పరామర్శించి మనోధైర్యం కల్పించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు.ఇలాంటి సంధర్బంలోనే ధైర్యంగా ఉండాలని అన్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి దశదిన కర్మలకు 50 కేజీ ల బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5వార్డు యాదవ కాలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును ఇటీవల కోరడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీవాసుల కోరిక మేరకు నూతన విద్యుత్ స్తంభాలు విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలను వేయించడం జరిగింది అలాగే సీట్ లైట్లను ఏర్పాటు చేసి వాటిని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను కావున భూపాలపల్లి ప్రజలు ఆలోచించి రాబోవు మున్సిపల్ ఎన్నికలలో 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లిని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇండ్లు రైతులకు సన్నబడ్లకు 500 బోనసు ఇలా అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు కావున ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉడత సరోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ విజయ్ ఉడత మహేందర్ కాలనీవాసులు పాల్గొన్నారు

క్వార్టర్ స్థలం ఇప్పించి న్యాయం చేయాలి.

క్వార్టర్ స్థలం ఇప్పించి న్యాయం చేయాలి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

గత 20 సంవత్సరాలుగా, నివాసం ఉంటున్న క్వార్టర్ను, కూల్చివేసి, ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న దోనుగు లక్ష్మీపై చర్యలు తీసుకొని, నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని సంబంధిత అధికారులు ఆపాలని, బొడ్డేల శంకర్ డిమాండ్ చేశారు.
సోమవారం బెల్లంపల్లి టేకుల బస్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
బూడిదగడ్డ బస్తీలోని క్వార్టర్ నంబర్ 290 లో, దోనుగు లక్ష్మి భర్త పదవి విరమణ చేసి, క్వార్టర్ కాళీ చేసి గోదావరిఖని వెళ్లి పోయి నివసిస్తున్నారని, అనంతరం వేరే వారి పేరుపై క్వార్టర్ను చేయించి, మా అన్న తో సహా గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, మా అన్న మరణించిన అనంతరం నేను ఒక్కడినే క్వార్టర్ లో ఉంటున్నానని, ఇరవై ఏళ్ళ క్రితం సింగరేణికి అప్పజెప్పి గోదావరిఖని లో నివాసముంటున్న దొణుగు లక్ష్మి అనే మహిళ, ఆమె ఇల్లు ఆమెకు ఉండగా, నా ఇంటిపై ఆశతో అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతూ, పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, నిర్దాక్షిణ్యంగా నా ఇంటిని పోలీసుల పహారాలో జేసీబీ తో కూల్చివేసి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుందని వాపోయాడు. నాకు వెనకా ముందు ఎవ్వరూ లేకపోవడంతో, నన్ను వేధింపులకు గురి చేస్తూ, నన్ను పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారనీ, ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు గొడవలు సద్దుమణిగే వరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాన్ని ఆపివేయాలని ఆదేశించినా, స్థానిక మున్సిపల్ అధికారులు లక్ష్మి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. సంబంధిత అధికారులు తమకు క్వార్టర్ స్థలాన్ని ఇప్పించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
తమకు న్యాయం చేయకుంటే అదే స్థలంలో ఆత్మహత్య చేసుకుంటానని, దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించాడు..

మద్యపాన నిషేధ ఆమోద తీర్మానం…

మద్యపాన నిషేధ ఆమోద తీర్మానం..

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

గ్రామంలో మద్యపానాన్ని నిషేధించి తీర్మానం చేసి స్థానిక ఎస్సై కి అందజేశారు. నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేసి స్థానిక ఎస్ఐ రాజేష్ కి సర్పంచ్ మంగిలిపల్లి మంజుల రమేష్ తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు నడిపిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వర్ణలత రాములు, పాలకవర్గ సభ్యులు మంగిలి పల్లి యాదగిరి, దొమ్మాట రాజు, ఆంబోతు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

14 ఏళ్ల బాలుడు రాజ్యాంగం చేతపట్టుకొని ప్రశ్నిస్తున్న అశ్వమిత్ గౌతం…

14 ఏళ్ల బాలుడు రాజ్యాంగం చేతపట్టుకొని ప్రశ్నిస్తున్న అశ్వమిత్ గౌతం

భూపాలపల్లి నేటిధాత్రి

 

సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14 ఏళ్ల కుర్రాడి ప్రశ్నలకు భయపడుతోందా?
ప్రశ్న అడగడం నేరమైపోయిన రోజుల్లో
నిజం మాట్లాడటం తిరుగుబాటుగా మారిన కాలంలో
ఒక 14 ఏళ్ల బాలుడు రాజ్యాంగం చేత పట్టుకుని
వ్యవస్థనే నిలదీస్తున్నాడు! మోడీ, యోగి సర్కార్ జవాబు చెప్పలేక పోతుందా?
ఆటబొమ్మలు చేతిలో ఉండాల్సిన వయసులో
అతని చేతిలో ఉంది అంబేడ్కర్ పుస్తకం.
కార్టూన్లు చూడాల్సిన కళ్లలో కనిపిస్తున్నాయి సమాజంలోని అసమానతలు. అతడి పేరు అశ్వమిత్ గౌతం. లక్నోకు చెందిన ఒక సాధారణ బాలుడు.కానీ అతని ఆలోచనలు మాత్రం
సాధారణ వ్యవస్థలకు అస్సలు నచ్చని అసాధారణమైనవి.
చేతిలో తుపాకీ లేదు. గొంతులో విద్వేషం లేదు.
నోట్లో బూతులు లేవు. కానీ అతని దగ్గర ఉంది
ఒక అత్యంత ప్రమాదకరమైన ఆయుధం –
ప్రశ్న.
తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా
రాజ్యాంగం ఏమంటుందో చెబుతున్నాడు.
హక్కులు అంటే ఏమిటో వివరిస్తున్నాడు.
చరిత్రను వర్తమానంతో పోలుస్తున్నాడు.
“ఎందుకు ఇలా జరుగుతోంది?” అని నిలదీస్తున్నాడు.
అంతే… దోపిడి చేసే, పెట్టుబడి దారుల కొమ్ము కాసే వ్యవస్థ ఉలిక్కిపడింది. ప్రభుత్వానికి నిద్రపట్టలేదు.
చిన్నోడిని చర్చించాల్సింది పోయి చట్టంతో బెదిరించాలనుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రశ్న అడిగితే కేసులు?
ఆలోచిస్తే నేరం? చదివితే ప్రమాదం?
ఈ దేశంలో లక్షల మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు
కులాల గొప్పలు చెబుతూ బూతులు తిడుతూ
వ్యవస్థకు భజన చేస్తూ మిలియన్ల వ్యూస్ సంపాదిస్తారు. వాళ్లకు అవార్డులు. వాళ్లకు గుర్తింపు. వాళ్లకు ప్రోత్సాహం. కానీఒక పేద బాలుడు నిజం మాట్లాడితే మాత్రం అతనిపై కేసులు. అతనికి విచారణ. అతనిని భయపెట్టే వ్యవస్థ.
ఇది న్యాయమా? లేదా ఇది భయపడే పాలనా?
అశ్వమిత్ ఎక్కడా ద్వేష ప్రసంగం చేయలేదు.
ఎవరినీ రెచ్చగొట్టలేదు. కేవలం పుస్తకాలలో ఉన్న మాటలే చెప్పాడు. రాజ్యాంగంలో ఉన్న హక్కులే గుర్తు చేశాడు. అంతే. అదే అతడు చేసిన “నేరం”.
భగత్ సింగ్ తుపాకీతో లేడు. అంబేడ్కర్ ఖడ్గంతో లేడు. కలాం బాంబులతో లేడు.
వాళ్లందరికీ ఉన్నది ఒక్కటే – ఆలోచన.
ఈ రోజు ఆ ఆలోచన రూపమే అశ్వమిత్.
భయపెడితే ఆలోచనలు ఆగవు. కేసులు పెట్టితే ప్రశ్నలు చనిపోవు. ఎంత నొక్కితే అంతే బలంగా
ధిక్కారపు మొక్క మొలుస్తుంది.
అశ్వమిత్ గౌతం ఒక వ్యక్తి కాదు.
ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వాద సంకేతం
పేద వర్గాల చైతన్యానికి ప్రతిరూపం.
రాబోయే తరాల ప్రశ్నల స్వరం.
అతని గొంతుకు అండగా నిలబడటం అంటే
ఒక బాలుడిని కాపాడటం కాదు.
రాజ్యాంగాన్ని కాపాడటం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. మన భవిష్యత్తును కాపాడటం.
ప్రశ్నలను అణచలేరు. ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. నిజాన్ని ఎఫ్ఐఆర్ లో బంధించలేరు.
అశ్వమిత్‌తో పాటు నిలబడదాం.
ఎందుకంటే ఈ రోజు అతడిని గొంతు నొక్కితే
రేపు మన గొంతుక కూడా అదే చేతుల్లో ఉంటుంది….
ప్రజలారా ప్రజాస్వామికవాదులారా, ఆలోచించండి..
అశ్వమిత్ గౌతమ్ పై అక్రమ కేసులను ఖందించండి…. ప్రజాస్వామ్యం కాపాడండి అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు అంబాల అశ్వద్ధామ మారపల్లి రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు

చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు…

చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

నిజాంపేట: నేటి ధాత్రి

చారిత్రాత్మక చరిత్ర కలిగిన శ్రీ తిరుమల నాథ స్వామి ఆలయం లో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చల్మెడ గ్రామ శివారులో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం, బండ్ల ఊరేగింపు, రథం తిరుగుట, పవళింపు సేవ కార్యక్రమాలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు కొనసాగిన బ్రహ్మోత్సవాలు బుధవారం చక్రస్నానంతో ముగింపు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ.. స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరిపై స్వామి వారి దయ, కృప, కటాక్షాలు ఉండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో జీవిస్తారన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, కాకి రాజయ్య ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

ఎంఐఎం లో యువ నాయకులు చెరిక…

ఎంఐఎం లో యువ నాయకులు చెరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ కు చెందిన పలువురు అభిమానులు ఆయా పార్టీల సీనియర్ నాయకులు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో కండువా కప్పుకొని ఎంఐఎం పార్టీలో చెరినట్లు, ఎంఐఎం కోహీర్ అద్యక్షులు మొహమ్మద్.రఫీ మహమ్మద్ మోయిన్ తెలిపారు. కోహిర్ మున్సిపాల్ ఎన్నికలలో పార్టీని బలపరిచి జండా ఎగరవేస్తామన్నారు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ బలోపేతానికి ప్రతి సైనికుడు కష్టపడి పనిచేయాలని సూచించారు

నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి…

నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్
జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రములో నిరుపేదలకు ఇల్లు మంజూరు అయినా, చాలా మంది ఆర్థిక సమస్యల మూలంగా నిర్మించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కొలతలు కూడా కొంత తగ్గించాలని,అదేవిదంగా ఎస్సి, ఎస్టీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్ మాదిగ, మలహర్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు..

ఓసి- జేఏసీ ఈడబ్ల్యూసి శేరిలింగంపల్లి అధ్యక్షులుగా బోయినపల్లి వినోద్ రావు..

ఓసి- జేఏసీ ఈడబ్ల్యూసి శేరిలింగంపల్లి అధ్యక్షులుగా బోయినపల్లి వినోద్ రావు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

ఓసి-జేఏసీ-ఈడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, శేరిలింగంపల్లి అధ్యక్షులుగా బోయినపల్లి వినోద్ రావు నియమితులయ్యారు. మదినగూడ లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓసి జేఏసీ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి వినోద్ రావుకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నల్ల సంజీవ రెడ్డి మాట్లాడుతూ అగ్రకులాల్లోని నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా ఓయూ జేఏసీ ఏర్పడిందని అన్నారు. ఇటీవల జరిగిన వరంగల్ సింహగర్జనను భారీ విజయవంతం చేసిన ఓసిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అగ్రకుల సంఘాల నాయకులందరూ ఏకమై ఓసీల్లోని నిరుపేదల హక్కులే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లిలోని అన్ని వర్గాల వారితో మంచి సత్సంబంధాలు కలిగిన వినోద్ రావుని ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా నిర్ణయించడం కావాలి జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ.. 1986 నుంచి తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశానని అన్నారు. హైదరాబాద్ కి వచ్చాక తన మిత్రుడు ప్రస్తుత కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ద్వారా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కు దగ్గర అయ్యానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశానని తెలిపారు. 2002లో శేరిలింగంపల్లి సేవాదళ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ YSR పాదయాత్రలో కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో నాటి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రంగారెడ్డి జిల్లా సేవాదళ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారని, ఆ తర్వాత గ్రేటర్ సేవాదళ్ చైర్మన్ గా సేవలందించాలని తెలిపారు. అదేవిధంగా మదినగూడ గ్రామంలో హనుమాన్ దేవాలయం చైర్మన్ గా ఆలయ పునర్నిర్మాణం లో కీలక భూమిక పోషించానని అన్నారు. ఈ క్రమంలోనే నా పనితీరును గుర్తించి ఓసీ జేఏసీ ఈడబ్ల్యూఎస్ జాతీయ, రాష్ట్ర నాయకత్వం నన్ను రాష్ట్ర కమిటీ లో ఉపాధ్యక్షుడిగా తీసుకొని శేరిలింగంపల్లి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని అన్నారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నియోజకవర్గంలో ఉన్న ఓసి కులాల్లోని నిరుపేదల అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఓసీలలో 10% మాత్రమే ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది ఉన్నారని మిగిలిన 90 శాతం మంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా అగ్రకులాల్లోని నిరుపేద విద్యార్థులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వైద్య ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడిన ఓసి వర్గాల్లోని ప్రతి ఒక్కరిని కలుపుకొని వారి హక్కుల కోసం పోరాడేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఓ సి జె ఎస్ సి మహా ధర్నాను విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి అగ్రకుల నిరుపేదలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసి జెఎసి రాష్ట్ర కార్యదర్శిలు కొడాలి శ్రీధర్, శేరి అంతిరెడ్డి, విద్యాసాగర్ సభ్యులు దండమూరి ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య…

పాఠశాలలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో మంగల్గి బక్కారెడ్డి (40) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చిన బక్కారెడ్డి, సోమవారం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు వెతికారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక మామిడి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఆస్తులు లేకపోవడం, పెళ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతని అన్న జగన్నాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం…

భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం.

మొగుళ్లపల్లి ఉపసర్పంచ్ హిమబిందు కోటేశ్వరరావు..

మొగుళ్లపల్లి నేటి దాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి ములకలపల్లి గ్రామాల మధ్య శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుంచి మొదలు కానుంది బుధవారం సారలమ్మ పైడి దరాజు గోవిందరాజు గద్దెలకు చేరుకుంటారు గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి ప్రతిష్టిస్తారు వనదేవతల గద్దెలకు చేరగానే భక్తులు మొక్కులు మొదలవుతాయి రెండేళ్లకోసారి నిర్వచించే ఈ మినీ జాతర సందర్భంగా మొగుళ్ళపల్లి ఉపసర్పంచ్ హిమబిందు కోటేశ్వరరావు మాట్లాడుతూ జాతర నిర్వాహకులు విశిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు అమ్మవార్లు గద్దెలను పుట్ట మన్ను పసుపు కుంకుమ పాలతో శుభ్రపరిచి ముగ్గులు వేసి అలంకరించారు సాంప్రదాయ రీతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు 1976లో సమ్మక్క సారలమ్మను ప్రతిష్టించారు సమ్మక్క సారలమ్మ జాతరకు భూమి దాత సమ్మక్క సారలమ్మ కమిటీఅధ్యక్షులుఆలూరి గంగాధర్ చేశారు రెండు వాగుల మధ్యలో సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతమైన రీతిలో జరుగుతుంది భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు

విద్యార్థులకు భారత రాజ్యాంగం బుక్కుల పంపిణీ…

విద్యార్థులకు భారత రాజ్యాంగం బుక్కుల పంపిణీ

కెవిపిఎస్, టిఏజిఎస్ జిల్లా కార్యదర్శులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత రాజ్యాంగమే భారత ప్రజలకు రక్షణ అని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అత్కూరి శ్రీదర్ అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బీసీ స్టూడెంట్ మేనేజ్మెంట్ గర్ల్స్ పాస్టర్స్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్ కస్తూరిబాయి హాస్టల్స్ లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం,కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం బుక్స్ బహుకరించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశంలో మత గ్రంథాలు కులాల,మతాల మధ్య అసమానతలు, వివక్షతలు పెంచి, ప్రజలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నించే తత్వాన్ని చంపితే, భారత రాజ్యాంగం మాత్రం అసమానతలను,వివక్షతలను తొలిగించడానికి కారణమైంది,ప్రశ్నించే తత్వాన్ని పెంచింది అన్నారు, భారత రాజ్యాంగం చదవడం ద్వారానే అణగారిన వర్గాలకు ఆత్మ స్థైర్యం వస్తుంది,హక్కులు పరిరక్షించబడతాయి అన్నారు, భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు,పాలకులు భారత రాజ్యాంగం మౌలిక సారూప్యతని దెబ్బతీసి,అశాస్త్రీయమైన భావజాలానికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి తిరోగామి శక్తులను నిలువరించాలంటే భారత పౌరులందరూ రాజ్యాంగాన్ని చదవాలి,అప్పుడు మాత్రమే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు, ఈ ప్రయత్నంలో భాగంగానే హాస్టల్స్ కు బుక్స్ బహుకరించడం జరిగింది

“ఆరూరి”రాజీనామా.

“నేటిధాత్రి”,హైదరాబాద్.
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

aroori Ramesh resigns from bjp

ఎల్లుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆరూరి రమేష్

చెరపకురా చెడేవు అంటే ఇదే!

`తన గోతిని తాను తవ్వుకున్న కాంగ్రెస్?

`2జి స్కాం జరక్కపోయినా లేని పోని రాద్ధాంతం చేసిందే కాంగ్రెస్?

`మిత్ర పక్షాన్ని ఇరికించి రాజకియం చేయాలనుకున్నది?

`తన గోతిని తానే తీసుకున్నది?

`ఇప్పుడు దిక్కు దివానం లేకుండా పోయింది?

`చేయని తప్పుకు డి ఎం కే ను ఇరికించి తప్పించుకోవాలనుకున్నది?

`డిఎంకె ను రాజకీయంగా బలిపశువును చేసింది?

`కర్మ తిరగబడితే దేశమంతా కాంగ్రెస్ నామారూపాలు లేకుండా పోయింది?

`కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు చేసిన మోసాలు అన్ని ఇన్ని కావు?

`బీహార్ లో లాలును ముంచారు?

`గడ్డి స్కామ్ పేరుచెప్పి దూరం చేసుకున్నారు?

`శరద్ పవార్ లాంటి నాయకుడిని దూరం చేసుకున్నారు?

`మమత బెనర్జీ లాంటి నాయకురాలు శక్తి ని తక్కువగా అంచనా వేశారు.

`ఆఖరుకు బి ఆర్ ఎస్ విలీనం లో కూడా దిక్కుమాలిన రాజకీయం చూపారు?

`వైస్ జగన్ విషయంలో కక్ష సాధింపు చర్యలు చేశారు.

`నమ్మిన పార్టీలను నట్టేట ముంచింది?

`నమ్మిన నాయకులను బలహీన పర్చూతూ వచ్చారు?

`నమ్మక ద్రోహుల మాటలు వింటూ వచ్చారు.

`ఇప్పటికి అదే దారిలో నడుస్తున్నారు.

`కాలానికి అనుగుణంగా రాజకీయాలు చేయలేక పోతున్నారు.

`జనం నాడిని అంచనా వేయలేకపోతున్నారు.

`ప్రతిసారి బొక్క బోర్లా పడుతున్నారు.

`గెలవడం చేత కాక గిల గిల కొట్టుకుంటున్నారు.

