ఉప సర్పంచ్ ఉప్పలయ్య కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేత…

ఉప సర్పంచ్ ఉప్పలయ్య కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేత

అప్పయ్యపల్లి ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్

గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో ఇటీవలే స్వర్గస్తులైన దొంతుల ఉప్పలయ్య కుమారుడు కోడలు ఆయన దొంతుల రవి సమ్మక్క లకు అప్పయ్యపల్లి గ్రామ ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్ 50 కిలోల బియ్యం అందించి వారి కుటుంబాన్ని ఓదార్చి వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోలెడ్ల ప్రభాకర్ రెడ్డి యాదవ సంఘం మండల అధ్యక్షులు దోమల రాజయ్య, కందికొండ అనిల్ ,నేతగాని రాజేష్ గ్రామ నాయకులు పాల్గొన్నారు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఆమనగల్/ నేటి ధాత్రి:

ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు విటాయిపల్లికి చెందిన వెంకటయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము మంగళవారం వెంకటయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు. తనవంతు సహాయంగా 3 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంచుకొండ జగదీష్, గ్రామ అధ్యక్షుడు శంకర్ నాయక్, చంద్రు నాయక్, మాజీ సర్పంచ్ సాలయ్య, పాపయ్య, కిషోర్ నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్, శ్రీను తదితరులు ఉన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నుండి 25 కేజీల బియ్యం అందజేత…

బిఆర్ఎస్ పార్టీ నుండి 25 కేజీల బియ్యం అందజేత

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన అజంతా యూత్ అసోసియేషన్ తోలి అధ్యక్షుడు అయిన మిట్టపల్లి రమేష్ తల్లి మిట్టపల్లి సరోజన మరణించినారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి పార్టీ తరుపున 25కేజీ రైస్ అందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మార్త శ్రీనివాస్, దాసరి రాములు, బి ఆర్ ఎస్ పార్టీ 2వ వార్డ్ మెంబర్ బానోత్ మధుకర్, రత్నం రాజు,భీష్మచారీ, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి

వీణవంక, నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోరె చంద్రయ్య మంగళవారం రోజు మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించి,వారి కుటుంబాన్ని ప్రగడ సానుభూతి తెలియజేశారు మృతుడి కుటుంబానికి 5000 /- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో తనవెంట వీణవంక మండల ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పల్లెర్ల కిరణ్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మల సమ్మయ్య, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

నాయక్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత..

నాయక్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలలోని అందుకుతండా గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు. కి,,శే బానోతు మంగ్తే నాయక్(గుండు) మరణించడం జరిగింది. వారి కుటుంబానికి 6వ వార్డు మెంబెర్ పుల్లల పద్మ-సదయ్య* 50 కిలో ల సన్న బియ్యం నిత్యావసరాలు వస్తువులు వారి వంతుగా సహకారం అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ *గ్రామ అధ్యక్షులు దాసరి తిరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా మోహన్ సీనియర్ నాయకులు బానోత్ రాజు దాసారపు దేవదాస్ లావుడ్యా రాకేష్ పాల్గొన్నారు.

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం…

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రి

 

 

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య ఆదేశాలమేరకు
దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించిన
మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ
ములుగు జిల్లా మంగపేట మండలం పెరకలకుంట గ్రామం లో నిరుపేద కుటుంబంకు చెందిన మడకం నరెందర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ పరామర్శించి మనోధైర్యం కల్పించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు.ఇలాంటి సంధర్బంలోనే ధైర్యంగా ఉండాలని అన్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి దశదిన కర్మలకు 50 కేజీ ల బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్..

ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం బండారి రాజవ్వ (80)అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు దశదినకర్మ నిమిత్తం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గేరిగంటి బాబు, పప్పుల సిద్ధరాంరెడ్డి, ఆముద రాజు, కొమ్మాట సుధాకర్, తాడెం మల్లేశం, తాళ్లపల్లి కిషోర్, బండారి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version