విద్యార్థులకు భారత రాజ్యాంగం బుక్కుల పంపిణీ
కెవిపిఎస్, టిఏజిఎస్ జిల్లా కార్యదర్శులు
భూపాలపల్లి నేటిధాత్రి
భారత రాజ్యాంగమే భారత ప్రజలకు రక్షణ అని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అత్కూరి శ్రీదర్ అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బీసీ స్టూడెంట్ మేనేజ్మెంట్ గర్ల్స్ పాస్టర్స్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్ కస్తూరిబాయి హాస్టల్స్ లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం,కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం బుక్స్ బహుకరించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశంలో మత గ్రంథాలు కులాల,మతాల మధ్య అసమానతలు, వివక్షతలు పెంచి, ప్రజలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నించే తత్వాన్ని చంపితే, భారత రాజ్యాంగం మాత్రం అసమానతలను,వివక్షతలను తొలిగించడానికి కారణమైంది,ప్రశ్నించే తత్వాన్ని పెంచింది అన్నారు, భారత రాజ్యాంగం చదవడం ద్వారానే అణగారిన వర్గాలకు ఆత్మ స్థైర్యం వస్తుంది,హక్కులు పరిరక్షించబడతాయి అన్నారు, భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు,పాలకులు భారత రాజ్యాంగం మౌలిక సారూప్యతని దెబ్బతీసి,అశాస్త్రీయమైన భావజాలానికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి తిరోగామి శక్తులను నిలువరించాలంటే భారత పౌరులందరూ రాజ్యాంగాన్ని చదవాలి,అప్పుడు మాత్రమే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు, ఈ ప్రయత్నంలో భాగంగానే హాస్టల్స్ కు బుక్స్ బహుకరించడం జరిగింది