`రాజ్యాంగ వ్యవస్థలను అవమాన పరుస్తున్నారు.

`అన్ని వ్యవస్థలకు, వర్గాలకు దూరమై పోతున్నారు.

`కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా పగటి కలల్లోనే రాజకీయం చేస్తున్నారు.

`ఇప్పుడు రాజకీయ శిక్ష అనుభవిస్తున్నారు?

`లేని అవినీతి పేరుచెప్పి కేజ్రీ వాల్ వచ్చాడు?

`అదే అవినీతికి బాలయ్యాడు?

`అన్నా హాజరే అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయాడు?

`బీజేపీ ని నమ్మి కాంగ్రెస్ ను నిండా ముంచాడు?

`అప్పుడు కనీసం అన్నా హాజరే అనే పేరు వినిపించేది?

`చెజేతులా తన పేరు ప్రతిష్టలను తానే చేరిపేసుకున్నారు?

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్దితికి కారణం ఎవరో కాదు! ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు, అధినేతలే కారణం. రాజకీయాలలో మూస దోరణులు అనుసరిస్తూ గత మూడు దశాబ్దాలుగా ముందుకు సాగడమే అసలు వైఫల్యం. ప్రపంచీకరణతోపాటు, ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణమైన రాజకీయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమౌతోంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే నానుడిని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది. ఈ విధానమే తప్ప్పుడు నిర్ణయాల వైపు అడుగులు వేసేలా చేస్తోంది. గతం వేరు. వర్తమానం వేరు. భవిష్యత్తును అంచనా వేసుకోలేని రాజకీయాలు వధా! అందుకే గతం తాలుకు వైఫల్యాలను ఇంకా వెంటేసుకొని కాంగ్రెస్ వర్తమానంలో కూడా అడుగులు వేస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీ తిరోగమనం వైపు పరుగులు పెడుతోంది. ముందు వెళ్లాల్సిన పరుగు, వెనక్కి వెళ్తోంది. తరం మారుతున్నప్ప్పుడు యువతలో వచ్చే మార్పులకు అనుగుణంగా పార్టీలు మలుపులు తిరగాలి. అంతే కాని రాజకీయ పార్టీలు ఎంచుకున్న దారిలో ప్రజలు నడవాలని కోరుకోవడం సరైంది కాదు. జనం ఆలోచనలు పసిగట్టడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోతోందన్నది ఇంకా అర్ధం చేసుకోవడంలేదు. అలా అని బిజేపి వైఫల్యాలను ఎండగట్టడంలో కూడా పూర్తిగా విఫలం చెందుతోంది. నిజం చెప్పాలంటే ఈ పన్నెండేళ్ల బిజేపి పాలనలో వ్యవస్ధలన్నీ కుంటుపడుతున్నాయి. అయినా జనం బిజేపిని ఆదరిస్తున్నారు. నాయకులు అనుసరిస్తున్నారు. కొత్త తరం బిజేపిని అక్కను చేర్చుకుంటున్నారు. అందుకు ప్రజల ఆలోచనలను బిజేపి అనుసరిస్తోంది. జనం ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా అడుగులేస్తోంది. బిజేపి వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకొని రాజపకీయం చేస్తుందని కాంగ్రెస్ చెప్పడంలో అర్ధం లేదు. దేశ ప్రజలు కాంగ్రెస్‌పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అవకాశాలిచ్చారు. మరే పార్టీకి ఇవ్వనంత సమయం ఇచ్చారు. ఎమర్జెన్సీ లాంటి పరిస్దితులను సష్టించినా జనం కాంగ్రెస్ వైపే నిలిచారు. అయినా కాంగ్రెస్ పార్టీ జనాన్ని అర్దం చేసుకోవడం మానేసింది. మూస రాజకీయాలు చేయడం మాత్రమే నేర్చుకున్నది. ఎమర్జెన్సీ తర్వాత కూడా ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడమే అందుకు ఆ పార్టీకి శాపంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎమర్జెన్సీకి ముందు రాజకీయాలే ప్రజలు ఆదరిస్తున్నారన్న భ్రమల్లోనే కాంగ్రెస్‌పార్టీ రాజకీయాలు చేస్తూవచ్చింది. ఇప్ప్పుడు బొక్కా బోర్లాపడింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని వద్దని ఇప్పటికీ అనుకోవడం లేదు. బిజేపి ఎంత ముక్త్ కాంగ్రెస్ అని ప్రకటనలు చేసినా జనం ఎంతో కొంత కాంగ్రెస్‌కు అండగా నిలుస్తూనేవున్నారు. అయినా కాంగ్రెస్‌లో మార్పు రావడం లేదు. తర్వాత కాలంలో ఆ పార్టీ అనుసిరంచిన మూస విధానల మూలంగా నిండా మునిగిపోయింది. ఇప్ప్పుడు తేరుకోవడానికి తంటాలు పడుతోంది. అయినా ప్రజలు సానుభూతిని చూపించడం లేదు. ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజలు అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగా, వ్యవస్ధ పరంగా కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. అయినా బిజేపిని వద్దనుకోవడం లేదు. దేశంలో పన్నులు పెరిగాయి. ధరలు పెరిగాయి. ఉపాధి తగ్గింది. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. విద్య, వైద్యం కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోతోంది. చదువుకొనాలన్నా, వైద్యం చేసుకోవాలన్నా ఆస్ధులు అమ్ముకునే పరిస్ధితులు దాపురిస్తున్నాయి. అయినా ప్రజలు బిజేపి వైపే నిలుస్తున్నారు. కారణం అవినీతి రహిత పాలన అనేది బిజేపికి రక్షణ కవచడంగా మారిపోయంది. కాంగ్రెస్ పాలనలో అవినీతి అంటే పాలకులు చేసే అవినీతి మాత్రమే కనిపించేది. రాజీవ్ గాంధీ విషయంలో బోఫోర్స్ దేశరాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నాయకులు, పాలకులతోపాటు, ఆ పార్టీకి నమ్మకంగా మద్దతు తెలిపిన పార్టీలను సైతం కాంగ్రెస్ పార్టీ అవినీతి చట్రంలో ఇరికించుకుంటూ పోయింది. దాంతో దేశంలో వున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను నమ్మడం మర్చిపోయాయి. కాంగ్రెస్‌తో స్నేహం చేయడం వల్లనే ఆయా పార్టీలకు పుట్టగతులు లేకుండాపోయాయి. ఒకప్ప్పుడు బిహార్ అంటే లాలూ అనేవారు. అలాంటి బిహార్‌ను ఏకచత్రాదిపత్యంగా ఏలుతున్న లాలూకు అవినీతి మరకలు అంటించారు. ఆయనను జైలు పాలు చేశారు. ప్రజల్లో లాలూ నాయకత్వాన్ని పలుచన చేశారు. తద్వారా కాంగ్రెస్ తనను తాను ఆత్మహత్య చేసుకున్నది. లాలూ లాంటి లౌకిక వాదిని గడ్డి కుంభకోణంలో ఇరికించి, ఆయన ప్రస్తానాన్ని అడ్డుకున్నది. నితీష్ వెలుగులోకి వచ్చారు. ఇప్పటికీ రెండు దశాబ్దాలుగా పాలన సాగిస్తున్నాడు. అయినా ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వున్నా, ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. కారణం ఆయనను బిజేపి రక్షణ కవచంగా చూసుకుంటోంది. నితీష్ రాజకీయంగా బలమైన నాయకుడు. ఆయనను అనవసరంగా కెలికి రాజకీయంగా శుప్తావస్తకు #రుకోవడం కన్నా, కలిసి సాగడమే మేలని బిజేపి కదులుతోంది. ఇదీ బిజేపి అసలు రాజకీయం. దక్షిణాదిలో తమిళనాడు నుంచి కాంగ్రెస్‌కు ఆది నుంచి డిఎంకే మద్దతిస్తూ వుంది. కాని ఆ డిఎంకే నేతలు కనిమొలి, రాజాలను టుజి స్ప్రెక్ట్రమ్ స్కామ్‌లో తొంరపడి ఇరికించారు. తమిళనాడులో డిఎంకేను పరోక్షంగా దెబ్బకొట్టారు. దాంతో తన గోతిని తానే కాంగ్రెస్ తవ్వుకున్నది. ఇలా కాంగ్రెస్‌కు అండగా వున్న నాయకులను, పార్టీలను బలపశువులను చేస్తూ పోయింది. మహారాష్ట్రలో బలంగా వున్న పూర్వపు కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ రాజకీయాన్ని తుంచేదసింది. మహారాష్ట్రలో స్వయంకతాపరాధంతో కాంగ్రెస్‌కు నీడ లేకుండా చేసుకున్నది. ఇలా శరద్‌యాదవ్ లాంటి నాయకుడిని కూడా దూరం చేసుకున్నది. పశ్చిమబెంగాల్ సిఎం. మమతా బెనర్సీని కట్టడి చేసి, ఆమెకు రాజకీయం లేకుండా చేయాలనుకున్నారు. ఆమె ఏకంగా ఇప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయి, బెంగాల్‌ను పాలిస్తోంది. పార్టీని నమ్ముకొని వున్న నాయకులకు, పార్టీలకు పొగబెట్టి, పనికిరాని నాయకుల మాటలు విని సోనియాగాందీ పార్టీని నిండా ముంచేసిందని చెప్పడంలో సందేహమే లేదు. చెరపకురా చెడేవు అనే సామెతను నిజం చేసుకున్న వారిలో డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చేరిపోయారు. అవినీతి మచ్చలేని అదికారిగా ఆయనకు 2013 వరకు పేరుంది. ఆ పేరును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారు. జనం మెచ్చారు. ఆదరించారు. డిల్లీ ముఖ్యమంత్రిని చేశారు. ఆఖరుకు ఆయన కూడా అవినీతి పరుడనే ముద్రను తగిలించుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. వరుసగా మూడుసార్లు విజయం సాదిండచంతో ఆయన ఇక తాను ఆడింది ఆట పాడింది పాట అవుతుందని అనుకున్నారు. పార్టీని విస్తరించి, దేశ రాజకీయాలను ఏలాలనుకున్నారు. రాజకీయంగా పార్టీ విస్తరించడం అనేది గొప్ప విషయమే. ఆ విస్తరణ ప్రజా విస్తరణలా వుండాలే కాని, సామ్రాజ్య విస్తరణలా వుండకూడదని తెలుసుకోలేకపోయారు. దాదాపు దక్షిణాదికి చేరువయ్యే క్రమంలో తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారు. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చారు. గుజరాత్‌లో కూడా సీట్లు గెల్చుకున్నారు. ఉత్తరాదిలో ఊపేయాలనుకున్నారు. తన చీపురుతో అవినీతిని పార్టీలను ఊడ్చేస్తామని చెప్పారు. లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకున్నారు. ఒక్కసారి అవినీతి మరకలు అంటుకున్న తర్వాత వాటిని కడుక్కోవడం చాలా క ష్టం. కాలం మారుతున్నా ఆ మరక చెరిపేసుకోవడం ఈ రోజుల్లో సాద్యం కాదు. పదేళ్ల క్రితం చేసిన తప్ప్పులు కూడా సోషల్ మీడియాలో నిక్షిప్తమై వుంటాయి. ఎప్పటికప్ప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అందుకే బిజేపి అనేది అవినీతి మరÅ£లు అంటించుకోకుండా సాగుతోంది. ప్రతిపక్షాలన్నీ బిజేపిని నిందించాలంటే అదాని, ఆదాని అంటారే గాని, ఏ ఒక్క మంత్రికి అవినీతి మరకలు అంటించలేకపోతున్నారు. ఇదీ బిజేపి సాగిస్తున్న ఆసక్తికరమైన రాజకీయం. అవినీతిపై యద్దం మొదలుపెట్టి దీక్షలు, నిరసనలు చేసి దేశమంతా ఒక్కటి చేసిన, అన్నా హజారే లాంటి వారు అడ్రస్ లేకుండాపోయారు. కాంగ్రెస్ లేకుండా చేస్తే అవినీతి అంతమౌతుందనుకున్నాడు. కాని బిజేపి గెలిస్తే కనీసం ప్రశ్న కూడా వినపడని రాజకీయాలు వస్తాయని ఊహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ప్రశ్నించేందుకు అవకాశం వుండేది. ఇప్ప్పుడు ఆ ప్రశ్నకు కూడా అవకాశం లేకుండాపోయింది. ఇలా కొంత మంది నాయకులు, పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ చేసుకున్న స్వయంకతాపరాథమే మొదటికే మోసం తెచ్చింది. తేరుకోకుండా చేసుకున్నది.

అమరావతి సరే…ఆహారభద్రత మాటేంటి?

· రాజధాని కొలిక్కిరావడానికి పుష్కరకాలమా?

· ఛత్తిస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్‌ల అభివద్ధిని గమనించారా?

· ఏర్పడిన రెండు దశాబ్దాల్లో అద్భుతమైన ప్రగతి

· రాజధానిపై నిర్ణయానికి పన్నెండేళ్లు కావాలా?

· రాజకీయ విభేదాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేయడం అన్యాయం

· అమరావతి నిర్ణయంలో ఔచిత్యమెంత?

· అమరావతి భూములతో 2.5కోట్ల మందికి ఆహారభద్రత

· 50వేల ఎకరాలపై రైతులకు రూ.165 కోట్ల నుంచి రూ.250కోట్ల నికర లాభం

· ఈ స్థాయి దిగుబడినిచ్చే భూములను ప్రభుత్వం అభివద్ధి చేయగలదా?

· రియల్ ఎస్టేట్ ఏ భూముల్లోనైనా చేయవచ్చు

· అన్నపూర్ణ వంటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చడం అన్యాయం

· రోటీ, కపడా ఔర్ మకాన్ తర్వాతనే ఏదైనా

· వెనుకబడిన రాష్ట్రాల అభివద్ధి తీరు ఆదర్శం కావాలి

· ఆకాశానికి నిచ్చెనలు వద్దు

· ప్రభుత్వం వాస్తవాన్ని విశ్లేషించుకోవాలి

· రాజకీయం కాదు, రాష్ట్రహితం ముఖ్యం

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

పార్లమెంట్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించడం తాజా పరిణామం. రాష్ట్రానికి కేంద్ర స్థానంలో వుండి అన్ని ప్రాంతాలకు అందుబాటు లో వుండే అమరావతి చట్టబద్ధ రాజధానిగా రూపొందటం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఆనందం కలిగించవచ్చు. రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని సమస్య అధికారపార్టీకి అనుగుణంగా మారిపోతుండటం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పుష్కరాలం గడిచినా ఇప్పటివరకు రాజధాని సమస్య ఒక కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కార ణం. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీల మధ్య రాజధానిపై ఏకాబిప్రాయం లేదు. తెలుగుదేశం అమరావతి కేంద్రీకత రాజధాని కావాలని కోరుతుండగా, వైఎస్సార్సీపీ మాత్రం వికేంద్రీకత అభివద్ధి రాష్ట్రానికి అవసరమంటూ, విశాఖ (కార్యనిర్వాహక), అమరావతి (శాసన), కర్నూలు (న్యాయ) నగరాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. నిజం చెప్పాలంటే మొదటినుంచి మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య రాజ ధాని విషయంలో ఏకాభిప్రాయం లేదన్న మాట వాస్తవం. అనేక తర్జనభర్జనల తర్వాత వాదోపపవాదాలు, మీడియా విశ్లేషణలు, కమిటీల నివేదికల నేపథ్యంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ మూడు ప్రాంతాల్లో ప్రతి దానికి సానుకూలత, ప్రతికూలతలు తప్పనిసరిగా వుంటాయి. దురదష్టవశాత్తు తెలుగుదేశం, వైసీపీలు ఒకరు చెప్పినదా న్ని మరొకరు ఆమోదించకపోవడం, ప్రభుత్వాలు మారడంతో రాజ ధాని విషయం ఎటూ తేల కుండానే పుష్కరకాలం దాటిపోయింది. ఇందుకు ప్రజల కంటే కూడా రాజకీయ పార్టీల వైఖరులనే నిందించాలి. రాజకీయ విభేదాలున్నా, రాష్ట్ర విశాలహితం కోసం అవి కలిసి పనిచేయడం వాటి విద్యుక్త ధర్మం. దురదష్టవశాత్తు దీన్ని ఈ రెండు పార్టీలు విస్మరించాయి. దీనివల్ల మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.

ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 2000, నవంబర్ 1న ఏర్పాటైంది. తక్షణమే తా త్కాలిక రాజధానిగా రాయ్‌పూర్ పనిచేయడం ప్రారంభమైంది. తర్వాత 10`15 సంవత్సరాల కాలంలో నయా రాయ్‌పూర్ (అటల్‌నగర్) ప్రణాళికాబద్ధ నగరంగా రూపొంది మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటయ్యాయి. పరిపాలన, ప్రజాసౌకర్యాలు ఏర్పాటు కావడమే కాదు, 2020 నాటికి ఈ సదుపాయాలు మరింత విస్తరించాయి కూడా! అదేవిధంగా 2000, నవంబర్ 15న ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. తక్షణమే రాజధానిలో రాజధాని కార్యక్రమాలు మొదలయ్యాయి.అసెంబ్లీభనవాలు, హైకోర్టు, సమగ్ర పట్టణీకరణ వంటివి 15`20 ఏళ్లలో పూర్తయ్యాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా 2000, నవంబర్ 9న ఏర్పాటైంది. తర్వాత మూడు నుంచి పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. 2020 నాటికి రాష్ట్రం సుస్థిరమైన వద్ధిని నమోదు చేసింది. ఉత్తరాఖండ్ పర్వతాలతో నిండిన ప్రాంతం కావడంతో 2003లో కేంద్రం అందించిన సహకారంతో హరిద్వార్, సంత్‌నగర్, సెలాకి, సితార్‌గంజ్‌లను ప్రధాన పారిశ్రామిక పట్టణాలు గా అభివద్ధి చేసింది. 2000`19 మధ్య కాలంలో పారిశ్రామిక కార్మికుల సంఖ్య 12 రెట్లు భా రీగా పెరిగింది. ఆవిధంగా కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాలను పరిశీలిస్తే రెండు దశాబ్దాల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించడం మన కళ్లముందు కనిపిస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్‌కు ఏమైంది? 12 సంవత్సరాలు పూర్తికావస్తున్నా ఇంకా రాజధాని నిర్ణయం రాజకీయాల మధ్య కొరుకుడు పడని సమస్యగా మిగిలిపోవడం ప్రజల దౌర్భాగ్యం.

చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానంలో పెద్ద లోపమేంటంటే ఒకేసారి లక్షకోట్లు పెట్టుబడి పెట్టి రాజధానిని ఏకంగా సింగపూర్ తరహాలో అభివద్ధి చేయాలన్న ఆచరణ సాధ్యంకాని సంకల్పాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఒకేసారి లక్షకోట్లు సమీకరణ సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే రాష్ట్రం అప్పులు రూ.పదిలక్షల కోట్లు దాటిపోయింది. దీనికి తోడు అధికారం కోసం ఉచితాలను ఎడాపెడా ప్రకటించడంతో వాటికి నిధులు లేక, అమలు సాధ్యం కాక చేతులెత్తేసే పరి స్థితి! ఈ వైఫల్యాలను విపక్ష వైసీపీ క్యాష్ చేసుకొని ప్రజల్లోకి ప్రచారానికి వెళుతోంది. ఇది సహజం. మరి వచ్చేసారి తమ ప్రభుత్వమే వస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ వైస్ జగన్‌కూ వుండదు. అందువల్ల వీరిద్దరిమధ్య అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు అహంకారానికి పోకుండా రాష్ట్ర హితం కోసం రాజధానిపై ఒకే తాటిపై నిలబడాలి. ఇప్పుడు వైసీపీ కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను ఎట్టకేలకు విరమించుకున్నది కనుక, ఇరు పార్టీలు ఉమ్మడిగా అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన అభివద్ధిపై దష్టి పెట్టాలి. మీరు ఓకే అన్నప్పుడు మాత్రమే కేంద్రం నుంచి సహాయం అందుతుంది. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివద్ధి చెందిన రాష్ట్రం. ఆ మూడు రాష్ట్రాలు ఏర్పాటైన రెండు దశాబ్దాల కాలంలో సాధించిన పురోగతిని దష్టిలో పెట్టుకోవాలి. పూర్తి పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం రూ.22లక్షల కోట్లతో రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయా లు అభివద్ధి చెందుతున్నాయి. నిజానికి నయారాయ్‌పూర్ విస్తీర్ణం 8వేల నుంచి 20వేల ఎకరా లు. ఝా ర్ఖండ్ రాజధాని రాంచీని స్మార్ట్ సిటీపేరుతో 65`657 ఎకరాలో అభివద్ధి చేస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని డెహ్రాడూన్ కాగా వేసవి రాజధాని గైర్‌సైన్. డెహ్రాడూన్ విస్తీర్ణం 74,131 ఎకరాలు. అదే గైర్‌సన్ తహసీల్ ప్రాంత విస్తీర్ణం 501 చదరపు కిలోమీటర్లు. ఆవిధంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు వాటికి అందుబాటులో వున్న భూభాగాల్లో, అనువైన విస్తీర్ణంలో కొత్త రాజధానులను ని ర్మించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎంచుకున్న ప్రాంతం భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు మధ్యలో వున్నప్పటికీ ఆర్థిక, పర్యావరణ పరంగా ఇక్కడ కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు. అదీకాకుండా మిగిలిన మూడు కొత్త రా ష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తున్న భూమి అత్యంత సారవంతమైంది. రాష్ట్రాన్నిఅన్నపూర్ణగా మలుస్తున్న సుక్షేత్రమైన కష్ణా పరీవాహక ప్రాంతం. ప్రభుత్వం మొత్తం 50వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 2015లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 34385 ఎకరాలను తెలుగుదేశం ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు మరో 16వేల నుంచి 20వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 

ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో సగటున ఎకరాకు 2వేల నుంచి 2800 కిలోల వరకు దిగుబడి వుంటుంది. అంటే ఒక ఎకరాకు సగటున 2.5టన్నుల వరి దిగుబడి వస్తుందని భావిస్తే 50వేల ఎకరాల్లో మొత్తం దిగుబడి 125వేల టన్నులు (1.25లక్షల మెట్రిక్ టన్నుల) అవుతుంది. ఈ 125 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంతో 2.49కోట్ల మంది ప్రజలకు నెలరోజుల పాటు ఆహారం లభిస్తుంది. అమరావతిలో ఖరీఫ్, రబీ పంటలు పండిస్తారు కనుక వార్షికంగా ఈ దిగుబడి చాలా అధికం. ఇప్పుడు ప్రభుత్వం సేకరించే 50వేల ఎకరాల్లో 42వేల ఎకరాలు సాగుభూమి. వీటిల్లో 36వేల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం వుంది. అంతేకాకుండా ఇవి వర్షాకాలంలో వరదలకు గురవుతుంటాయి. అమరావతి చుట్టు పక్కల గ్రామాల్లో పత్తి, పప్పుధాన్యాలు, మొక్క్పు£న్న, చెరకు, అరటి, మామిడి వంటి పంటలను కూడా సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో రైతులు బంతి వంటి పువ్వులతో పాటు వందరకాల పంటలు పండిస్తారు. ఇవి రైతులకు ఎంతో రాబడినిస్తాయి. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే రైతుకు ఎకరానికి రూ.33వేల నుంచి రూ.51,200 వరకు లాభం వుంటుంది. అంటే 50వేల ఎకరాలకు కలిపి రూ.165 కోట్ల నుంచి రూ.250కోట్ల నికర లాభాన్ని రైతులు పొందుతున్నారు. ఇక మిర్చి, మిగిలిన ఉద్యానవన పంటల ద్వారా రైతులకు గణనీయమైన ఆదాయం లభిస్తుంది.

పై గణాంకాలను పరిశీలిస్తే రాజధాని నగరానికి ఇంతటి సుక్షేత్రమైన సాగుభూమిని సేకరించ డం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. రాజధాని నిర్మాణమంటే భవనాలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వస్తాయి. వీటిని మరే ఇతర సాగుపరంగా తక్కువ ప్రా ధాన్యత కలిగిన భూముల్లో కల్పించవచ్చు. ఏ భూమి సేకరించినా అక్కడ మౌలిక సదుపాయాలుకల్పించాల్సిందే. ఈ ఖర్చులో ఎక్కడా తేడారాదు. కానీ కోట్లమంది ప్రజలకు ఆహారాన్ని అందిం చే ప్రాంతాన్ని కాంగ్రీట్ జంగిల్‌గా మార్చడం ఎంతవరకు సబబు? రాబోయే కాలంలో పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలో సాగునీటి వసతిలేని భూములు 36% వరకు వుండగా 63.9% భూములకు నీటి సదుపాయం వుంది.స్థూల నీటిపారుదల విస్తీర్ణం 6.28 మిలియన్ హెక్టార్లు కాగా, వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతం అధికం. ఇక రాయలసీమ ప్రాంతంలో కేవలం 8.87% భూములు మాత్రమే న మ్మదగ్గ నీటిపారుదల సౌకర్యాన్ని కలిగివున్నాయి. 41% నుంచి 49% వరకు భూగర్భ జలాలపైఆధారపడి వ్యవసాయం కొనసాగుతోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఎల్లప్పుడూ నీటివసతి పుష్కలంగా వుండి, అన్నపూర్ణగా వున్న ఈ ప్రాంతాన్ని రాజధాని పేరుతో కాంక్రీట్ జంగిల్‌గా మా ర్చడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటనేది అర్థం కాదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కొన్ని కోట్లమందికి ఆ హారభద్రత సమస్య ఏర్పడుతుంది. ప్రజాహితం కోరే ఏ ప్రభుత్వమైనా, ఇటువంటి కార్యక్రమాలను తక్కువ నీటి వనరున్న ప్రాంతాల్లో చేపట్టడం సహజం. దీనివల్ల ఆ ప్రాంతాలకు కొన్ని సదు పాయాలు అందుబాటులోకి రావడమే కాదు, ప్రభుత్వ చర్యలవల్ల అక్కడ నీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశ ముంటుంది. అటువంటి వెనుకబడిన ప్రాంతాలు అభివద్ధి చెందుతాయి కూడా. కేవలం రాజకీయ ప్రయోజనం, రియల్ ఎస్టేట్ సంపాదన కోసం లేదా కొందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ లాభాల మాట అట్లావుంచి భవిష్యత్తులో ఆహారభద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశాలే ఎక్కువ. పోనీ ఇక్కడ సేకరించిన భూమి విస్తీర్ణంలో మరే ఇతర ప్రాంతంలోనైనా ఇంతటి సారవంతమైన భూములను ప్రభుత్వం అభివద్ధి చేయగýదా? ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే నదులు, సెýయేర్లు ఇతర నీటి వనరులు ప్రకతి ప్రసాదితాలు. కొత్తగా ఏర్పడిన ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలను పరిశీలి స్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని నిర్ణయించడంలోనే పుష్కరకాలం జాప్యం చేసి ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు తప్పుడు నిర్ణయంతో సారవంతమైన భూములను నిరుపయోగం చే యడమే కాదు, ఆహార ఉత్పత్తికి విఘాతం కలిగిస్తోంది.

*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో…..

*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో..

+ఘనంగా 77.వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు..

తిరుపతి(నేటి ధాత్రి:

 

తిరుపతిలోని గాంధీ రోడ్డులో కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చమంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డా. పి.సి. రాయులు మాట్లాడుతూ, కస్తూర్భా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జనవరి 26ను దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలతో మనంగా జరుపుకుంటారని చెప్పారు. దాదాపు 200 సంవత్సరాల బొటిష్ పాలన అనంతరం 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో సంపూర్ణ స్వయంప్రభుత్వం లభించిందని గుర్తు చేశారు.
ఆనాటి నుండి నేటి వరకు భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతర దేశాలతో పోటీపడుతూ ముందుకు సాగుతోందన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కస్తూర్భా గాంధీ ట్రస్ట్ పేదలు, వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని,
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
గాంధీ స్మృతి & దర్శన్ సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్ పేదలు, అవసరమైన వారికి సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ సమితి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుండగా, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చైర్మన్ గా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షులు
చమంతి శ్రీనివాస్, గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. సమానత్వం, న్యాయం. స్వేచ్ఛ. ఆర్థిక స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరి అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, గత నేతలు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా ముందుకెళోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప మేయర్ ఆర్.సి. ముని కృష్ణ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యాలయ సిబ్బంది. బండి మధుసూదన్ రెడ్డి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

“గణతంత్ర దినోత్సవం” సర్పంచ్ జోరుక సదయ్య.

“గణతంత్ర దినోత్సవం” సర్పంచ్ జోరుక సదయ్య.

మొగులపల్లి నేటి దాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల లోని పర్లపల్లి గ్రామ పంచాయతీ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన *పర్లపల్లి గ్రామ – సర్పంచ్ “జోరుక సదన్న” *
వారితిపాటు గ్రామ *ఉప సర్పంచ్ “దిండిగల సత్యనారాయణ” గారు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి
సర్పంచ్ జోరుక సదయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిన మహాత్ర గ్రంథం అని రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి భారతీయుని బాధ్యతని అన్నారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అవసరం ఉందని పేర్కొన్నారు అభివృద్ధి సామాజిక న్యాయం ప్రజాస్వామ్య పర్యవేక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ సర్పంచ్ లు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యావంతులు, యువకులు, RMP వైద్యులు, గ్రామ కుల సంఘాల పెద్దలు, మహిళా మండలి సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, ఇతరులు పాల్గోనడం జరిగింది.

*

వనపర్తి గాంధీ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు…

వనపర్తి గాంధీ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మున్సిపల్ఎన్నికలలో ఆర్యవైశ్య లు పోటీ చేయాలి న్యాయ వాది రామకృష్ణ

వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈకార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బిజెపి నేత బచ్చురాo కోశాధికారి ఏపూరి శ్రీనివాసులు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజ్ లగిశేట్టి అశోక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కోట్ర రామకృష్ణ న్యాయవాది దార వెంకటేష్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ మాజీ వర్తక సంగం అధ్యక్షులు లగిశెట్టి నరసింహ లగిశెట్టి సాయి ప్రసాద్ వర్తక సంగం ట్రెజరర్ వై వెంకటేష్ దోమ శివ కె.బి శ్రీనివాసులు బొడ్డు శంకర్ చుక్కయ్య వజ్రాల సాయిబాబా కాలూరి భాస్కర్ కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పిన్నo వసంత నరేందర్ మాజీ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ ఆర్యవైశ్యులు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈసందర్భంగా న్యాయవాది కొట్ర రామకృష్ణ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు ఏ పార్టీ తరఫున పోటీ చేసిన తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఆర్యవైశ్యులు మున్సిపల్ 33 వార్డులో పోటీ చేయుటకు ముందుకు రావాలని నామినేషన్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయంగా ఆర్యవైశ్యులు బలోపేతం కావాలని కోరారు గత మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ గద్వాల్ మున్సిపాలిటీలో ఆర్య వైశ్యులు మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించారని కౌన్సిలర్లుగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు .మున్సిపల్ కౌన్సిలర్లు గా ఆర్యవైశ్యులు విజయం సాధించి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు

రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం…

రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

రాజ్యాంగం మన భారతదేశానికి దిశా నిర్దేశం అని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక మహా గ్రంథమని స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడు లో దేశభక్తి ఐక్యత సోదర భావాన్ని మరింత బలపరిచే పర్వదినం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మాసంపల్లి అఖిల్, నాయకులు బత్తిని మల్లయ్య, పరికి త్యాగరాజు, మాసంపల్లి ప్రభాకర్, బిక్షపతి, హరీష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న…

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న *
బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు

మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

రిపోర్టర్ మొగుళ్ళపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బలుగూరు తిరుపతిరావుజాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతానికి వందనం సమర్పించారు. బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
వారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధు లు నేలకొరిగి తమ ప్రాణాలను తృక్ష వ్రాయంగా వదిలిపెట్టి మనందరికీ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన ఈ శుభ దినమే మన స్వాసంత్ర దినోత్సవం దేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది ప్రపంచ దేశాల్లో అన్ని విధాల బలమైన శక్తిగా భారతదేశ ఎదుగుతుందన్న ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు భద్రతకు ప్రగతికి సమైక్యగా కృషి చేసేందుకు భారత పౌరులు ఎంతగానో తోడ్పడుతున్నారని తెలిపారుఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొడారి రమేష్ యాదవ్ వెంకట్రావు గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమల్ల రమేష్ దేవునూరి కుమార్ చెక్క శ్రీధర్ చిలుక మారిశ్రీనివాస్ ఆర్షం మహేష్ బత్తిని నరహరి శనిగరపు శ్రీనివాస్ బండారి రామస్వామి బిక్షపతి రాస ప్రశాంత్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version